అన్వేషించండి

Paytm: పేమెంట్స్ బ్యాంక్‌పై మీ అన్ని అనుమానాలకు RBI సమాధానాలు, ఇదిగో FAQs లిస్ట్‌

ఆర్‌బీఐ కొంత ఊరట ప్రకటించింది. ఆ గడువు తేదీని 15 మార్చి 2024 వరకు పొడిగించింది.

RBI Releases FAQs On Paytm Payments Bank: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై తీసుకున్న చర్యలకు సంబంధించి, ఖాతాదార్లలో ఉన్న చాలా ప్రశ్నలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సమాధానాలు విడుదల చేసింది. ఈ FAQsను (Frequently Asked Questions) ఒకసారి పరిశీలిద్దాం. 29 ఫిబ్రవరి 2024 నుంచి వర్తించేలా పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై విధించిన ఆంక్షలకు సంబంధించి, ఆర్‌బీఐ కొంత ఊరట ప్రకటించింది. ఆ గడువు తేదీని 15 మార్చి 2024 వరకు పొడిగించింది.

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు - సమాధానాలు

ప్రశ్న - నాకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో సేవింగ్స్, కరెంట్ ఖాతా ఉంది. మార్చి 15 తర్వాత నేను డబ్బు విత్‌డ్రా చేయగలనా? బ్యాంకు నుంచి వచ్చిన డెబిట్ కార్డు ఏమవుతుంది?

సమాధానం: మార్చి 15 తర్వాత కూడా మీరు డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు, డెబిట్ కార్డ్‌ను ఉపయోగించవచ్చు. ఖాతా ఖాళీ అయ్యే వరకు డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు.
 
ప్రశ్న - పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సేవింగ్స్, కరెంట్ అకౌంట్‌కి డబ్బు డిపాజిట్ చేయవచ్చా లేదా బదిలీ చేయవచ్చా?

సమాధానం - మార్చి 15 తర్వాత డబ్బు డిపాజిట్ చేయలేరు.

ప్రశ్న - నా రీఫండ్ మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలోకి వస్తుంది. ఇది ఆ ఖాతాలో జమ అవుతుందా?

సమాధానం – మార్చి 15 తర్వాత కూడా రీఫండ్, క్యాష్‌బ్యాక్, వడ్డీ బ్యాంకు ఖాతాకు వస్తాయి. ఇతరుల నుంచి మాత్రం నగదును పొందలేరు. 

ప్రశ్న - స్వీప్ ఇన్/అవుట్ కింద భాగస్వామ్య బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన డబ్బు ఏమవుతుంది?

సమాధానం: స్వీప్ ఇన్ సౌకర్యం మార్చి 15 వరకు కొనసాగుతుంది. మార్చి 15 తర్వాత డిపాజిట్ సౌకర్యం అందుబాటులో ఉండదు.

ప్రశ్న - నా జీతం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలోకి వస్తుంది. అదే ఖాతాలో జీతం వస్తుందా?

సమాధానం - మార్చి 15 తర్వాత మీ జీతాన్ని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలో జమ చేయలేరు. మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే మరొక ఖాతాను ఉపయోగించండి.

ప్రశ్న - పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలోకి సబ్సిడీ వస్తుందా?

సమాధానం – మార్చి 15 తర్వాత, సబ్సిడీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాకు రాదు. ఈ అసౌకర్యాన్ని నివారించడానికి మరొక ఖాతాను ఉపయోగించండి.

ప్రశ్న - నా కరెంటు బిల్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా డెబిట్‌ అవుతుంది. మార్చి 15 తర్వాత పరిస్థితి ఏంటి?

సమాధానం - మార్చి 15 తర్వాత కూడా, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలో నిల్వ ఉన్నంత వరకు విద్యుత్ బిల్లు చెల్లింపు జరుగుతుంది. ఖాతా ఖాళీ అయ్యాక ఇబ్బంది పడకుండా ఉండాలంటే వేరే ఖాతాను ఉపయోగించండి.

ప్రశ్న - నా OTT సభ్యత్వం నెలవారీ చెల్లింపు పేటీఎం చెల్లింపుల బ్యాంక్ ఖాతా నుంచి ఆటో డెబిట్‌ అవుతుంది. మార్చి 15 తర్వాత పరిస్థితి ఏంటి?

సమాధానం - మార్చి 15 తర్వాత కూడా, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలో బ్యాలెన్స్ వరకు చెల్లింపు కొనసాగుతుంది. ఖాతా ఖాళీ అయ్యాక ఇబ్బంది పడకుండా ఉండాలంటే వేరే ఖాతాను ఉపయోగించండి.

ప్రశ్న - పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతా నుండి ప్రతి నెలా నా లోన్ EMI ఆటోమేటిక్ చెల్లింపు జరుగుతుంది. ఇప్పుడు అతను ఏం చేయాలి?

సమాధానం - మార్చి 15 తర్వాత కూడా, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలో బ్యాలెన్స్ వరకు EMI చెల్లింపు కొనసాగుతుంది. మార్చి 15 తర్వాత, ఆ ఖాతాలో డబ్బు జమ చేయలేరు. అందువల్ల, అసౌకర్యాన్ని నివారించడానికి, వేరే ఖాతాను ఉపయోగించండి.

ప్రశ్న - నా లోన్ EMI చెల్లింపు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతా నుంచి కాకుండా ఇతర బ్యాంక్‌లోని నా ఖాతా ద్వారా ఆటోమేటిక్‌గా డెబిట్‌ జరుగుతుంది. ఇది కొనసాగించవచ్చా?

సమాధానం - అవును, EMI చెల్లింపును పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ నుంచి కాకుండా మరే ఇతర బ్యాంక్‌ ఖాతా నుంచైనా కొనసాగించవచ్చు.

ప్రశ్న - నా వాలెట్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో ఉంది. దీనిని ఉపయోగించవచ్చా?

సమాధానం - అవును, మార్చి 15 తర్వాత కూడా, వాలెట్‌ ఖాళీ అయ్యే వరకు డబ్బు ఉపసంహరించుకోవచ్చు. ఆపై రీఛార్జి చేయడం కుదరదు. డబ్బు బదిలీ చేయడానికి మార్చి 15 లోపు దీనిని ఉపయోగించవచ్చు.

ప్రశ్న - నా వాలెట్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో ఉంది. దానిని టాప్ అప్ చేయవచ్చా? వేరొకరి నుంచి ఈ వాలెట్‌లోకి డబ్బు డిపాజిట్ చేయవచ్చా?

సమాధానం - లేదు, క్యాష్‌బ్యాక్, రీఫండ్ మాత్రమే వస్తాయి. ఇది కాకుండా, ఇది ఏ విధంగానూ టాప్ అప్ చేయడం కదరదు.

ప్రశ్న - పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్‌లో క్యాష్‌బ్యాక్ రాబోతోంది. మార్చి 15 తర్వాత అయినా వస్తాయా?

సమాధానం - అవును, మార్చి 15 తర్వాత కూడా క్యాష్‌ బ్యాక్, రీఫండ్ వస్తాయి.

ప్రశ్న - పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్‌ని మూసివేసిన తర్వాత, మిగిలిన బ్యాలెన్స్‌ని ఏదైనా ఇతర బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయవచ్చా?

సమాధానం - అవును, మీరు ఫుల్‌ KYC వాలెట్‌ను మూసేసి, ఆ బ్యాలెన్స్‌ను బదిలీ చేయవచ్చు. మినిమమ్‌ KYC వాలెట్ డబ్బును ఉపయోగించవచ్చు.

మరో ఆసక్తికర కథనం: పేటీఎం నోడల్ ఖాతా యాక్సిస్ బ్యాంక్‌కు మార్పు - పేమెంట్లకు ఇబ్బంది ఉండదు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun to Sandhya Theater: పోలీసులు అల్లు అర్జున్‌ను సంధ్య థియేటర్‌కు తీసుకెళ్తారా! అసలేం జరుగుతోంది?
Allu Arjun to Sandhya Theater: పోలీసులు అల్లు అర్జున్‌ను సంధ్య థియేటర్‌కు తీసుకెళ్తారా! అసలేం జరుగుతోంది?
Tirumala : తిరుపతిలో అపచారం.. అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ పెట్టిన ఆగంతకులు
తిరుపతిలో అపచారం - అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ పెట్టిన ఆగంతకులు
Allu Arjun At Chikkadapalli Police Station: విచారణకు హాజరైన అల్లు అర్జున్ - లాయర్ సమక్షంలో బన్నీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న పోలీసులు
విచారణకు హాజరైన అల్లు అర్జున్ - లాయర్ సమక్షంలో బన్నీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న పోలీసులు
Telangana News: తెలంగాణ హైకోర్టులో మాజీ సీం కేసీఆర్, హరీష్ రావులకు ఊరట
తెలంగాణ హైకోర్టులో మాజీ సీం కేసీఆర్, హరీష్ రావులకు ఊరట
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

దోమల్‌గూడలో భారీ చోరీ, వైరల్ అవుతున్న సీసీ ఫుటేజ్చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్, కొనసాగుతున్న విచారణచిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి బయల్దేరిన అల్లు అర్జున్Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun to Sandhya Theater: పోలీసులు అల్లు అర్జున్‌ను సంధ్య థియేటర్‌కు తీసుకెళ్తారా! అసలేం జరుగుతోంది?
Allu Arjun to Sandhya Theater: పోలీసులు అల్లు అర్జున్‌ను సంధ్య థియేటర్‌కు తీసుకెళ్తారా! అసలేం జరుగుతోంది?
Tirumala : తిరుపతిలో అపచారం.. అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ పెట్టిన ఆగంతకులు
తిరుపతిలో అపచారం - అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ పెట్టిన ఆగంతకులు
Allu Arjun At Chikkadapalli Police Station: విచారణకు హాజరైన అల్లు అర్జున్ - లాయర్ సమక్షంలో బన్నీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న పోలీసులు
విచారణకు హాజరైన అల్లు అర్జున్ - లాయర్ సమక్షంలో బన్నీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న పోలీసులు
Telangana News: తెలంగాణ హైకోర్టులో మాజీ సీం కేసీఆర్, హరీష్ రావులకు ఊరట
తెలంగాణ హైకోర్టులో మాజీ సీం కేసీఆర్, హరీష్ రావులకు ఊరట
Unstoppable 4 Latest Promo: మోసం చేశారంటూ ఎమోషనలైన వెంకటేష్ - 'అన్‌స్టాపబుల్ 4' వెంకీ మామతో బాలయ్య ప్రోమో వచ్చేసిందోచ్
మోసం చేశారంటూ ఎమోషనలైన వెంకటేష్ - 'అన్‌స్టాపబుల్ 4' వెంకీ మామతో బాలయ్య ప్రోమో వచ్చేసిందోచ్
Viral News: పుష్ప 2 సినిమా చూసొచ్చి ఏకంగా బస్సు ఎత్తుకెళ్లాడు, ట్విస్ట్ ఏంటంటే!
పుష్ప 2 సినిమా చూసొచ్చి ఏకంగా బస్సు ఎత్తుకెళ్లాడు, ట్విస్ట్ ఏంటంటే!
Prayagraj Mahakumbh 2025 : రూ.5కే మహా కుంభమేళా చరిత్ర..ప్రయాగ్ రాజ్ లో ఏర్పాట్లు మొత్తం టెక్నాలజీ మయం!
రూ.5కే మహా కుంభమేళా చరిత్ర..ప్రయాగ్ రాజ్ లో ఏర్పాట్లు మొత్తం టెక్నాలజీ మయం!
TollyWood: ఫిల్మ్ ఇండస్ట్రీని ఏపీకి తీసుకెళ్లేందుకు పవన్ ప్రయత్నాలు - ఎంత వరకు సక్సెస్ అవుతాయి ?
ఫిల్మ్ ఇండస్ట్రీని ఏపీకి తీసుకెళ్లేందుకు పవన్ ప్రయత్నాలు - ఎంత వరకు సక్సెస్ అవుతాయి ?
Embed widget