Jio Subscribers: మళ్లీ దుమ్మురేపిన జియో.. పోటీలో ఎయిర్‌టెల్! వొడాఫోన్ ఐడియాకు కష్టాలు
టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజా నివేదిక ప్రకారం జులైలో జియోలో 65 లక్షలు, ఎయిర్‌టెల్‌లో 19 లక్షల యాక్టివ్ యూజర్లు పెరిగారు. కాగా వొడాఫోన్ ఐడియా మాత్రం 14 లక్షల యూజర్లను కోల్పోయింది.
రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్ మార్కెట్లో దూసుకుపోతున్నాయి. యాక్టివ్ యూజర్లను భారీగా పెంచుకుంటున్నాయి. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజా నివేదిక ప్రకారం జులైలో జియోలో 65 లక్షలు, ఎయిర్‌టెల్‌లో 19 లక్షల యాక్టివ్ యూజర్లు పెరిగారు. కాగా వొడాఫోన్ ఐడియా మాత్రం 14 లక్షల యూజర్లను కోల్పోయింది.
Also Read: ఆల్ టైం గరిష్ఠానికి ఎగబాకిన సెన్సెక్స్.. చరిత్రలోనే కీలక మైలు రాయితో రికార్డు
మొత్తంగా జూన్‌లో 1,180 మిలియన్లుగా ఉన్న వైర్‌లైస్ సబ్‌స్క్రై బర్లు జులై ముగిసేనాటికి 0.51 శాతం పెరిగి 1,186.84 మిలియన్లకు చేరుకున్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లో జూన్‌లో 646.29గా ఉన్న వైర్‌లెస్ సబ్‌స్క్రై బర్లు జులై చివరికి 650.10 మిలియన్లకు చేరుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 534.54 నుంచి 536.74 మిలియన్లకు చేరుకున్నారు.
Also Read: మరింత పెరిగిన ఇంధన ధరలు, ఇక్కడ భారీగా.. హైదరాబాద్‌లో స్థిరం
దేశంలో టెలిఫోన్ సబ్‌స్క్రై బర్లు జూన్‌లో 1202.57 మిలియన్ల నుంచి జులై 1209.45 మిలియన్లకు పెరిగారు. ఇక పట్టణ ప్రాంతాల్లో 666 నుంచి 670 మిలియన్లకు, గ్రామీణ ప్రాంతాల్లో 536.47 నుంచి 538.70 మిలియన్లకు పెరిగారు. కాగా టెలికాం రంగంలో ప్రభుత్వం ఉద్దీపనలు, రాయితీలు ప్రకటించడంతో ఈ రంగంలో జోష్ పెరిగింది. కంపెనీలు సరికొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి.
Also Read: జొమాటో బాటలో ఓయో! ఐపీఓకు రానున్న హోటల్ అగ్రిగేటర్ కంపెనీ
ప్రస్తుత రిలయన్స్ జియో ఐపీఎల్ అన్ని జట్లకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. అందుకు సంబంధించిన వివరాలను నిత్యం అభిమానులతో పంచుకుంటోంది.
Also Read: స్పోర్ట్స్ బైక్ కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్... కొత్త ఆర్15 వచ్చేసింది.. ధర ఎంతంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Jeet ki second innings! 🌟
— Reliance Jio (@reliancejio) September 24, 2021
Put your cricket knowledge to test and win exciting prizes on Jio Cricket Play Along.
Download MyJio app: https://t.co/CNggG6yMDK#JioCricket #JioCricketPlayAlong #JioDigitalLife #Cricket #T20 #JioEngage #Jio pic.twitter.com/rd8wowKW0O
Cricket or Gully Cricket, @mipaltan is always ready 💯
— Reliance Jio (@reliancejio) September 23, 2021
Catch Entertainment Ki Second Innings live from home with JioFiber.#MIvKKR #JioCricket #JioTogether #CricketFever #MI #MumbaiIndians #MIPaltan #OneFamily #Jio pic.twitter.com/hjEHW55NdE