RBI Monetary Policy: ధరలు పెరుగుతున్నా..! వడ్డీరేట్లు మార్చని ఆర్బీఐ - తగ్గించిన వృద్ధిరేటు అంచనాలు
RBI Monetary Policy: కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్ణయం తీసుకుంది. రెపో రేటును (Repo rate) 4 శాతం, రివర్స్ రెపోరేటును (Reverse repo rate) 3.35 శాతం ఉంచింది.
RBI Monetary Policy MPC Repo Rate Unchanged RBI Governor Shaktikanta Das: కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్ణయం తీసుకుంది. రెపో రేటును (Repo rate) 4 శాతం, రివర్స్ రెపోరేటును (Reverse repo rate) 3.35 శాతం ఉంచింది. కీలక రేట్లలో మార్పులు చేయకూడదని ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) నిర్ణయించిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta das) మీడియాకు తెలిపారు.
'కరోనా మూడు వేవ్స్‌లో వచ్చిన ఇబ్బందులను తొలగించడంలో ఆర్‌బీఐ విజయవంతమైంది. సరైన సమయంలో సరైన చర్యలు తీసుకుంది. కానీ రెండేళ్ల తర్వాత ఉక్రెయిన్‌పై యుద్ధంతో ఎకానమీలో (Economy) అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఐరోపా విరుద్ధ ప్రయోజనాల వల్ల గ్లోబల్ ఎకానమీ పట్టాలు తప్పే అవకాశం ఉంది' అని శక్తికాంత దాస్ అన్నారు. యుద్ధం ఆరంభమయ్యాక, కొత్త ఆర్థిక ఏడాది ఆరంభం తర్వాత ఎంపీసీ తొలిసారి సమావేశం కావడం గమనార్హం.
2022-23కు ద్రవ్యోల్బణం రేను 5.7 శాతంగా ఎంపీసీ అంచనా వేసింది. అంతకు ముందున్న అంచనా రేటు 4.5 శాతాన్ని సవరించింది. గతంలో 7.8 శాతంగా అంచనా వేసిన భారత జీడీపీ (GDP) వృద్ధిరేటును 2023గాను 7.2 శాతానికి తగ్గించింది. 2022, ఏప్రిల్ 1 నాటికి ఫారెక్స్ నిల్వలు 606.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని శక్తికాంత దాస్ తెలిపారు. 2021-22లో ఇండియా ఎగుమతులు వేగంగా పెరిగాయని పేర్కొన్నారు. 400 బిలియన్ డాలర్లుగా పెట్టుకున్న లక్ష్యాన్ని అధిగమించాయని వెల్లడించారు.
'ముడి చమురు ధరలు (Crude oil) హఠాత్తుగా పెరిగినప్పటికీ కరెంట్ అకౌంట్ లోటు అదుపులోనే ఉంటుందని అంచనా వేస్తున్నాం. జాగ్రత్తగా ఉంటూనే దూకుడుగా ఉండాలన్న మా విధానాన్ని ఎంపీసీ ఏకగ్రీవంగా ఆమోదించింది' అని దాస్ తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని ఏటీఎం యంత్రాల్లో కార్డ్‌లెస్ సౌకర్యం కల్పించాలని ఆయన ప్రతిపాదించారు. రబీ దిగుబడి బాగుండటంతో అర్బన్ డిమాండ్‌కు బూస్ట్ వస్తుందని ఆయన అంచనా వేశారు.
Post Monetary Policy Press Conference with RBI Governor https://t.co/xUdJV8hJkR
— ReserveBankOfIndia (@RBI) April 8, 2022
Monetary Policy Report – April 2022 @DasShaktikanta #RBItoday #RBIgovernor #monetaryPolicy https://t.co/z9T7B7H7u8
— ReserveBankOfIndia (@RBI) April 8, 2022
Monetary Policy Statement, 2022-23 Resolution of the Monetary Policy Committee (MPC) April 6-8, 2022
— ReserveBankOfIndia (@RBI) April 8, 2022
@DasShaktikanta #RBItoday #RBIgovernor #monetaryPolicy https://t.co/hX5Gg0KJpG