అన్వేషించండి

SBI Charges: స్టేట్‌ బ్యాంక్‌ మీ జేబుకు పెద్ద చిల్లు పెట్టింది, ప్రతి కార్డ్‌ మీద రూ.75 బాదుడు

వివిధ SBI డెబిట్ కార్డుల వార్షిక నిర్వహణ ఛార్జీ 75 రూపాయలు పెరిగింది. మీ దగ్గర ఎన్ని కార్డ్‌లు ఉంటే అన్ని రూ.75లు మీ నుంచి వసూలు చేస్తుంది.

SBI Debit Card Charges Hike From 01 April 2024: దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌, తన కోట్లాది మంది కస్టమర్లను కష్టపెట్టే నిర్ణయం తీసుకుంది. తన వివిధ డెబిట్ కార్డ్‌/ ATM కార్డ్‌ వార్షిక నిర్వహణ ఛార్జీలను (Annual maintenance charges) పెంచింది. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం, వివిధ SBI డెబిట్ కార్డుల వార్షిక నిర్వహణ ఛార్జీ 75 రూపాయలు పెరిగింది. మీ దగ్గర ఎన్ని కార్డ్‌లు ఉంటే అన్ని రూ.75లు మీ నుంచి వసూలు చేస్తుంది. ఈ డబ్బు నేరుగా మీ బ్యాంక్‌ ఖాతా నుంచి తగ్గుతుంది. అంటే, మీకు తెలీకుండానే మీ డబ్బును బ్యాంక్‌ లాక్కుంటుంది.

డెబిట్ కార్డ్‌ల మీద కొత్త వార్షిక నిర్వహణ ఛార్జీల బాదుడు కోసం, SBI, కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభాన్ని ముహూర్తంగా ఎంచుకుంది. ఈ రోజు ( 01 ఏప్రిల్ 2024) నుంచి స్టేట్‌ బ్యాంక్‌ కొత్త రుసుములు అమల్లోకి వచ్చాయి. మన దేశంలో కోట్లాది మంది ప్రజలు SBI డెబిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. కస్టమర్ల సంఖ్య పరంగా SBI దేశంలోనే అతి పెద్ద బ్యాంక్.

ఎస్‌బీఐకి చెందిన ఏ డెబిట్‌ కార్డ్‌ మీద ఎంత చార్జీ?

- క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్ యూజర్లు 01 ఏప్రిల్‌ 2024 నుంచి నిర్వహణ ఛార్జీ రూపంలో రూ. 200 + GST చెల్లించాలి. ప్రస్తుతం ఈ ఛార్జీ రూ. 125 + GSTగా ఉంది. 
- యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డ్, మై కార్డ్ (ఇమేజ్ కార్డ్) యూజర్ల నుంచి ప్రస్తుతం ఉన్న రూ. 175 + GSTకి బదులుగా రూ. 250 + GSTని బ్యాంక్‌ వసూలు చేస్తుంది. 
- ప్లాటినం డెబిట్ కార్డ్ వినియోగదార్ల నుంచి ఇప్పుడున్న రూ. 250  + GSTకి బదులుగా రూ. 325  + GSTని వసూలు చేస్తుంది. 
- ప్రైడ్, ప్రీమియం బిజినెస్ డెబిట్ కార్డ్‌ల వార్షిక నిర్వహణ ఛార్జీ ప్రస్తుత రూ. 350 + GST నుంచి రూ. 425  + GSTకి పెరుగుతుంది. 

క్రెడిట్‌ కార్డ్‌ రివార్డ్‌ పాయింట్లు కూడా మాయం

డెబిట్‌ కార్డ్‌ విషయంలోనే కాదు, క్రెడిట్ కార్డ్ విషయంలోనూ స్టేట్‌ బ్యాంక్‌ ఈ రోజు నుంచి కొన్ని మార్పులు తీసుకొచ్చింది. స్టేట్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులను జారీ చేసే సంస్థ ఎస్‌బీఐ కార్డ్‌ (SBI Card), కొన్ని క్రెడిట్ కార్డులపై వచ్చే రివార్డ్ పాయింట్లను రద్దు చేసింది. ఈ అప్‌డేట్‌ ప్రకారం... AURUM, SBI కార్డ్ ఎలైట్, సింప్లీ క్లిక్‌ కార్డ్‌ హోల్డర్ల మీద ఈ ప్రభావం పడింది. ఈ కార్డ్‌ల ద్వారా చేసే అద్దె చెల్లింపులపై 31 మార్చి 2024 వరకు రివార్డ్‌ పాయింట్లు ఇచ్చింది. ఈ రోజు నుంచి రివార్డ్‌ పాయింట్లు రావు. 

అంతేకాదు, SBI క్రెడిట్ కార్డ్ హోల్డర్లు మరో నష్టాన్ని కూడా భరించాలి. పైన చెప్పిన కార్డ్‌లతో అద్దె చెల్లించడం ద్వారా ఇప్పటి వరకు వచ్చిన రివార్డ్ పాయింట్‌ల గడువు ఈ నెల 15తో ముగుస్తుంది. అంటే, ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా అద్దె చెల్లించి, అందుకోసం కొన్ని రివార్డ్ పాయింట్లను ఇప్పటికే పొందితే, ఆలస్యం చేయకుండా వాటిని ఉపయోగించండి. లేకపోతే, ఈ నెల 15 తర్వాత ఆ పాయింట్లు చెల్లవు.

మరో ఆసక్తికర కథనం: ఈ రోజు బ్యాంక్‌ వైపు వెళ్లకండి, ఈ నెలలో మొత్తం 14 సెలవులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR ED Notice: ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ షాక్, విచారణకు రావాలని నోటీసులు
ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ షాక్, విచారణకు రావాలని నోటీసులు
Manmohan Singh Funeral Updates: ఢిల్లీలో కొనసాగుతున్న మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర, ఏఐసీసీ ఆఫీసులో కాంగ్రెస్ నేతల ఘన నివాళి
ఢిల్లీలో కొనసాగుతున్న మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర, ఏఐసీసీ ఆఫీసులో కాంగ్రెస్ నేతల ఘన నివాళి
Sharmistha Mukherjee: ప్రణబ్‌ ముఖర్జీపై కాంగ్రెస్ వివక్ష, కనీసం నివాళులర్పించలేదు: శర్మిష్ఠా ముఖర్జీ సంచలనం
ప్రణబ్‌ ముఖర్జీపై కాంగ్రెస్ వివక్ష, కనీసం నివాళులర్పించలేదు: శర్మిష్ఠా ముఖర్జీ సంచలనం
2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి ChatGPT ప్రిడిక్షన్ ఇదే..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP DesamPushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP DesamPir Panjal Rail Tunnel | ఇండియాలో లాంగెస్ట్ రైల్వే టన్నెల్ ఇదే | ABP Desamరాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్‌ ప్రారంభం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ED Notice: ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ షాక్, విచారణకు రావాలని నోటీసులు
ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ షాక్, విచారణకు రావాలని నోటీసులు
Manmohan Singh Funeral Updates: ఢిల్లీలో కొనసాగుతున్న మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర, ఏఐసీసీ ఆఫీసులో కాంగ్రెస్ నేతల ఘన నివాళి
ఢిల్లీలో కొనసాగుతున్న మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర, ఏఐసీసీ ఆఫీసులో కాంగ్రెస్ నేతల ఘన నివాళి
Sharmistha Mukherjee: ప్రణబ్‌ ముఖర్జీపై కాంగ్రెస్ వివక్ష, కనీసం నివాళులర్పించలేదు: శర్మిష్ఠా ముఖర్జీ సంచలనం
ప్రణబ్‌ ముఖర్జీపై కాంగ్రెస్ వివక్ష, కనీసం నివాళులర్పించలేదు: శర్మిష్ఠా ముఖర్జీ సంచలనం
2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి ChatGPT ప్రిడిక్షన్ ఇదే..
Game Changer: ట్రైలర్ రిలీజ్ చేయకుంటే ఆత్మహత్య... 'గేమ్ ఛేంజర్' టీంకు రామ్ చరణ్ అభిమాని సూసైడ్ లెటర్
ట్రైలర్ రిలీజ్ చేయకుంటే ఆత్మహత్య... 'గేమ్ ఛేంజర్' టీంకు రామ్ చరణ్ అభిమాని సూసైడ్ లెటర్
Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
Customer Food Habits Of 2024 : ఒక్క ఆర్డర్ లోనే 250 పిజ్జాలు - సింగిల్ మీల్ ఆర్డర్ పై రూ.5 లక్షలు - స్విగ్గీ, జొమాటోలో 2024లో రికార్డ్ ఆర్డర్స్
ఒక్క ఆర్డర్ లోనే 250 పిజ్జాలు - సింగిల్ మీల్ ఆర్డర్ పై రూ.5 లక్షలు - స్విగ్గీ, జొమాటోలో 2024లో రికార్డ్ ఆర్డర్స్
Mobile Phone Safety: ఈ లక్షణాలు మీ మొబైల్‌ ఫోన్‌లో కనిపిస్తే వైరస్‌ ప్రవేశించిందని అర్ధం, బీ అలెర్ట్‌!
ఈ లక్షణాలు మీ మొబైల్‌ ఫోన్‌లో కనిపిస్తే వైరస్‌ ప్రవేశించిందని అర్ధం, బీ అలెర్ట్‌!
Embed widget