అన్వేషించండి

Repo Rate: దేశంలో వడ్డీ రేట్లు యథాతథం, నాలుగోసారీ సేమ్‌ పిక్చర్‌ రిలీజ్‌ చేసిన ఆర్‌బీఐ

వరుసగా నాలుగోసారి కీలక రేట్లపై 'స్టేటస్‌ కో' విధించిన రిజర్వ్‌ బ్యాంక్‌, 'వెయిట్ అండ్ వాచ్' మోడ్‌ను అవలంబించింది.

RBI Holds Repo Rate: వడ్డీ రేట్ల విషయంలో మార్కెట్‌ ఊహించిన నిర్ణయమే వచ్చింది. అందరి అంచనాలకు అనుగుణంగానే, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక రేట్లను యథాతథంగా కొనసాగించింది. రెపో రేటును (Repo rate) 6.50% వద్ద కంటిన్యూ చేస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ప్రకటించారు. వడ్డీ రేట్లను మార్చకుండా 6.50% వద్దే ఉంచడం ఇది వరుసగా నాలుగోసారి.

శక్తికాంత దాస్‌ అధ్యక్షతన ఈ నెల 4-6 తేదీల్లో సమావేశమైన ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (2023 October MPC Meeting), దేశీయ & అంతర్జాతీయ పరిస్థితులపై చర్చించి కీలక రేట్లపై నిర్ణయాలు తీసుకుంది.

వరుసగా నాలుగోసారి కీలక రేట్లపై 'స్టేటస్‌ కో' విధించిన రిజర్వ్‌ బ్యాంక్‌, 'వెయిట్ అండ్ వాచ్' (wait and watch) మోడ్‌ను అవలంబించింది. లిక్విడిటీ అడ్జస్ట్‌మెంట్‌ ఫెసిలిటీ (LAF) కింద, పాలసీ రెపో రేటును 6.50% నుంచి మార్చకూడదని మానిటరీ పాలసీ కమిటీ సభ్యులు నిర్ణయించారు. 

మన దేశంలో డేంజర్‌ జోన్‌లోకి చేసిన CPI ఇన్‌ఫ్లేషన్‌ను (CPI inflation) నియంత్రించడానికి, 2022 మే నెల నుంచి 2023 ఫిబ్రవరి వరకు రెపో రేటును 2.50% లేదా 250 బేసిస్ పాయింట్ల మేర దూకుడుగా పెంచిన RBI, ఆ తర్వాత ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం (ఏప్రిల్‌ 2023) నుంచి యథాతథ స్థితిని కొనసాగిస్తోంది.

రిజర్వ్‌ బ్యాంక్‌ రేట్లు ఇవి
రిజర్వ్‌ బ్యాంక్‌ తాజా నిర్ణయాల ప్రకారం... స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) రేటు 6.25% వద్దే ఉంది, మారలేదు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) రేటు, బ్యాంక్ రేటు కూడా 6.75% వద్ద ఉన్నాయి. రివర్స్‌ రెపో రేటు 3.35% వద్ద కంటిన్యూ అయింది.

ఈ ఏడాది జులైలో, 7.4%గా నమోదైన సీపీఐ ద్రవ్యోల్బణం, ఆగస్టులో 6.8%కు దిగి వచ్చింది. అయినా, RBI టాలరెన్స్‌ అప్పర్‌ బ్యాండ్‌ కంటే ఇది పైనే ఉంది. 

దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పాటు అందిస్తూనే, సీపీఐ ద్రవ్యోల్బణాన్ని ఆర్‌బీఐ టాలరెన్స్‌ బ్యాండ్‌ పరిధిలోకి (4%-6%) క్రమంగా తీసుకురావాలని కమిటీ నిర్ణయించింది. ఇందుకోసం 'స్నేహపూర్వక వైఖరిని విడనాడే' విధానాన్ని (withdrawal of accommodation stance) కొనసాగించాలని కూడా డెసిషన్‌ తీసుకున్నారు.

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ (US FED), కీలక వడ్డీ రేట్ల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ నెలాఖరులో జరిగే సమావేశంలోనూ వడ్డీ రేట్లను యూఎస్‌ ఫెడ్‌ పెంచుతుందన్న అంచనాలు ఉన్నాయి. యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ కూడా అదే బాటలో నడవవచ్చు. అంతర్జాతీయంగా ఇలాంటి నెగెటివ్‌ ఎఫెక్ట్స్‌ ఉన్నా, వడ్డీ రేట్లను యథాతథంగానే కొనసాగించింది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.

సెప్టెంబరులో ద్రవ్యోల్బణం దిగొచ్చే అవకాశం ఉందని ఆర్‌బీఐ గవర్నర్‌ అంచనా వేశారు. కూరగాయల ధరలు, వంట గ్యాస్‌ రేటు తగ్గిన నేపథ్యంలో కొద్దికాలానికి ఇన్‌ఫ్లేషన్‌ తగ్గొచ్చని అన్నారు. రిటైల్‌ ద్రవ్యోల్బణం వచ్చే ఏడాదికి 5.2 శాతానికి పరిమితం కావచ్చని వెల్లడించారు.

ఆర్థిక వృద్ధి రేటు అంచనా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం GDP వృద్ధి రేటు అంచనాలను 6.50%గా ఆర్‌బీఐ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) రెండో త్రైమాసికంలో 6.50%; మూడో త్రైమాసికంలో 6.0%; నాలుగో త్రైమాసికంలో 5.70%, 2024-25 మొదటి త్రైమాసికంలో 6.60% గ్రోత్‌ రేట్‌ నమోదు కావచ్చని అంచనా కట్టింది.

బ్యాంకింగ్‌ వ్యవస్థలో బలం
దేశంలో డిమాండ్‌ పుంజుకుంటోందని, ఎకానమీ పటిష్టంగా మారుతోందని దాస్‌ చెప్పారు. బ్యాంక్‌ ఆస్తుల నాణ్యత మెరుగుపడుతోందని, బ్యాంకింగ్‌ వ్యవస్థలోనూ బలం కనిపిస్తోందన్నారు. గత నెల (సెప్టెంబరు) 29 నాటికి మన దేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు (Forex reserves) 586.9 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు ప్రకటించారు.

ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీలోని ఆరుగురు సభ్యులు... డా. శశాంక భిడే, డా. అషిమా గోయల్, ప్రొఫెసర్ జయంత్ ఆర్ వర్మ, డా. రాజీవ్ రంజన్, డా. మైఖేల్ దేబబ్రత పాత్ర, శక్తికాంత దాస్.

మరో ఆసక్తికర కథనం: వరల్డ్‌ కప్‌తో దేశంలోకి డబ్బుల వరద, వేల కోట్లు వస్తాయని అంచనా

Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్పతనంతో ఆసీస్ పర్యటన ప్రారంభంబోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
AR Rahman Award: విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
Devaki Nandana Vasudeva Review - దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
Food Combinations to Avoid : ఈ ఫుడ్ కాంబినేషన్స్​ని తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, కలిపి తినకపోవడమే మంచిది
ఈ ఫుడ్ కాంబినేషన్స్​ని తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, కలిపి తినకపోవడమే మంచిది
Stock Market News: పడి లేచిన అదానీ స్టాక్స్- భారీ లాభాల్లో సెన్సెక్స్ అండ్‌ నిఫ్టీ- రూ.5.50 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
పడి లేచిన అదానీ స్టాక్స్- భారీ లాభాల్లో సెన్సెక్స్ అండ్‌ నిఫ్టీ- రూ.5.50 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద  
Embed widget