అన్వేషించండి

RBI Hikes Repo Rate: రెపో రేటు పెంపుతో PSU బ్యాంకులు భళా - ఆటోమొబైల్స్‌, రియాల్టీ డీలా

వడ్డీ రేట్లలో మార్పులకు నేరుగా సంబంధమున్న ఆర్థిక రంగం, వాహన రంగం, స్థిరాస్తి రంగంలో తీవ్రమైన కదలికలు కనిపించాయి. రేట్ సెన్సిటివ్ షేర్లు మిక్స్‌డ్‌ నోట్‌లో ట్రేడ్‌ అయ్యాయి.

RBI Hikes Repo Rate: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India - RBI) రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు (bps) లేదా 0.35 శాతం పెంచి, మొత్తం రేటును 6.25 శాతానికి చేర్చడంతో, స్టాక్‌ మార్కెట్‌లో షేర్ల ధరల్లో ఊగిసలాట కనిపించింది. వడ్డీ రేట్లలో మార్పులకు నేరుగా సంబంధమున్న ఆర్థిక రంగం, వాహన రంగం, స్థిరాస్తి రంగంలో తీవ్రమైన కదలికలు కనిపించాయి. రేట్ సెన్సిటివ్ షేర్లు మిక్స్‌డ్‌ నోట్‌లో ట్రేడ్‌ అయ్యాయి.

FY23 ‍‌(2022 -23 ఆర్థిక సంవత్సరం) కోసం, భారత దేశ DGP (Gross Domestic Production) వృద్ధి రేటు అంచనాను అంతకు ముందు ఉన్న 7 శాతం నుంచి 6.8 శాతానికి ఇప్పుడు రిజర్వ్‌ బ్యాంక్‌ తగ్గించింది. పాలసీ రేటు మాత్రం 2018 ఆగస్టు నాటి అత్యధిక స్థాయికి తీసుకెళ్లింది. 

ఈ నేపథ్యంలో... నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ PSU బ్యాంక్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ సూచీలు పెరిగాయి. నిఫ్టీ ఆటో, నిఫ్టీ రియాల్టీ సూచీలు క్షీణించాయి. వీటితో పోలిస్తే, మధ్యాహ్నం 2.25 గంటల సమయానికి నిఫ్టీ 50 ఇండెక్స్‌ కూడా 0.30% లేదా 55 పాయింట్ల నష్టంతో 18,587 వద్ద కదులుతోంది.

PSU బ్యాంకులు భళా
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో (NSE), PSU బ్యాంక్‌ స్పేస్ నుంచి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 3 శాతం నుంచి 8 శాతం మధ్య పెరిగాయి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, ఆర్‌ఈసీ ఫైనాన్షియల్స్ 1 శాతం నుండి 3 శాతం వరకు హయ్యర్‌ నోట్‌లో ట్రేడ్ అయ్యాయి.

ఆటోమొబైల్స్‌, రియాల్టీ డీలా
అయితే... ఆటోమొబైల్స్ సెక్టార్‌ నుంచి టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, మహీంద్రా & మహీంద్రా పడిపోయాయి. రియాల్టీ సెక్టార్‌ నుంచి మాక్రోటెక్ డెవలపర్స్‌, ఒబెరాయ్ రియాల్టీ, బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్, DFL కూడా NSEలో తగ్గాయి.

మోర్గాన్ స్టాన్లీ (Morgan Stanley) కూడా పబ్లిక్ సెక్టార్ లేదా ప్రభుత్వ యాజమాన్యంలోని (SoE) బ్యాంకుల మీద ఫుల్‌ బుల్లిష్‌గా ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (YTD) ఈ PSU బ్యాంక్‌ ఇండెక్స్‌ 60 శాతం ర్యాలీ చేసింది. ఈ ర్యాలీని మరింత దూరం కొనసాగించడానికి PSU బ్యాంకుల్లో సత్తా మిగిలే ఉందని ఈ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌ అభిప్రాయ పడింది. SoE లేదా PSU బ్యాంకులు ఇప్పటి వరకు బాగా పనిచేశాయని, అధిక మార్జిన్లు, కొనసాగుతున్న రుణ వృద్ధి, మరికొన్ని సంవత్సరాల్లో ఆపరేటింగ్ లీవరేజ్‌ను మెరుగుపరచడం ద్వారా నిరంతరం బలమైన పనితీరును అవి అందించగలవని తన రిపోర్ట్‌లో పేర్కొంది. PSU బ్యాంకుల ప్రైస్‌ టార్గెట్లను US ఆధారిత బ్రోకరేజ్ పెంచింది. 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
IPL 2025 Opening Ceremony: నేడు ఐపీఎల్ 2025 ప్రారంభం, లైవ్  మ్యాచ్‌లు ఎక్కడ చూడాలో తెలుసా..
నేడు ఐపీఎల్ 2025 ప్రారంభం, లైవ్ మ్యాచ్‌లు ఎక్కడ చూడాలో తెలుసా..
Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Hyderabad Rains Update : హైదరాబాద్‌లో కుమ్మేసిన వాన- మరో రెండు రోజులు ఇదే వెదర్ 
హైదరాబాద్‌లో కుమ్మేసిన వాన- మరో రెండు రోజులు ఇదే వెదర్ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP DesamChahal Dhanashree Verma Divorce | చాహల్ ధనశ్రీకి విడాకులు మంజూరు చేసిన కోర్ట్ | ABP DesamVidya Veerappan Political Career | రాజకీయాల్లో వీరప్పన్ కూతురు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
IPL 2025 Opening Ceremony: నేడు ఐపీఎల్ 2025 ప్రారంభం, లైవ్  మ్యాచ్‌లు ఎక్కడ చూడాలో తెలుసా..
నేడు ఐపీఎల్ 2025 ప్రారంభం, లైవ్ మ్యాచ్‌లు ఎక్కడ చూడాలో తెలుసా..
Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Hyderabad Rains Update : హైదరాబాద్‌లో కుమ్మేసిన వాన- మరో రెండు రోజులు ఇదే వెదర్ 
హైదరాబాద్‌లో కుమ్మేసిన వాన- మరో రెండు రోజులు ఇదే వెదర్ 
YS Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
Hyderabad Crime News: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం, మాయమాటలతో రప్పించి ఓయో రూములో ఇద్దరు బాలికలపై అత్యాచారం
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం, మాయమాటలతో రప్పించి ఓయో రూములో ఇద్దరు బాలికలపై అత్యాచారం
Telangana: సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
APPSC: 'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు వెల్లడి- ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు వెల్లడి- ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Embed widget