News
News
X

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

RBI to Launch Digital Rupee: ఆర్థిక రంగంలో భారత్‌ అద్భుతాలు చేస్తూనే ఉంది! అతి త్వరలోనే డిజిటల్‌ రూపాయిని ఆవిష్కరించనుంది.

FOLLOW US: 

RBI to Launch Digital Rupee: ఆర్థిక రంగంలో భారత్‌ అద్భుతాలు చేస్తూనే ఉంది! అతి త్వరలోనే డిజిటల్‌ రూపాయిని ఆవిష్కరించనుంది. ప్రత్యేక అవసరాలకు ఉపయోగించుకొనేలా పైలట్‌ ప్రాజెక్టును ఆరంభించబోతున్నామని ఆర్బీఐ ప్రకటించింది. అంతేకాకుండా సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (CBDC)పై ఒక కాన్సెప్ట్‌ నోట్‌ను విడుదల చేసింది. డిజిటల్‌ రూపాయి ఫీచర్ల గురించి అందులో అవగాహన కల్పించింది. ప్రాజెక్టు సక్సెస్‌ అయ్యేకొద్దీ మరిన్ని ప్రయోజాలు, ఫీచర్ల గురించి వివరిస్తామని వెల్లడించింది.

'ప్రస్తుతం నగదుకు ఉన్న ప్రత్యామ్నాయ రూపాల్లో ఈ-రూపీ మరో అదనపు ఆప్షన్‌ ఇవ్వనుంది. బ్యాంకు నోట్లకు దీనికీ తేడా లేదు. డిజిటల్‌ రూపంలో ఉండటంతో సులభంగా, వేగంగా, తక్కువ ఖర్చుతోనే వాడుకోవచ్చు. ఇతర డిజిటల్‌ కరెన్సీకి ఉన్న ప్రయోజనాలే దీనికీ వర్తిస్తాయి' అని ఆర్బీఐ ప్రకటించింది. డిజిటల్‌ రూపాయి టెక్నాలజీ, డిజైన్‌, ఉపయోగాలు, జారీ పద్ధతుల గురించి కాన్సెప్ట్‌ నోట్‌లో ఆర్బీఐ వివరించింది. బ్యాంకింగ్‌ వ్యవస్థ, మానిటరీ పాలసీ, ఆర్థిక స్థిరత్వం, ప్రైవసీ అంశాల్లో డిజిటల్‌ రూపాయిని ప్రవేశపెట్టడం వల్ల కలిగే ప్రభావం మదింపు చేయనుంది.

CBDC అంటే ఏమిటి?

డిజిటల్‌ రూపాయిని ఆర్బీఐ లీగల్ టెండర్‌గా గుర్తించింది. ఇది ఫియట్ కరెన్సీకి సమానం. ఫియట్ కరెన్సీని అత్యంత సులభంగా బదిలీ చేసుకోవచ్చు. ఇతర కరెన్సీల్లోకి మార్చుకోవచ్చు. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ప్రస్తుత మన రూపాయి, డిజిటల్‌ రూపాయి వేర్వేరు కావు. భౌతిక రూపాయికి డిజిటల్‌ రూపమే సీబీడీసీ. క్రిప్టో కరెన్సీలా డిజిటల్‌ కరెన్సీ విలువ హెచ్చు తగ్గులకు లోనవ్వదు. 

News Reels

సాధారణ కరెన్సీతో డిజిటల్ లావాదేవీలు చేపట్టడం, డిజిటల్ రూపాయితో లావాదేవీలు చేయడానికి మధ్య వ్యత్యాసం ఉంది. భీమ్‌, గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎం వంటి యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వేదికల ద్వారా డిజిటల్ లావాదేవీలు జరుగుతాయి. ఇందుకు బ్యాంకింగ్‌ వ్యవస్థ అవసరం ఉంటుంది. ఆన్‌లైన్ లావాదేవీల కోసం కస్టమర్లు తమ బ్యాంక్ ఖాతాలను UPIతో లింక్ చేయాలి. డిజిటల్‌ రూపాయికి బ్యాంకింగ్‌ వ్యవస్థ అవసరం లేదు. నేరుగా కేంద్ర బ్యాంకైన ఆర్బీఐతోనే లావాదేవీలు నిర్వహించొచ్చు.


CBDC ఉపయోగం ఏంటి?

ప్రపంచంలో భారత్‌ మాత్రమే డిజిటల్‌ కరెన్సీని రూపొందించడం లేదు. 90 శాతం సెంట్రల్ బ్యాంకులు CBDC పనిలో నిమగ్నమయ్యాయి. ఇందులో నాలుగో వంతు డిజిటల్‌ కరెన్సీని అభివృద్ధి చేస్తున్నాయి. మరికొన్ని ఇప్పటికే  పైలట్‌ ప్రాజెక్టును అమలు చేస్తున్నాయి. బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్ నిర్వహించిన సర్వేలో CBDCలని అభివృద్ధి చేస్తున్న సెంట్రల్ బ్యాంకుల సంఖ్య గతేడాది రెట్టింపైందని తెలిసింది.

 రెండేళ్లుగా క్రిప్టోకరెన్సీలు పెరిగాయి. ప్రజలు వీటిని లావాదేవీలకు ఉపయోగిస్తున్నారు. అందుకే స్టేబుల్‌ కాయిన్‌లను రూపొందించాలని భారత్‌ సహా ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. లీగల్‌ కరెన్సీకి భద్రత కల్పించాలని అనుకుంటున్నాయి. ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ మార్కెట్ వల్ల కేంద్ర బ్యాంకులు అసౌకర్యానికి గురవుతున్నాయి. ఇవి చట్టబద్ధ కరెన్సీకి సవాళ్లు విసురుతున్నాయి.

CBDCతో కస్టమర్లకు ప్రయోజనం ఏంటి?

డిజిటల్‌ లావాదేవీల్లో UPI అత్యంత విజయవంతమైంది. అలాంటప్పుడు CBDC కస్టమర్లకు ఎలా ఉపయోగపడుతుందన్న ప్రశ్న వస్తుంది. UPI ఖచ్చితంగా అతిపెద్ద డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అనడంలో సందేహం లేదు. వినూత్న విధానం ద్వారా CBDC పోటీని పెంచుతుంది. ఇతర డిజిటల్‌ లావాదేవీల్లాగా అనిపించినా CBDC సెంట్రల్ బ్యాంకుతో ప్రత్యక్ష్య సంబంధం కలిగి ఉంటుంది. ఇది మరింత సురక్షితమైనది. బ్యాంక్ డిపాజిట్ల ద్వారా డబ్బును బదిలీ చేసేందుకు ఎలాంటి వాటిపై ఆధారపడదు. దేశంలోడిజిటల్‌ లావాదేవీలు పెరిగినా ఇప్పటికీ నగదునే ఎక్కువగా ఉపయోగిస్తున్నట్టు ఆర్బీఐ సర్వే 2018-19 తెలిపింది.  డిజిటల్‌ రూపాయి బ్యాంకింగ్‌ వ్యవస్థ ద్వారా రాదు కాబట్టి గోప్యతకు వీలుంటుంది. కరెన్సీ నోట్ల తగ్గించేందుకు ఆర్బీఐకి సాయం చేస్తుంది.

Published at : 07 Oct 2022 06:29 PM (IST) Tags: Digital rupee Central Bank Digital Currency CBDC RBI digital money

సంబంధిత కథనాలు

EPFO News: ఈపీఎఫ్‌, పింఛన్‌, బీమాల్లో మార్పు చేస్తున్న కేంద్రం - అన్నీ కలిపి..!

EPFO News: ఈపీఎఫ్‌, పింఛన్‌, బీమాల్లో మార్పు చేస్తున్న కేంద్రం - అన్నీ కలిపి..!

Elon Musk Twitter: ట్విట్టర్‌పై ఓ కన్నేసి ఉంచాం- మస్క్ స్పీడుకు వైట్ హౌస్ బ్రేకులు!

Elon Musk Twitter: ట్విట్టర్‌పై ఓ కన్నేసి ఉంచాం- మస్క్ స్పీడుకు వైట్ హౌస్ బ్రేకులు!

Stock Market Closing 29 November 2022: షైనింగ్‌.. షైనింగ్‌! రికార్డు లాభాల్లో క్లోజైన నిఫ్టీ, సెన్సెక్స్‌

Stock Market Closing 29 November 2022: షైనింగ్‌.. షైనింగ్‌! రికార్డు లాభాల్లో క్లోజైన నిఫ్టీ, సెన్సెక్స్‌

Cryptocurrency Prices: 24 గంటల్లో బిట్‌కాయిన్‌ ఎంత పెరిగిందంటే?

Cryptocurrency Prices: 24 గంటల్లో బిట్‌కాయిన్‌ ఎంత పెరిగిందంటే?

Jio Network Outage: యూజర్లకు జియో షాక్‌! ఆగిపోయిన కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌, డేటా సేవలు!

Jio Network Outage: యూజర్లకు జియో షాక్‌! ఆగిపోయిన కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌, డేటా సేవలు!

టాప్ స్టోరీస్

Bandi Sanjay : భైంసా పేరు మహిషాగా మారుస్తాం, పీడీయాక్ట్ లు ఎత్తేసి ఉద్యోగాలిస్తాం - బండి సంజయ్

Bandi Sanjay :  భైంసా పేరు మహిషాగా మారుస్తాం, పీడీయాక్ట్ లు ఎత్తేసి ఉద్యోగాలిస్తాం - బండి సంజయ్

Ys Vijayamma Comments : ఆ రాష్ట్రంతో మనకేంటి ? - ఏపీ గురించి వైఎస్ విజయమ్మ సంచలన కామెంట్స్ !

Ys Vijayamma Comments : ఆ రాష్ట్రంతో మనకేంటి ? - ఏపీ గురించి వైఎస్ విజయమ్మ  సంచలన కామెంట్స్ !

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

Ram Gopal Varma Tweet పుట్టినరోజు ఆయనదైతే నాకు దండేశారేంటి : వైరల్ అవుతోన్న ఆర్జీవి ట్వీట్

Ram Gopal Varma Tweet పుట్టినరోజు ఆయనదైతే నాకు దండేశారేంటి : వైరల్ అవుతోన్న ఆర్జీవి ట్వీట్