By: ABP Desam | Updated at : 18 Nov 2021 12:29 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్
భారత స్టాక్ మార్కెట్లు గురువారం తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా సెంటిమెంట్ బలహీనంగా ఉండటం, ద్రవ్యోల్బణం భయాలు, యూఎస్ ఫెడ్ రేట్ల పెంపు వంటివి మదుపర్లపై ప్రభావం చూపించాయి. దాంతో ఉదయం ఫ్లాట్‌గా ఆరంభమైన సూచీలు ఇప్పుడు భారీగా పతనం అవుతున్నాయి.
గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 500 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. క్రితం రోజు 60,008 వద్ద ముగిసిన సూచీ నేడు 59,968 వద్ద ఆరంభమైంది. 60,177 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత మదుపర్లు విక్రయాలు చేపట్టడంతో ఇంట్రాడే కనిష్ఠమైన 59,423ను తాకింది. ప్రస్తుతం 528 పాయింట్ల నష్టంతో 59,479 వద్ద కొనసాగుతోంది. క్రితం రోజు 17,898 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ నేటి ఉదయం 17,890 వద్ద మొదలైంది. 17,708 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకి 185 పాయింట్ల నష్టంతో 17,713 వద్ద కొనసాగుతోంది.
నిఫ్టీలో 43 కంపెనీలు నష్టాల్లో కొనసాగుతుండగా 7 మాత్రమే లాభాల్లో ఉన్నాయి. పవర్‌గ్రిడ్, ఎస్‌బీఐ లైఫ్, ఆసియన్ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ లాభాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్, ఐచర్ మోటార్స్, ఎం అండ్ ఎం, హెచ్‌సీఎల్ టెక్, హీరో మోటోకార్ప్ రెండు శాతానికి పైగా నష్టాల్లో ఉన్నాయి. ఇక సఫైర్ ఫుడ్స్ రూ.1180 ఇష్యూ ధరతో పోలిస్తే మెరుగైన ప్రీమియంతో రూ.1360 వద్ద నమోదైంది. మరోవైపు పేటీఎం రూ.2150తో పోలిస్తే 9 శాతం డిస్కౌంట్‌తో రూ.1950 వద్ద లిస్టైంది. ఆ తర్వాత మరింత నష్టపోయింది.
Also Read: Government Deposit Scheme: నెలకు రూ.12,500 పెట్టుబడి పెడితే రూ.కోటి మీ సొంతం.. ఏంటా పథకం?
Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?
Also Read: EPFO Equity Investment: స్టాక్‌మార్కెట్లో ఈపీఎఫ్‌వో లాభాల పంట.. రూ.40,000 కోట్ల రాబడి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Petrol Diesel Price 18th May 2022 : తెలుగు రాష్ట్రాలో స్వల్పంగా తగ్గిన పెట్రోల్, పెరిగిన డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా
Gold Silver Price Today 18th May 2022 : గోల్డ్ ప్రియులకు షాకింగ్ న్యూస్, నేడు భారీగా పెరిగిన బంగారం రేట్స్, స్వల్పంగా పెరిగిన వెండి
Bharti Airtel Q4 Earnings: జియోను బీట్ చేసిన ఎయిర్టెల్ ARPU, రూ.2007 కోట్ల బంఫర్ ప్రాఫిట్
Cryptocurrency Prices Today: క్రిప్టో క్రేజ్! బిట్‌కాయిన్ సహా మేజర్ క్రిప్టోలన్నీ లాభాల్లోనే!
Stock Market News: మంగళకరం! ఒక్క సెషన్లోనే రూ.7 లక్షల కోట్లు పోగేసిన ఇన్వెస్టర్లు!
Pithapuram News : పిఠాపురంలో దారుణ హత్య, భార్యను కాపురానికి పంపలేదని అత్తపై అల్లుడు దాడి
Corona Cases: దేశంలో కొత్తగా 1,829 కరోనా కేసులు- 33 మంది మృతి
Someshwara Temple: శబరిమల, అరుణాచలం తర్వాత అతిపెద్ద జ్యోతి కనిపించే ఆలయం ఇదే
Minister KTR UK Tour : పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ యూకే టూర్, కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు