(Source: ECI/ABP News/ABP Majha)
Radiant Cash Management IPO: బిడ్ వేసే ముందు మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన 10 విషయాలు
IPO ప్రైస్ బ్యాండ్‌ను ఈ కంపెనీ ఖరారు చేసింది. ఒక్కో ఈక్విటీ షేరును రూ. 94- 99 శ్రేణిలో విక్రయిస్తుంది.
Radiant Cash Management IPO: ఇంటిగ్రేటెడ్ క్యాష్ లాజిస్టిక్స్ ప్లేయర్ అయిన 'రేడియంట్ క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్' ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO) శుక్రవారం నుంచి ప్రారంభం అవుతుంది. ఈ IPOలో పెట్టుబడి పెట్టే ముందు/ బిడ్ వేసే ముందు మీరు కచ్చితంగా తెలుసుకోవలసిన 10 విషయాలు ఇవి:
1. సబ్‌స్క్రిప్షన్ కోసం ఈ IPO శుక్రవారం (డిసెంబర్ 23, 2022) రోజున ఓపెన్ అవుతుంది, మంగళవారం (డిసెంబర్ 27, 2022) రోజున ముగుస్తుంది.
2. IPO ప్రైస్ బ్యాండ్‌ను ఈ కంపెనీ ఖరారు చేసింది. ఒక్కో ఈక్విటీ షేరును రూ. 94- 99 శ్రేణిలో విక్రయిస్తుంది.
3. ఒక్కో లాట్‌కు 150 షేర్లను కంపెనీ కేటాయించింది. పెట్టుబడిదారులు 150 ఈక్విటీ షేర్ల కోసం బిడ్ వేయాలి. ఇంకా కావాలంటే మరో 150, ఆ తర్వాత మరో 150 ఇలా.. 150 గుణిజాల్లో మాత్రమే బిడ్స్ వేయాలి.
4. ఒక్కో ఈక్విటీ షేరు ముఖ విలువ రూ. 1. ఈ పబ్లిక్ ఇష్యూలో... రూ. 60 కోట్ల వరకు ఫ్రెష్ ఇష్యూ & ప్రస్తుత వాటాదారుల ద్వారా 3,31,25,000 ఈక్విటీ షేర్ల వరకు ఆఫర్ ఫర్ సేల్ (OFS) ఉంటుంది.
5. రేడియంట్ ఫ్లోర్ ఫ్రైస్ రూ.1 ముఖ విలువ గల ఈక్విటీ షేర్ కంటే 94 రెట్లు ఎక్కువ. క్యాప్ ప్రైస్ కూడా రూ.1 ముఖ విలువ కంటే 99 రెట్లు ఎక్కువ.
6. IIFL సెక్యూరిటీస్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్, యెస్ సెక్యూరిటీస్ ఈ IPOకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.
7. రేడియంట్ క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ భారత దేశంలో నగదు నిర్వహణ సేవల పరిశ్రమలో ఒక భాగం. రిటైల్ క్యాష్ మేనేజ్‌మెంట్ (RCM) విభాగంలో ప్రముఖంగా పని చేస్తోంది. నెట్‌వర్క్ పరంగా RCM విభాగంలో అతి పెద్ద సంస్థల్లో ఇది ఒకటి.
8. భారత దేశంలోని 13,044 పిన్ కోడ్‌లలో రేడియంట్ సేవలు అందిస్తోంది. లక్షద్వీప్ మినహా దేశంలోని అన్ని జిల్లాలను కవర్ చేస్తోంది. జూలై 31, 2022 నాటికి 5,388కు పైగా ప్రాంతాల్లో దాదాపు 55,513 టచ్ పాయింట్ సేవలు అందిస్తోంది.
9. దీనికి ఉన్న ప్రముఖ క్లయింట్లలో కొన్ని అతి పెద్ద విదేశీ, ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. సేవల తుది వినియోగదారుల్లో కొన్ని అతి పెద్ద ఈ-కామర్స్ కంపెనీలు, రిటైల్ చైన్‌లు, NBFCలు, బీమా సంస్థలు, ఈ-కామర్స్ లాజిస్టిక్స్ ప్లేయర్లు, రైల్వేలు, రిటైల్ పెట్రోలియం డిస్ట్రిబ్యూషన్ ఔట్‌లెట్లు ఉన్నాయి.
10. 2021 ఆర్థిక సంవత్సరంలో, నగదు నిర్వహణ సేవల విభాగంలో ఉన్న వ్యవస్థీకృత ఆటగాళ్లలో ఇది రెండో అత్యధిక EBITDA మార్జిన్, ROCE, ROEలను కలిగి ఉంది. అంటే, సంస్థ ఆర్థిక పరిస్థితి ధృడంగా ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.