Jio Financial Demerger: జియో ఫైనాన్షియల్ షేర్ ధర ₹261.85, మార్కెట్ అంచనాలు బలాదూర్
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో రూ. 273 వద్ద స్థిరపడింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో రూ. 261.85 వద్ద క్లోజ్ అయింది.
Jio Financial Demerger: రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి డీమెర్జ్ చేస్తున్న ఆర్థిక సంస్థ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (Jio Financial Services) ఒక్కో షేర్ విలువను రూ. 261.85 గా నిర్ణయించారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్ స్థిర ధరను తెలుసుకోవడానికి, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో ఇవాళ (గురువారం, 20 జులై 2023) ప్రత్యేక సెషన్ నిర్వహించారు.
ఇవాళ ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో స్పెషల్ ప్రి-ఓపెన్ సెషన్ కండక్ట్ చేశారు. ఈ సెషన్‌లో, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో రూ. 273 వద్ద స్థిరపడింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో రూ. 261.85 వద్ద క్లోజ్ అయింది.
బ్రోకరేజ్ అంచనాలకు అందనంత దూరం
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్ ప్రైస్ రూ. 189 గా ఉండవచ్చని JP మోర్గాన్ గతంలో లెక్క వేసింది. జెఫరీస్ రూ. 179 గా, సెంట్రమ్ బ్రోకింగ్ రూ. 157-190 గా అంచనా వేశాయి. ఈ అంచనాలను జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్ ఓవర్ స్పీడ్‌తో ఓవర్‌టేక్ చేసి, చాలా ముందుకు దూసుకెళ్లింది.
ప్రత్యేక సెషన్‌లో, NSEలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) షేర్ ప్రైస్ రూ. 2580 వద్ద ఆగింది. BSEలో ఒక్కో షేరు రూ. 2589 వద్ద స్థిరపడింది.
స్పెషల్ ప్రి- ఓపెన్ సెషన్ కారణంగా, ఉదయం 9-10 గంటల మధ్య రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల సాధారణ ట్రేడింగ్ నిలిపేశారు. స్పెషల్ సెషన్ ముగిసిన తర్వాత, ఉదయం 10 గంటల నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల సాధారణ ట్రేడింగ్ స్టార్ట్ అయింది. ఈ సమయంలో, నిఫ్టీ50 ఇండెక్స్ పాయింట్లను లెక్కగట్టేందుకు రిలయన్స్ షేర్లను మినహాయించి మిగిలిన 49 కంపెనీల షేర్ల విలువలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు.
ఈ డీమెర్జర్‌తో, అర్హత గల రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్వెస్టర్లు/షేర్ హోల్డర్లకు 1:1 రేషియోలో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (JFSL) షేర్లు లభిస్తాయి. అంటే, రికార్డ్ డేట్ (20 జులై 2023) నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో హోల్డ్ చేస్తున్న ప్రతి ఒక షేరుకు ఒక జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్ లభిస్తుంది. 100 RIL షేర్లకు 100 JFSL షేర్లు వాళ్ల డీమ్యాట్ అకౌంట్స్‌లో యాడ్ అవుతాయి.
36 లక్షల మంది షేర్‌హోల్డర్లకు బెనిఫిట్
మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశంలోనే అతి పెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్. ప్రస్తుతం, RILలో ప్రస్తుతం ఉన్న 36 లక్షల మంది షేర్‌హోల్డర్లు ఉన్నట్లు అంచనా. డీమెర్జర్‌తో వీళ్లందరూ ప్రయోజనం పొందుతారు.
స్టాక్ ఎక్స్ఛేంజీల్లో JFSL షేర్లు లిస్ట్ అయిన తర్వాత, వరుసగా మూడు రోజుల పాటు నిఫ్టీ50 ఇండెక్స్‌లో దీనిని చేరుస్తారు. అంటే, ఆ సూచీలో 51వ కంపెనీ షేరుగా జియో ఫైనాన్షియల్ స్టాక్ యాడ్ అవుతుంది. ఈ 3 రోజుల ట్రేడింగ్ వల్ల ఈ కౌంటర్‌లో ఓలటాలిటీ తగ్గి, సాధారణ స్థాయికి చేరుతుంది. 3 రోజుల తర్వాత అన్ని ఇండెక్స్‌ల నుంచి పూర్తయ్యాక.. అన్ని సూచీల్లో నుంచి JFSL షేర్లను తొలగిస్తారు.
ఈ ఏడాది అక్టోబర్ నాటికి జియో ఫైనాన్షియల్ షేర్లను స్టాక్స్ ఎక్సేంజీల్లో లిస్ట్ చేయాలన్నది రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్లాన్.
మరో ఆసక్తికర కథనం: దూసుకెళుతున్న గోల్డ్ రేటు - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial