అన్వేషించండి

Stock Market Today: ఫ్లాట్‌గా మొదలై నష్టాల్లోకి! సెన్సెక్స్‌ 304 డౌన్‌, 17300 దిగువన నిఫ్టీ

Stock Market Telugu update: బెంచ్‌మార్క్‌ సూచీలు ఫ్లాట్‌గా కదలాడాయి. మిగిలిన సూచీలూ రేంజ్‌బౌండ్‌లోనే ట్రేడ్‌ అయ్యాయి. క్రూడాయిల్‌ సెగ తగ్గినా ద్రవ్యోల్బణం నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.

Stock Market Telugu update: స్టాక్‌ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి. బెంచ్‌మార్క్‌ సూచీలు ఉదయం నుంచీ ఫ్లాట్‌గా కదలాడాయి. మిగిలిన సూచీలూ రేంజ్‌బౌండ్‌లోనే ట్రేడ్‌ అయ్యాయి. క్రూడాయిల్‌ సెగ తగ్గినా ద్రవ్యోల్బణం నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఉత్సాహంగా కొనుగోళ్లు చేపట్టలేదు. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 304 పాయింట్లు నష్టపోగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలకమైన 17,300 దిగువన ముగిసింది.

BSE Sensex

క్రితం సెషన్లో 57,989 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 58,198 వద్ద మొదలైంది. ఉదయం నుంచి సూచీ ఫ్లాట్‌గానే ట్రేడ్‌ అయింది. 58,000-58,200 మధ్యే రేంజ్‌బౌండ్‌లో కదలాడింది. ఐరోపా మార్కెట్లు ఓపెనవ్వకముందు 58,416 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకున్న సూచీ ఆ తర్వాత  57,568 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 304 పాయింట్ల నష్టంతో 57,684 వద్ద ముగిసింది.

NSE Nifty

మంగళవారం 17,315 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,315 వద్ద మొదలైంది. కొనుగోళ్ల ఊపు లేకపోవడంతో రేంజ్‌బౌండ్‌లోనే కదలాడింది. 17,442 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకున్న సూచీ మధ్యాహ్నం తర్వాత 17,199 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. చివరికి 69 పాయింట్ల నష్టంతో 17,245 వద్ద ముగిసింది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంకు 36,627 వద్ద ఆరంభమైంది. 36,827 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాల సెగతో 36,627 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 201 పాయింట్ల నష్టంతో 36,147 వద్ద ముగిసింది.

Gainers and Lossers

నిఫ్టీలో 21 కంపెనీల షేర్లు లాభపడగా 29 నష్టపోయాయి. దివీస్‌ ల్యాబ్‌, హిందాల్కో, టాటాస్టీల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, యూపీఎల్‌ 1 నుంచి 3 శాతం వరకు మెరుగయ్యాయి. కొటాక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బ్రిటానియా, భారతీ ఎయిర్‌టెల్‌, సన్‌ ఫార్మా షేర్లు పతనమయ్యాయి. హెల్త్‌కేర్‌, మెటల్‌, ఆయిల్‌ అండ్ గ్యాస్‌, పవర్‌ సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. ఆటో, బ్యాంక్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, ఎఫ్‌ఎంసీజీలో అమ్మకాలు కనిపించాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
KCR Bus Yatra :  పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం  సిద్ధం
పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Allari Naresh on Aa okkati Adakku | మళ్లీ కామెడీ సినిమాలు చేయటంపై అల్లరి నరేష్ | ABP DesamDuvvada Srinivas Interview | టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఇంటర్వ్యూ | ABPHyderabad 16Cars Fire Accident | హైదరాబాద్ యూసుఫ్ గూడలో అగ్నికి ఆహుతైపోయిన 16కార్లు | ABP DesamPawan kalyan Touches feet of Pastor | పిఠాపురంలో మహిళా పాస్టర్ కాళ్లు మొక్కిన పవన్ కళ్యాణ్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
KCR Bus Yatra :  పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం  సిద్ధం
పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం
Pemmasani Chandra Sekhar: ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
Duvvada Vani: టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
Malaysia: గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
Bridge Collapsed: మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
Embed widget