అన్వేషించండి

RBI MPC Meeting: బ్యాంక్‌ ఇబ్బంది పెడితే ఫిర్యాదు చేయడం ఇంకా ఈజీ, అంబుడ్స్‌మన్ స్కీమ్‌లో మార్పు

బ్యాంకింగ్ సేవలకు సంబంధించి కస్టమర్ చేసే ఫిర్యాదులను పరిష్కరించే వ్యవస్థను ఇది బలోపేతం చేస్తుంది.

RBI MPC Meeting: ప్రతి ఒక్కరికి బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో ఏదో ఒక పని పడుతూనే ఉంటుంది. అదే సమయంలో, వాటి వల్ల చాలాసార్లు ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదైనా బ్యాంక్‌ లేదా ఆర్థిక సంస్థ ఏదైనా సేవను అందించడానికి నిరాకరిస్తే లేదా ఇబ్బంది పెడితే... దానికి సంబంధించి కంప్లైంట్‌ చేయడానికి ఇప్పటికే కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి. తాజాగా, కస్టమర్ ఫిర్యాదులను పరిష్కరించే ప్రక్రియను మరింత సరళంగా మారుస్తామని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ఈ మార్పుల తర్వాత కస్టమర్‌ సమస్యలు వేగంగా, సులువుగా పరిష్కారం అవుతాయని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ చెప్పారు. 

ఈ రోజు (శుక్రవారం, 06 అక్టోబర్‌ 2023), ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశం తర్వాత, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ కొన్ని కీలక నిర్ణయాలను వెల్లడించారు. రెపో రేటును స్థిరంగా, 6.50% వద్దే ఉంచుతున్నామని చెప్పారు. బ్యాంకింగ్‌ సర్వీసుల విషయంలో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను MPC దృష్టికి వచ్చాయని, మీటింగ్‌లో డిస్కషన్‌ జరిగిందని చెప్పారు. ఆ చర్చల తర్వాత ఒక నిర్ణయానికి వచ్చామని, బ్యాంకింగ్‌ ఛానల్‌లో సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడంతోపాటు, వారు చేసే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించే ప్రక్రియను సులభతరం చేస్తామని చెప్పారు. 

ప్రస్తుతం అంబుడ్స్‌మన్‌ వ్యవస్థ ఇలా ఉంది
ప్రస్తుతం, బ్యాంక్‌ కస్టమర్‌ చేసే ఫిర్యాదులను పరిష్కరించడానికి అంబుడ్స్‌మన్‌ స్కీమ్‌ (ombudsman scheme) అమల్లో ఉంది. దీని కింద రెండు ఛానెల్స్ ఉన్నాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో ఒక ఛానెల్ ఉంది, దీనిని ఇంటర్నల్ అంబుడ్స్‌మన్ స్కీమ్ అంటారు. రెండో ఛానెల్ రిజర్వ్ బ్యాంక్ అంబుడ్స్‌మన్ పథకం. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు), ప్రీపెయిడ్ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ ‍‌(PPIలు), క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు ‍‌(CICలు) ఇంటర్నల్ అంబుడ్స్‌మన్ స్కీమ్‌ ప్రకారం పని చేస్తాయి. వీటి పరిధి తర్వాత, ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడానికి రిజర్వ్ బ్యాంక్ అంబుడ్స్‌మన్ వ్యవస్థ ఉపయోగపడుతుంది.

అంబుడ్స్‌మన్ ఫ్రేమ్‌వర్క్‌లో ఈ మార్పులు
ప్రస్తుత వ్యవస్థలో, అన్ని రకాల ఆర్థిక సంస్థల్లో ఇంటర్నల్‌ అంబుడ్స్‌మన్ స్కీమ్‌ విధివిధానాలు ఒకే విధంగా లేవు. బ్యాంకులు, NBFCలు, PPIలు, CIC వంటి వాటికి ఇంటర్నల్ అంబుడ్స్‌మన్ ఫ్రేమ్‌వర్క్ మార్గదర్శకాలు భిన్నంగా ఉన్నాయని ఆర్‌బీఐ గవర్నర్ చెప్పారు. ఈ మార్గదర్శకాల ఫీచర్స్‌ ఒకేలా ఉన్నప్పటికీ, అవి విభిన్నంగా ఉన్నాయని వివరించారు. ఇప్పుడు, ఆ మార్గదర్శకాలను అన్ని రకాల ఆర్థిక సంస్థలకు ఏకరీతిలో ఉండేలా రూపొందించాలని RBI MPC మీటింగ్‌లో నిర్ణయించారు. బ్యాంకింగ్ సేవలకు సంబంధించి కస్టమర్ చేసే ఫిర్యాదులను పరిష్కరించే వ్యవస్థను ఇది బలోపేతం చేస్తుంది.

పట్టణ సహకార సంఘాలకు బహుమతి
బుల్లెట్ రీపేమెంట్ స్కీమ్‌కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ మరో ముఖ్యమైన ప్రకటన చేసింది. ఎంపిక చేసిన అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులకు బుల్లెట్ రీపేమెంట్ పథకం కింద 'బంగారంపై రుణ పరిమితి'ని ప్రస్తుతం ఉన్న రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలకు పెంచాలని నిర్ణయించినట్లు గవర్నర్ దాస్ తెలిపారు. మార్చి 31, 2023 నాటికి ప్రాధాన్యత రంగానికి ఇచ్చే రుణ లక్ష్యాన్ని పూర్తి చేసిన పట్టణ సహకార బ్యాంకులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే, వివిధ రంగాలకు రుణాలు అందించాలనే లక్ష్యంతో, అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ప్రోత్సాహం ఇస్తోంది.

మరో ఆసక్తికర కథనం: ఈసారి పండుగ సంబరం మరింత భారం, సరుకుల రేట్లు తగ్గే ఛాన్స్‌ లేదంటున్న ఆర్‌బీఐ

Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

టాప్ హెడ్ లైన్స్

Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget