By: ABP Desam | Updated at : 31 Aug 2023 01:15 PM (IST)
OCCRP దెబ్బకు అదానీ స్టాక్స్ విలవిల
Adani Group Clarification on OCCRP Report: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన షాక్ నుంచి బయట పడుతున్న అదానీ గ్రూప్‌నకు దాదాపు అలాంటి మరో షాక్ తగిలింది. ఆ ప్రభావంతో అదానీ కంపెనీల షేర్లు పతనమయ్యాయి. కొత్తగా వచ్చిన రిపోర్ట్ మీద అదానీ గ్రూప్ ప్రతిస్పందించింది. హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలనే రీసైక్లింగ్ చేసి ఈ నివేదిక తీసుకొచ్చారంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చింది.
OCCRP రిపోర్ట్‌లోని విషయాలు
ఇంటర్నేషనల్ మీడియా సంస్థ 'ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్' (OCCRP), అదానీ గ్రూప్ మీద హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన తరహా ఆరోపణలే చేస్తూ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం.... 'గుర్తు తెలియని' మారిషస్ ఫండ్స్ ద్వారా అదానీ గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీల షేర్లలోకి వందల మిలియన్ల డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. అదానీ గ్రూప్ ప్రమోటర్ కుటుంబంతో వ్యాపార సంబంధాలు ఉన్న కొందరు వ్యక్తులు అదానీ గ్రూప్ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టి లాభాలు సంపాదించారు.
టాక్స్‌లు తక్కువగా ఉండే కొన్ని దేశాల్లోని పేపర్లు, అదానీ గ్రూప్ ఇంటర్నల్ ఈ-మెయిళ్లను తాము పరిశీలించామని OCCRP తన రిపోర్ట్‌లో వెల్లడించింది. ముఖ్యంగా, నాసర్ అలీ షాబాన్ అహ్లీ, ఛాంగ్ చుంగ్ లింగ్ అనే ఇద్దరు వ్యక్తుల పేర్లను తన రిపోర్ట్‌లో OCCRP ప్రస్తావించింది. వీళ్లిద్దరికీ అదానీ కుటుంబంతో ఏళ్ల తరబడి వ్యాపార సంబంధాలు ఉన్నాయని తెలిపింది. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీకి చెందిన కొన్ని కంపెనీల్లో నాసర్ అలీ షాబాన్ అహ్లీ, ఛాంగ్ చుంగ్ లింగ్ డైరెక్టర్లుగా, స్టేక్ హోల్డర్లుగా ఉన్నారని రిపోర్ట్ చేసింది. వీళ్లిద్దరూ ఫారిన్ ఫండ్స్ ద్వారా అదానీ కంపెనీల షేర్లను కొంటూ, అమ్ముతూ భారీ లాభాలు సంపాదించారంటూ OCCRP బాంబ్ పేల్చింది.
అదానీ గ్రూప్ రియాక్షన్ ఇది
OCCRP ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌ను మళ్లీ తెర పైకి తీసుకురావడానికి, ఫారిన్ మీడియాలోని ఒక వర్గం మద్దతుతో, ఇలాంటి రీసైక్లింగ్ రిపోర్ట్ తీసుకొచ్చారంటూ రియాక్ట్ అయింది. OCCRP చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవంది. అదానీ గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీలన్నీ రూల్స్‌కు అనుగుణంగానే పనిచేస్తున్నాయని వివరించింది. ముఖ్యంగా, FPIల విషయంలో 'సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా' (SEBI) ఇప్పటికే దర్యాప్తు చేస్తోందని చెప్పింది. ఉన్నాయి. సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ ప్రకారం, మినిమమ్ పబ్లిక్ షేర్‌హోల్డింగ్ (MPS) రూల్స్‌ను ఉల్లంఘించినట్లు లేదా స్టాక్ ప్రైస్‌లను తారుమారు చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవని గుర్తు చేసింది. కానీ.. కొత్తగా ప్రశ్నలు, అనుమానాలను లేవనెత్తిన OCCRP, వాటికి సంబంధించిన తమ నుంచి సమాధానాలు తీసుకోకూడదని నిర్ణయించుకోవడం విచారకరం అని అదానీ గ్రూప్ స్పష్టం చెప్పింది.
సుప్రీంకోర్టు, సెబీ ఇప్పటికే ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాయని, కొనసాగుతున్న దర్యాప్తు ప్రక్రియను గౌరవించడం ముఖ్యమని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. చట్టబద్ధమైన ప్రక్రియపై తమకు పూర్తి విశ్వాసం ఉందని వెల్లడించింది.
మరో ఆసక్తికర కథనం: ఈపీఎఫ్‌వో కొత్త రూల్స్ - అకౌంట్ వివరాల్ని మార్చడానికి ఇకపై డెడ్‌లైన్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Stock Market Today: సూచీల ఊగిసలాట! లాభాల్లోంచి మళ్లీ నష్టాల్లోకి జారుకున్న నిఫ్టీ, సెన్సెక్స్
Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లు విలవిల - రూ.22 లక్షల వద్దే బిట్‌కాయిన్
Artificial Intelligence: కృత్రిమ మేథకు మోదీ బూస్ట్! జీపీయూ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్న కేంద్రం
Stock Market Today: వరుస నష్టాలకు తెర! రీబౌండ్ అయిన నిఫ్టీ, సెన్సెక్స్
Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?
Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో
IND vs AUS 1st ODI: షమి 'పంచ్'తో కంగారు - టీమ్ఇండియా టార్గెట్ 279
ఫోటోలు: తిరుమలలో ఐదో రోజు గరుడ వాహన సేవ, దర్శనం కోసం గ్యాలరీల్లో భక్తుల బారులు
2024 ఆస్కార్ బరిలో 'దసరా', 'బలగం' - ఏకంగా 22 సినిమాలతో పోటీ?
/body>