అన్వేషించండి

Q3 Results: Q3 నంబర్లతో మార్కెట్‌ను ఆదుకున్న బ్యాంకులు, ఇవి లేకపోతే అంతా అస్సామే

ఇప్పటి వరకు Q3 సంఖ్యలను ప్రకటించిన 240 కంపెనీల ఫలితాలను ఈ పోలిక కోసం పరిగణనలోకి తీసుకున్నారు.

Q3 Results: 2022 డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాల సీజన్‌లో కొనసాగుతోంది. విడివిడిగా చూస్తే.. బ్యాంక్‌ల పనితీరు చాలా ఐటీ సెక్టార్‌ కూడా పర్లేదు. కన్జ్యూమర్‌ కన్‌జంప్షన్‌ కంపెనీల ఫలితాలు యావరేజ్‌గా ఉన్నాయి. అయితే, వీటన్నింటినీ కలిపి చూస్తే పరిస్థితి నిరాశాజనకంగా కనిపిస్తోంది. 

2022 సెప్టెంబర్‌ త్రైమాసికంతో ప్రస్తుత ఫలితాలను పోలిస్తే నిర్వహణ మార్జిన్‌లో స్థిరత్వం కనిపిస్తోంది. ఆదాయం, లాభాలు మాత్రం అంతకుముందు ఏడాది (2021) డిసెంబర్‌ త్రైమాసికం కంటే తగ్గాయి. ఇప్పటి వరకు Q3 సంఖ్యలను ప్రకటించిన 240 కంపెనీల ఫలితాలను ఈ పోలిక కోసం పరిగణనలోకి తీసుకున్నారు. గణాకాంల ప్రకారం... ఈ 240 కంపెనీల సగటు ఆదాయం కేవలం 18% పెరిగింది, ఇది ఏడు త్రైమాసికాల కనిష్ట స్థాయి. తీసుకున్న రుణాల మీద పెరిగిన వడ్డీ వ్యయాలు, తరుగుదల ఖర్చుల కారణంగా సగటు నికర లాభం నామమాత్రంగా 0.8% పెరిగింది. గత తొమ్మిది త్రైమాసికాల్లో ఇదే అత్యంత మందగమన వృద్ధి.

కమోడిటీ ధరలు తగ్గడం వల్ల 2022 డిసెంబర్ త్రైమాసికంలో ఈ కంపెనీల సగటు ఆపరేటింగ్ మార్జిన్ కేవలం 10 బేసిస్ పాయింట్లు (QoQ లేదా సెప్టెంబర్‌ త్రైమాసికంతో పోలిస్తే) పెరిగి 20.7%కి చేరుకుంది. క్రితం సంవత్సరం ఇదే కాలంలోని 24.7%తో పోలిస్తే మాత్రం చాలా బలహీనంగా ఉంది.

బ్యాంకింగ్ & ఫైనాన్స్ కంపెనీలు
అప్పులు ఇచ్చే కంపెనీ మూడో త్రైమాసికాన్ని ‍‌(డిసెంబర్‌ త్రైమాసికం) లీడ్‌ చేస్తాయని, తయారీ కంపెనీలు QoQ నిర్వహణ లాభదాయకతలో మెరుగుదల చూపుతాయని మార్కెట్‌ ఎనలిస్ట్‌లు ముందే అంచనా వేశారు. ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఇప్పుడు ఫలితాలు వస్తున్నాయి.

విచిత్రం ఏంటంటే... బ్యాంకింగ్ & ఫైనాన్స్ కంపెనీలు మంచి లాభాలతో యావరేజ్‌ ప్రాఫిట్‌ మీటర్‌ను పైకి లాగితే... ఆదాయం & మార్కెట్ విలువ ప్రకారం దేశంలో అతి పెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) దానిని కిందకు లాగింది. రిలయన్స్‌ ఆదాయం పెరిగినా, నికర లాభం తగ్గింది.

ఈ 240 కంపెనీల గ్రూప్‌ నుంచి బ్యాంకులు & ఫైనాన్స్ కంపెనీలను మినహాయించి చూస్తే.. మిగిలిన సంస్థల ఉమ్మడి నికర లాభం గత ఏడాది ఇదే కాలం కంటే 7.3% తగ్గింది. ఆదాయం కూడా సంవత్సరానికి 16.3%కి పడిపోయింది.

బ్యాంకింగ్ & ఫైనాన్స్ కంపెనీలు కలిసి... ఈ 240 కంపెనీల గ్రూప్‌ ఉమ్మడి ఆదాయంలో 19.2%, నికర లాభంలో 32% అందించాయి. అంటే, ఈ త్రైమాసికంలోని ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు కేవలం బ్యాంకులు & ఫైనాన్స్ కంపెనీల చలవ వల్లే కాస్త పచ్చగా కనిపిస్తున్నాయి. ఈ రెండు రంగాల వల్లే ఇండెక్స్‌లు కాస్తయినా పెరిగాయి.

మరో విచిత్రమైన విషయం ఏంటంటే.. 240 కంపెనీల గ్రూప్‌ నుంచి ఒక్క RIL మినహాయించి చూస్తే... మిగిలిన 239 కంపెనీల ఉమ్మడి లాభం 5.5% పెరిగింది, ఆదాయ వృద్ధి 18%కి చేరింది. అంతకు ముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో షెల్ ఆయిల్ అసెట్‌ను విక్రయించడం ద్వారా వచ్చిన ₹2,836 కోట్ల కారణంగా, ఆ త్రైమాసికంలో RIL ఏకీకృత నికర లాభం భారీగా పెరిగింది. ఇప్పుడు ఆ డబ్బు లేదు కాబట్టి, డిసెంబర్‌ త్రైమాసికంలో 13.3% తగ్గి ₹17,806 కోట్లకు పడిపోయింది. ఇదే సమయంలో కంపెనీ ఆదాయం 15.3% పెరిగి ₹2.21 లక్షల కోట్లకు చేరుకుంది. 240 కంపెనీల గ్రూప్‌ మొత్తం ఆదాయం, లాభంలో వరుసగా 32.9%, 20.7% వాటా ఈ ఒక్క కంపెనీదే. కాబట్టే, దీనిని పక్కనపెట్టి చూస్తే, గ్రూప్‌ లాభం పెరిగింది.

ఇక... బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆయిల్ & గ్యాస్, ఐటీ రంగాల కంపెనీలు మొత్తం గ్రూప్‌ ఆదాయానికి 76.3%, నికర లాభంలో 86.3% వాటా అందించాయి. తదుపరి వారాల్లో, ఇతర రంగాలకు చెందిన మరిన్ని కంపెనీలు Q3 సంఖ్యలను ప్రకటిస్తాయి. అప్పుడు ట్రెండ్ మీద మరింత స్పష్టత వస్తుంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Contestant Nomination Rules: అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
Weather Latest Update: తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
Pushpa 2: నార్త్ ఇండియాలో 'పుష్ప' రూల్: థియేట్రికల్ రైట్స్‌‌తో కొత్త రికార్డ్స్ - ‘RRR’ను మించిపోయిందిగా!
నార్త్ ఇండియాలో 'పుష్ప' రూల్: థియేట్రికల్ రైట్స్‌‌తో కొత్త రికార్డ్స్ - ‘RRR’ను మించిపోయిందిగా!
Civils Topper: 'గోల్డ్ మన్ శాక్స్'లో కొలువు వదిలి సివిల్స్ వైపు - ఫస్ట్ ర్యాంకర్ శ్రీవాస్తవ ఏం చెప్పారంటే?
'గోల్డ్ మన్ శాక్స్'లో కొలువు వదిలి సివిల్స్ వైపు - ఫస్ట్ ర్యాంకర్ శ్రీవాస్తవ ఏం చెప్పారంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

BJP Madhavi Latha Srirama Navami Sobhayatra: శోభాయాత్రలో పాల్గొని ఎంఐఎంపై మాధవీలత విమర్శలుRaja Singh Srirama Navami Sobhayatra: శోభాయాత్ర సందడి, యువకులను ఉద్దేశిస్తూ రాజాసింగ్ ప్రసంగంJake Fraser McGurk Batting Ganguly Reaction: ఆ ఒక్క సిక్స్ చూసి జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్లిపోయిన గంగూలీRishabh Pant Tristan Stubbs Bowling: స్టంప్ మైక్ దగ్గర నుంచి స్టబ్స్ తో హిందీలో మాట్లాడిన పంత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Contestant Nomination Rules: అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
Weather Latest Update: తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
Pushpa 2: నార్త్ ఇండియాలో 'పుష్ప' రూల్: థియేట్రికల్ రైట్స్‌‌తో కొత్త రికార్డ్స్ - ‘RRR’ను మించిపోయిందిగా!
నార్త్ ఇండియాలో 'పుష్ప' రూల్: థియేట్రికల్ రైట్స్‌‌తో కొత్త రికార్డ్స్ - ‘RRR’ను మించిపోయిందిగా!
Civils Topper: 'గోల్డ్ మన్ శాక్స్'లో కొలువు వదిలి సివిల్స్ వైపు - ఫస్ట్ ర్యాంకర్ శ్రీవాస్తవ ఏం చెప్పారంటే?
'గోల్డ్ మన్ శాక్స్'లో కొలువు వదిలి సివిల్స్ వైపు - ఫస్ట్ ర్యాంకర్ శ్రీవాస్తవ ఏం చెప్పారంటే?
Google Pixel 8a Colour: గూగుల్ పిక్సెల్ 8ఏ కలర్ ఆప్షన్లు లీక్ - ఈసారి నాలుగు కొత్త రంగుల్లో!
గూగుల్ పిక్సెల్ 8ఏ కలర్ ఆప్షన్లు లీక్ - ఈసారి నాలుగు కొత్త రంగుల్లో!
Preethi Pagadala: మా నాన్న ముద్దు సీన్లు వద్దన్నారు, అయినా వాళ్లు వినలేదు: ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రీతి పగడాల
మా నాన్న ముద్దు సీన్లు వద్దన్నారు, అయినా వాళ్లు వినలేదు: ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రీతి పగడాల
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
Silence 2 Movie Review: ‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
Embed widget