అన్వేషించండి

RBI MPC Meet: రెపో రేట్‌ యథాతథం, మార్కెట్‌ ఊహించిందే జరిగింది

2023 ఫిబ్రవరిలో రెపో రేటును 6.5 శాతానికి చేర్చిన ఆర్‌బీఐ, అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే రేట్‌ కంటిన్యూ చేస్తోంది. 

RBI MPC Meet February 2024 Decisions: గత కొంతకాలంగా మార్కెట్‌ ఊహించిందే జరిగింది. ఆర్‌బీఐ రెపో రేట్‌ ఈసారి కూడా మారలేదు. రెపో రేట్‌ను ప్రస్తుతమున్న 6.5 శాతం నుంచి మార్చకూడదని రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ (RBI MPC) నిర్ణయించింది.

రెపో రేట్‌ను స్థిరంగా కొనసాగించడం వరుసగా ఇది ఆరోసారి. ఈ ఏడాది ఏప్రిల్‌లో RBI MPC తదుపరి మీటింగ్‌ ఉంటుంది. అప్పటి వరకు ఇదే రేట్‌ కొనసాగుతుంది.

2023 ఫిబ్రవరిలో రెపో రేటును 6.5 శాతానికి చేర్చిన ఆర్‌బీఐ, అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే రేట్‌ కంటిన్యూ చేస్తోంది. 

దేశంలో వడ్డీ రేట్లు తగ్గుతాయన్న ఆశలపై చిల్లర ద్రవ్యోల్బణం (Retail Inflation) నీళ్లు చల్లుతోంది. ఆహార ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉండడంతో కోర్‌ ఇన్‌ఫ్లేషన్‌ దిగి రావడం లేదు. సీపీఐ ద్రవ్యోల్బణం (CPI Inflation) రేట్‌, వరుసగా నాలుగో నెలలోనూ, ఆర్‌బీఐ గరిష్ట సహన పరిమితి అయిన 6%కు దగ్గరగా ఉంది. 2023 డిసెంబర్‌లో ఇది 5.69% గా నమోదైంది, నవంబర్‌లోని 5.55% నుంచి కొంచెం పెరిగింది. అదే సమయంలో ఆహార ద్రవ్యోల్బణం 8.7% నుంచి 9.5% కు భారీగా పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం వల్లే CPI ఇన్‌ఫ్లేషన్‌ ‍గత నాలుగు నెలల్లోనే అత్యధికంగా డిసెంబర్‌లో 5.69% కు చేరింది. 2024 జనవరి నెలలో ద్రవ్యోల్బణం లెక్కలు మరికొన్ని రోజుల్లోనే విడుదలవుతాయి.

వివిధ దేశాల కేంద్ర బ్యాంక్‌ల ప్రభావం
అంతర్జాతీయంగా చూస్తే, వివిధ దేశాల సెంట్రల్‌ బ్యాంక్‌లు కూడా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా, పాత రేట్లనే కంటిన్యూ చేస్తున్నాయి. అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ యూఎస్‌ ఫెడ్‌, యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ వంటి కీలక బ్యాంక్‌లు కీలక రేట్ల మీద 'స్టేటస్‌ కో' కొనసాగిస్తున్నాయి. ఆ ప్రభావం ఆర్‌బీఐ మీద కనిపించింది.

టాప్ హెడ్ లైన్స్

MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget