News
News
వీడియోలు ఆటలు
X

SBI Card: మీ దగ్గర ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ ఉందా?, పేమెంట్స్‌ ట్రెండ్‌ ఇకపై మారిపోతుంది

దేశంలో రూపే క్రెడిట్ కార్డ్‌లను జారీ చేసే అతి పెద్ద సంస్థ SBI కార్డ్ కాబట్టి, ఈ స్టెప్‌ చాలా కీలకమైనది, పెద్దది కావచ్చు.

FOLLOW US: 
Share:

SBI Card: క్రెడిట్‌ కార్డ్‌ పేమెంట్స్‌లో పెను మార్పు రాబోతోంది. దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎస్‌బీఐ కార్డ్ (SBI Card)‍‌, క్రెడిట్ కార్డ్‌ రంగంలో కీలక అడుగు వేయబోతోంది. దీంతో, మొత్తం క్రెడిట్‌ కార్డ్ పరిశ్రమలోనే అది గేమ్ ఛేంజర్‌ అవుతుంది. దేశంలో క్రెడిట్‌ కార్డ్స్‌ను జారీ చేసే రెండో అతి పెద్ద సంస్థ SBI కార్డ్. త్వరలో దీని రూపే క్రెడిట్ కార్డ్‌లను UPIతో (unified payment interface) అనుసంధానించనుంది. దేశంలో రూపే క్రెడిట్ కార్డ్‌లను జారీ చేసే అతి పెద్ద సంస్థ SBI కార్డ్ కాబట్టి, ఈ స్టెప్‌ చాలా కీలకమైనది, పెద్దది కావచ్చు. ఎస్‌బీఐ కార్డ్‌ పోర్ట్‌ఫోలియోలో 11 శాతం వాటా రూపే కార్డులది.

పేమెంట్ ట్రెండ్‌లో మార్పు కనిపిస్తుంది
SBI కార్డ్ ప్రారంభించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఆ సంస్థ CMD రామ్మోహనరావు అమర 'టైమ్స్ ఆఫ్ ఇండియా'తో ప్రత్యేకంగా మాట్లాడారు. కంపెనీ ఇష్యూ చేసే రూపే కార్డ్-UPI అనుసంధానం త్వరలో పూర్తవుతుందని చెప్పారు. లావాదేవీల విషయాల్లో, ప్రజలు చిన్న మొత్తం చెల్లింపులకు UPI లావాదేవీలను, పెద్ద మొత్తం చెల్లింపులకు క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగిస్తున్నారని రామ్మోహన్‌రావు వెల్లడించారు. క్రెడిట్ కార్డ్‌లను UPIతో లింక్ చేస్తే ఈ ట్రెండ్‌లో మార్పు కనిపిస్తుందని, UPI ద్వారా పెద్ద మొత్తంలో చెల్లింపులు చేయడానికి కూడా ప్రజలు ముందుకు వస్తారని అన్నారు.

ఇది కూడా చదవండి: యూపీఐ లైట్‌ స్పెషాలిటీ ఏంటి, Paytm-PhonePeలో ఎలా యాక్టివేట్‌ చేయాలి?

ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయగల స్థోమత ఉన్నవారికి ఇతర కంపెనీలు ప్రాధాన్యత ఇస్తుంటే, ఎస్‌బీఐ కార్డ్ మాత్రం సామాన్య ప్రజలను కూడా దృష్టి ఉంచుకుని రూపే కార్డ్‌లను జారీ చేస్తోందని SBI కార్డ్ CMD చెప్పారు. కంపెనీ వృద్ధి, మొత్తం పరిశ్రమ కంటే బలంగా ఉందని తెలిపారు. మొత్తం క్రెడిట్‌ కార్డ్ పరిశ్రమ 18 శాతం వృద్ధి రేటుతో 8.5 కోట్ల కొత్త కార్డులను జారీ చేసిందని, అయితే SBI కార్డ్ ఒక్కటే 22 శాతం CAGR వృద్ధితో 1.17 కోట్ల కొత్త కార్డులను జారీ చేసిందని చెప్పారు. అదేవిధంగా, క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా చేసే లావాదేవీల విలువ పరంగా, SBI కార్డ్ పరిశ్రమలో అగ్రగామిగా ఉందని వివరించారు. మొత్తం క్రెడిట్‌ కార్డ్ పరిశ్రమ 26 శాతం వృద్ధి చెందితే, SBI కార్డ్‌ 28 శాతం వృద్ధి రేటును సాధించిందన్నారు. 

రూపే క్రెడిట్ కార్డ్‌తో UPI చెల్లింపులను అనుమతిస్తున్న బ్యాంకులు
HDFC బ్యాంక్‌, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్‌ జారీ చేసిన రూపే క్రెడిట్ కార్డ్‌తో UPI ద్వారా చెల్లింపులు చేయవచ్చు. పేటీఎం ద్వారా కూడా ఈ తరహా చెల్లింపులు చేయవచ్చు.

రూపే క్రెడిట్ కార్డ్‌తో UPI చెల్లింపు ఎలా చేయాలి?
చెల్లింపు చేయడానికి, ముందుగా UPI QR కోడ్‌ని స్కాన్ చేయండి.
ఆ తర్వాత మీరు చెల్లించాలనుకుంటున్న మొత్తాన్ని పూరించండి.
దీని తర్వాత క్రెడిట్ కార్డ్ ఆప్షన్‌ ఎంచుకోండి.
UPI పిన్‌ను ఇక్కడ నమోదు చేయండి.
దీంతో చెల్లింపు పూర్తవుతుంది.

ఇది కూడా చదవండి: పని చేయకపోయినా 15 ఏళ్లుగా ₹8 కోట్ల జీతం, అయినా కంపెనీపై కేసు పెట్టిన ఉద్యోగి

Published at : 16 May 2023 07:11 AM (IST) Tags: State Bank Of India UPI SBI Card RuPay Credit Card

సంబంధిత కథనాలు

Gold-Silver Price Today 07 June 2023: పసిడి స్థిరం - ఇవాళ బంగారం, వెండి ధరలు

Gold-Silver Price Today 07 June 2023: పసిడి స్థిరం - ఇవాళ బంగారం, వెండి ధరలు

Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లో వణుకు - రూ.88వేలు తగ్గిన బిట్‌కాయిన్‌

Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లో వణుకు - రూ.88వేలు తగ్గిన బిట్‌కాయిన్‌

Stock Market News: టర్న్‌ అరౌండ్‌ అయిన సెన్సెక్స్‌, నిఫ్టీ - ఎరుపెక్కిన ఐటీ ఇండెక్స్‌!

Stock Market News: టర్న్‌ అరౌండ్‌ అయిన సెన్సెక్స్‌, నిఫ్టీ - ఎరుపెక్కిన ఐటీ ఇండెక్స్‌!

LIC Policy: రోజుకు ₹45 పెట్టుబడితో ₹25 లక్షలు మీ సొంతం

LIC Policy: రోజుకు ₹45 పెట్టుబడితో ₹25 లక్షలు మీ సొంతం

BoB: ఫోన్‌తో స్కాన్‌ చేసి డబ్బు తీసుకోవచ్చు, ఏటీఎం కార్డ్‌ అక్కర్లేదు

BoB: ఫోన్‌తో స్కాన్‌ చేసి డబ్బు తీసుకోవచ్చు, ఏటీఎం కార్డ్‌ అక్కర్లేదు

టాప్ స్టోరీస్

YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

YS Viveka Case :  అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి -   సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?