అన్వేషించండి

Singareni Collieries: సింగరేణిలో సిరుల పంట... ఈ ఏడాది ఆల్ టైం రికార్డు... ఏడు నెల్లలో రూ.868 కోట్ల లాభాలు

ఈ ఏడాది సింగరేణిలో సిరుల పంట పండింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో రూ.868 కోట్ల లాభాలు ఆర్జించింది. ఈ ఏడాదిలో ఆల్ టైం రికార్డుగా బొగ్గు ఉత్పత్తి చేసిందని సంస్థ ఎండీ శ్రీధర్ తెలిపారు.

సింగరేణి సంస్థ 2021-22 ఆర్థిక సంవత్సరంలో గడిచిన ఏడు నెలలకు గాను రూ. 14,067 కోట్ల అమ్మకాలు జరిపి, రూ.868 కోట్ల లాభాలను ఆర్జించిందని ఆ సంస్థ ఛైర్మన్, ఎండీ శ్రీధర్ వెల్లడించారు. సింగరేణి బొగ్గు గనుల ప్రగతిపై సంబంధిత అధికారులతో గత నాలుగు రోజులుగా ఆయన సమీక్షలు నిర్వహించారు. అనంతరం సంస్థ ఆర్థిక విషయాలపై శనివారం సమీక్షించారు. సింగరేణి గత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ నెలతో ముగిసిన తొలి ఏడు నెలల కాలంలో రూ. 8537 కోట్ల అమ్మకాలు జరపగా, ఈ ఆర్థిక సంవత్సరంలో అదే కాలానికి 65 శాతం వృద్ధితో రూ. 14,067 కోట్ల అమ్మకాలు జరిపిందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి కరోనా విపత్కర పరిస్థితుల కారణంగా బొగ్గు అమ్మకాలు, రవాణా తగ్గడంతో రూ.1129 కోట్ల నష్టాలు వచ్చాయన్నారు. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి, రవాణా, విద్యుత్ అమ్మకాలు పెరగడంతో గత ఏడాది కన్నా 177 శాతం వృద్ధితో రూ.868 కోట్ల లాభాలు ఆర్జించామని వివరించారు. 
Singareni Collieries: సింగరేణిలో సిరుల పంట... ఈ ఏడాది ఆల్ టైం రికార్డు... ఏడు నెల్లలో రూ.868 కోట్ల లాభాలు

బొగ్గు అమ్మకాలలో 78 శాతం వృద్ధి

బొగ్గు, విద్యుత్ అమ్మకాల్లో గడిచిన ఏడు నెలల్లో గత ఏడాది కన్నా 65 శాతం మేర వృద్ధి సాధించిందని సింగరేణి ఛైర్మన్ శ్రీధర్ తెలిపారు. కేవలం బొగ్గు అమ్మకాలలో 78 శాతం వృద్ధి, విద్యుత్ అమ్మకాలలో 18 శాతం వృద్ధిని నమోదు చేసిందన్నారు. గత ఏడాది తొలి ఏడు నెలల కాలంలో రూ.6678 కోట్ల బొగ్గు అమ్మకాలు జరపగా ఈ ఆర్థిక సంవత్సరంలో అదే కాలానికి 78 శాతం వృద్ధితో రూ.11,855 కోట్ల విలువైన బొగ్గు అమ్మకాలు జరిగాయన్నారు. గత ఏడాది తొలి ఏడు నెలల్లో రూ.1860 కోట్ల విద్యుత్ అమ్మకాలు జరగగా ఈ ఏడాది అదే కాలానికి 18 శాతం వృద్ధితో రూ.2182 కోట్ల విద్యుత్ అమ్మకాలు జరిపిందన్నారు. Singareni Collieries: సింగరేణిలో సిరుల పంట... ఈ ఏడాది ఆల్ టైం రికార్డు... ఏడు నెల్లలో రూ.868 కోట్ల లాభాలు

Also Read: నాడు ఏం చెప్పారు ? నేడు ఏం చేస్తున్నారు ? పెట్రో ధరలను తగ్గించకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం

పెరిగిన ఉత్పత్తితో లాభాలు
గత ఏడాది కాలంగా కంపెనీ వ్యాప్తంగా తీసుకుంటున్న కరోనా నివారణ చర్యలు, ఉత్పత్తి సమీక్షలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని ఎండీ శ్రీధర్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో తొలి ఏడు నెలల్లో  సాధించిన బొగ్గు ఉత్పత్తి, విద్యుత్ ఉత్పత్తి కన్న ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలలో వృద్ధి పెరగడంతో లాభాలు కూడా గణనీయంగా పెరిగాయన్నారు. గత ఏడాది తొలి ఏడు నెలల్లో 220  లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిన సింగరేణి, ఈ ఏడాది అదే కాలానికి  60 శాతం వృద్ధితో 352 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. గత ఏడాది 218 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసిన సింగరేణి ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో 68 శాతం వృద్ధితో 367 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసింది. అలాగే సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా గత ఏడాది అక్టోబర్ నెల వరకు 3819 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కాగా ఈ ఏడాది అక్టోబర్ నాటికి 39 శాతం వృద్ధితో 5291 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసింది. 

Also Read: ఏపీలో విద్యుత్ ఒప్పందాల రాజకీయాలు ! టీడీపీ ఆరోపణలేంటి ? ప్రభుత్వ స్పందన ఏమిటి ?

అత్యధిక టర్నోవర్ 

రాష్ట్ర విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సింగరేణి సంస్థ సాధ్యమైనంత ఎక్కువ బొగ్గును ఉత్పత్తి చేస్తూ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అందజేస్తోందని ఎండీ శ్రీధర్ తెలిపారు. ఇదే విధంగా వచ్చే ఐదు నెలల కాలంలో కూడా  గరిష్ట స్థాయిలో బొగ్గు ఉత్పత్తి చేస్తామని,  దేశ విద్యుత్ అవసరాలను తీర్చడమే ప్రధాన లక్ష్యంగా సింగరేణి పనిచేస్తోందని ఆయన వివరించారు. ఈ ఏడాది సింగరేణి తన చరిత్రలోనే అత్యధిక బొగ్గు ఉత్పత్తి, రవాణా, వార్షిక టర్నోవర్, లాభాలు సాధిస్తుందని సంస్థ ఎండీ ఎన్. శ్రీధర్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

Also Read: తెలంగాణ రైతులకు అలెర్ట్... యాసంగిలో వరి వద్దు ప్రభుత్వం కొనదు... మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

One Nation One Election Bill: నేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
నేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
One Nation One Election Bill: నేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
నేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
US Latest News: అమెరికాలోని ఓ స్కూల్‌లో కాల్పులు జరిగిన 12వ తరగతి విద్యార్థి-  ఐదుగురు మృతి 
అమెరికాలోని ఓ స్కూల్‌లో కాల్పులు జరిగిన 12వ తరగతి విద్యార్థి-  ఐదుగురు మృతి 
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Tirumala News: వచ్చే మార్చిలో తిరుమల వెళ్లాలంటే ముందు ఈ పని చేయండి - ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి
వచ్చే మార్చిలో తిరుమల వెళ్లాలంటే ముందు ఈ పని చేయండి - ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి
Embed widget