Elon Musk Tweet: పుతిన్‌కు ఎలాన్ మస్క్ ఛాలెంజ్- దమ్ముంటే సింగిల్‌గా యుద్ధం చేయాలని ట్వీట్
Elon Musk Tweet: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఎలాన్ మస్క్ ఓ ఛాలెంజ్ చేశారు. సింగిల్‌గా యుద్ధం చేయాలని ట్వీట్ చేశారు.
![Elon Musk Tweet: పుతిన్‌కు ఎలాన్ మస్క్ ఛాలెంజ్- దమ్ముంటే సింగిల్‌గా యుద్ధం చేయాలని ట్వీట్ Russia Ukraine Crisis Tesla CEO Elon Musk Tweet challenges Vladimir Putin to single combat Ukraine is on stake Elon Musk Tweet: పుతిన్‌కు ఎలాన్ మస్క్ ఛాలెంజ్- దమ్ముంటే సింగిల్‌గా యుద్ధం చేయాలని ట్వీట్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/14/32bbe9ca52c15c7c58b5d43f1558e793_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Elon Musk Tweet: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ సవాల్ విసిరారు. ఉక్రెయిన్ విషయంలో సింగిల్‌గా పోరాడాలని ఛాలెంజ్ చేశారు.
I hereby challenge
— Elon Musk (@elonmusk) March 14, 2022
Владимир Путин
to single combat
Stakes are Україна
అయితే ఇది ఏ తరహా యుద్ధమనే దానిపై మస్క్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
నేనున్నానని
రష్యా దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రెయిన్‌కు బిలియనీర్ ఎలాన్ మస్క్ బాసటగా నిలిచారు. స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవల్ని ప్రారంభించి నిరంతరాయ ఇంటర్నెట్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మరిన్ని టెర్మినళ్లను సైతం ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
రష్యా దాడులు ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్‌లో ఇంటర్నెట్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ సమయంలో అక్కడి ప్రజలకు కీలక సమాచారం చేరవేయడం ఎంతో కీలకం. ఇప్పుడు ఆన్‌లైన్ సేవలు అందుబాటులో లేకపోతే ఏం జరుగుతుందో తెలుసుకోలేక ప్రజలు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. ఈ తరుణంలో మస్క్ తనవంతుగా ఉక్రెనియన్లకు సాయంగా నిలవడంపై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు వెల్లువెత్తాయి.
10 గంటల్లో
ఉక్రెయిన్ డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ శాఖ మంత్రి మైఖైలో ఫెదొరోవ్.. స్టార్‌లింక్ సేవల్ని అందుబాటులోకి తీసుకురావాలని మస్క్‌కు విజ్ఞప్తి చేసిన 10 గంటల్లోనే ఆయన చర్యలు చేపట్టారు.
ప్రపంచ నలుమూలలకు ఇంటర్నెట్ సేవల్ని అందించాలన్న లక్ష్యంతో ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ నెట్‌వర్క్‌ను ప్రారంభించారు. అందులో భాగంగా భూ దిగువ కక్ష్యలో భారీ ఎత్తున కృత్రిమ ఉపగ్రహాలను ప్రయోగిస్తారు. ఇప్పటికే 2000 శాటిలైట్లను కక్ష్యలో నిలిపారు. ఇటీవలే మరో 50 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపారు.
టెరెస్ట్రియల్ ఇంటర్నెట్ సదుపాయం లేనిచోట ఇంటర్నెట్ సేవలు అందించేందుకు స్టార్‌లింక్ సహా చాలా సంస్థలు చిన్న చిన్న ఉపగ్రహాలను లో ఎర్త్ ఆర్బిట్‌లోకి పంపిస్తున్నాయి. లో లేటెన్సీ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు కల్పిస్తున్నాయి.
Also Read: LIC IPO Postponed: LIC ఐపీఓ వాయిదా- కేంద్రం స్పీడుకు బ్రేకులు వేసిన పుతిన్!
Also Read: EPFO Interest: ఈపీఎఫ్‌తో ఇరుక్కున్న కేంద్రం, ఎన్నికలు అవ్వగానే మొదలెట్టారని విమర్శలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)