అన్వేషించండి

Reliance Jio: మీ సిమ్‌ని ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంచే చవకైన ప్లాన్‌ ఇది!

Jio Lowest Cost Prepaid Plan: రిలయన్స్ జియో సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచడానికి అత్యంత తక్కువ ధర ప్రీపెయిడ్ ప్లాన్‌ ఒకటి ఉంది, దేశంలో చాలామంది దీనిని యూజ్‌ చేస్తున్నారు.

Reliance Jio Rs 189 Prepaid Plan Details In Telugu: భారతదేశంలోని అతి పెద్ద టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియోకు కోట్లాది మంది కస్టమర్లు ఉన్నారు. వాళ్లలో చాలామంది రెండో సిమ్‌ కూడా (జియో, ఎయిర్‌టెల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ ఏదైనా కావచ్చు) వాడుతున్నారు. ఇలా రెండు నెట్‌వర్క్‌లను ఉపయోగించుకున్న యూజర్లలో కొందరు జియో సిమ్‌ను ఎక్కువగా వాడనప్పటికీ, ఆ నంబర్‌ను మాత్రం పోగొట్టుకోకూడదని భావిస్తుంటారు. ఫ్యాన్సీ నంబర్‌, పర్సనల్‌ నంబర్‌ లేదా ఇతర కారణాల వల్ల ఆ నంబర్‌ను వదులుకోవడానికి మాత్రం ఇష్టపడరు. అలాంటి వ్యక్తులు, నంబర్‌ పోకుండా ఉండేందుకు తమకు అవసరం లేకున్నా ఖరీదైన ప్రీ పెయిడ్‌ ప్లాన్స్‌తో రీఛార్జ్‌ చేయాల్సి వస్తోంది.

అయితే, మీ జియో సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచేందుకు ఖరీదైన ప్లాన్స్‌తో రీఛార్జ్‌ చేయాల్సిన అవసరం లేదు. తక్కువ ధరకే సూపర్‌ స్పీడ్‌తో డేటాను అందించే ప్లాన్‌ ఒకటి ఉంది. ఈ ప్లాన్‌లో ఇన్‌కమింగ్‌ & ఔట్‌గోయింగ్ కాల్స్‌, SMSలతో పాటు డేటా కూడా వస్తుంది, ప్లాన్‌ వ్యాలిడిటీ ఉన్నంతకాలం మీ సిమ్‌ యాక్టివ్‌గా ఉంటుంది. 

మీ జియో జియో సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచేందుకు రూ.189 తో రీఛార్జ్‌ చేస్తే చాలు. కొన్ని సంవత్సరాల క్రితం ప్లాన్స్‌ కంటే కొంచం రేటెక్కువ అయినప్పటికీ, ప్రస్తుతం ప్రైవేట్ టెల్కోలు ఇస్తున్న ఆఫర్లలో ఇది బెటర్‌ వన్‌. 

రిలయన్స్ జియో రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్‌ ప్రయోజనాలు ‍‌(Reliance Jio Rs 189 Prepaid Plan Benefits):

రిలయన్స్ జియో రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల సర్వీస్ వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌పై అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు, 2 GB డేటా వస్తుంది. ఈ 28 రోజుల్లో 300 SMSలను ఉచితంగా పంపుకోవచ్చు. అంటే, రోజుకు సగటున 10 SMSలపైనే వాడుకోవచ్చు. అంతేకాదు, జియో వినియోగదార్ల కోసం ఈ ప్లాన్‌తో జియో సినిమా (Jio Cinema), జియో క్లౌడ్‌ (Jio Cloud), జియో టీవీ ‍‍(Jio TV) ప్రైమరీ మెంబర్‌షిప్‌ కూడా యాడ్‌ అవుతుంది. 2 GB డేటాను పూర్తిగా వాడుకున్న తర్వాత FUP (ఫెయిర్ యూసేజ్ పాలసీ) ఇంటర్నెట్‌ స్పీడ్‌ 64 Kbpsకి పడిపోతుంది.

రిలయన్స్ జియో రూ.189 ప్లాన్‌ను ఇప్పటికే చాలామంది యూజర్లు తమ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవడానికి ఉపయోగిస్తున్నారు. ఔట్‌ గోయింగ్‌ & ఇన్‌కమింగ్‌ కాల్స్‌ ఉపయోగించుకుంటూ రోజుకు కొన్ని SMSలు పంపగలిగితే చాలు, పెద్ద మొత్తంలో డేటా అవసరం లేదు అనుకునే వ్యక్తులకు కూడా ఇది చాలా అనువైన ప్లాన్. అంటే, బేసిక్‌ నీడ్స్‌ చాలు అనుకునే యూజర్ల కోసం ఇది ఉత్తమ బడ్జెట్ ప్లాన్స్‌లో ఒకటి. అయితే, ఈ ప్లాన్‌లో అపరిమిత 5G ఉండదు.

రిలయన్స్‌ జియో రూ.189 ప్లాన్ దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు అందుబాటులో ఉంది. మైజియో (MyJio) యాప్, జియో.కామ్‌, ఇతర థర్డ్-పార్టీ రీఛార్జ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఈ ప్రి-పెయిడ్‌ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు.

మరో ఆసక్తికర కథనం: పోస్టాఫీస్‌ పథకాల వడ్డీ రేట్ల సవరణ - పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి రేట్లు ఎంత మారొచ్చు?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Vijayamma letter: ఆస్తుల వివాదంపై వైఎస్ విజయమ్మ  బహిరంగ లేఖ - జగన్‌కు గట్టి షాక్ !
ఆస్తుల వివాదంపై వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ - జగన్‌కు గట్టి షాక్ !
IND v NZ 3rd ODI Highlights: స్మృతీ మందాన అద్భుత శతకం, న్యూజిలాండ్‌పై భారత్ ఘనవిజయం - 2-1తో సిరీస్ కైవసం
స్మృతీ మందాన అద్భుత శతకం, న్యూజిలాండ్‌పై భారత్ ఘనవిజయం - 2-1తో సిరీస్ కైవసం
Ileana Suffering with BDD : బాడీ డైస్మోర్ఫిక్ డిజార్డర్.. ఇలియానాకు వచ్చిన వ్యాధి ఇదే, దీనికి చికిత్స ఉందా?
బాడీ డైస్మోర్ఫిక్ డిజార్డర్.. ఇలియానాకు వచ్చిన వ్యాధి ఇదే, దీనికి చికిత్స ఉందా?
KTR: కేటీఆర్‌కు అరెస్టు ముప్పు - తెరపైకి ఈ కార్ రేసు స్కాం - ఆ మాటల అర్థం అదేనా ?
కేటీఆర్‌కు అరెస్టు ముప్పు - తెరపైకి ఈ కార్ రేసు స్కాం - ఆ మాటల అర్థం అదేనా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మహేశ్ రాజమౌళి సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ | ABP DesamNara Lokesh Met Satya Nadella | మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో లోకేశ్ భేటీ | ABP DesamKerala CM Convoy Accident | సీఎం పినరయి విజయన్ కు తృటిలో తప్పిన ప్రమాదం | ABP Desamవిజయ్‌ పైన కూడా ఏసేశారుగా! తలపతికి పవన్ చురకలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Vijayamma letter: ఆస్తుల వివాదంపై వైఎస్ విజయమ్మ  బహిరంగ లేఖ - జగన్‌కు గట్టి షాక్ !
ఆస్తుల వివాదంపై వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ - జగన్‌కు గట్టి షాక్ !
IND v NZ 3rd ODI Highlights: స్మృతీ మందాన అద్భుత శతకం, న్యూజిలాండ్‌పై భారత్ ఘనవిజయం - 2-1తో సిరీస్ కైవసం
స్మృతీ మందాన అద్భుత శతకం, న్యూజిలాండ్‌పై భారత్ ఘనవిజయం - 2-1తో సిరీస్ కైవసం
Ileana Suffering with BDD : బాడీ డైస్మోర్ఫిక్ డిజార్డర్.. ఇలియానాకు వచ్చిన వ్యాధి ఇదే, దీనికి చికిత్స ఉందా?
బాడీ డైస్మోర్ఫిక్ డిజార్డర్.. ఇలియానాకు వచ్చిన వ్యాధి ఇదే, దీనికి చికిత్స ఉందా?
KTR: కేటీఆర్‌కు అరెస్టు ముప్పు - తెరపైకి ఈ కార్ రేసు స్కాం - ఆ మాటల అర్థం అదేనా ?
కేటీఆర్‌కు అరెస్టు ముప్పు - తెరపైకి ఈ కార్ రేసు స్కాం - ఆ మాటల అర్థం అదేనా ?
Suriya: జ్యోతికతో కలిసి ముంబైకి షిఫ్ట్ అయిపోయిన సూర్య... చెన్నై వదిలి ఎందుకు వెళ్ళాడో చెప్పిన కంగువ స్టార్
జ్యోతికతో కలిసి ముంబైకి షిఫ్ట్ అయిపోయిన సూర్య... చెన్నై వదిలి ఎందుకు వెళ్ళాడో చెప్పిన కంగువ స్టార్
Telangana News: పోలీసులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, దశలవారీగా అన్నీ మంజూరుకు రెడీ
పోలీసులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, దశలవారీగా అన్నీ మంజూరుకు రెడీ
Kapil Dev Meets Chandrababu: అమరావతిలో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్స్ క్లబ్ - చర్చించిన చంద్రబాబు, కపిల్ దేవ్
అమరావతిలో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్స్ క్లబ్ - చర్చించిన చంద్రబాబు, కపిల్ దేవ్
Mobile Phone Recovery: మొబైల్స్ రికవరీలో అనంతపురం పోలీసులు రికార్డు, వీటి విలువ అన్ని కోట్ల రూపాయలా!
మొబైల్స్ రికవరీలో అనంతపురం పోలీసులు రికార్డు, వీటి విలువ అన్ని కోట్ల రూపాయలా!
Embed widget