By: ABP Desam | Updated at : 07 Dec 2022 12:05 PM (IST)
Edited By: Arunmali
ఈ 3 పీఎస్‌యూ బ్యాంకులతో డబ్బే డబ్బు
PSU Bank Stocks: ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు (YTD) నిఫ్టీ కేవలం ఆరు శాతం లాభపడినప్పటికీ, నిఫ్టీ PSU (Public Sector Undertaking) బ్యాంక్ ఇండెక్స్ మాత్రం ఇదే కాలంలో 60 శాతానికి పైగా పెరిగింది, ఇన్వెస్టర్లకు బ్రహ్మాండమైన లాభాలు పంచింది. గత 6 నెలలుగా ఇవి స్ట్రాంగ్‌గా పెరుగుతున్నాయి. పెట్టుబడిదారుల వాచ్‌లిస్ట్‌లోకి చేరాయి. PSU బ్యాంక్స్ అంటే ప్రభుత్వ యాజమాన్యంలో పని చేసే బ్యాంకులు.
అమెరికాకు చెందిన గ్లోబల్ రీసెర్చ్ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ (Morgan Stanley) లెక్క ప్రకారం... ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ర్యాలీ ఇంకా అయిపోలేదు. మరింత పైకి పరుగు తీయడానికి వాటిలో ఉత్సాహం మిగిలే ఉందని ఈ రీసెర్చ్ హౌస్ చెబుతోంది. మీడియాకు రిలీజ్ నోట్‌లో, మూడు ప్రభుత్వ యాజమాన్య లెండర్ స్టాక్స్‌కు టార్గెట్ ప్రైస్‌లు పెంచింది.
SoE (state owned enterprise) బ్యాంకుల పనితీరు చాలా బాగుందని; హయ్యర్ మార్జిన్లు, నిరంతర రుణ వృద్ధి, మరికొన్ని సంవత్సరాల్లో ఆపరేటింగ్ లీవరేజ్ మెరుగు పరచడం ద్వారా అవి బలమైన పనితీరును కంటిన్యూ చేయగలవని ఆ నోట్‌లో బ్రోకరేజ్ పేర్కొంది. బ్యాంక్‌ల మార్జిన్లు మరింత పెరుగుతాయని, రాబోయే కొన్నేళ్లలో రుణాల వృద్ధి నిలకడగా ఉంటుందని, క్రెడిట్ ఖర్చులు తగ్గుతాయని ఆశిస్తోంది.
ధర లక్ష్యాలు 50 శాతం వరకు పెంపు
ప్రభుత్వ రంగ బ్యాంకులు - బ్యాంక్ ఆఫ్ బరోడా (NS: BOB), బ్యాంక్ ఆఫ్ ఇండియా (NS: BOI) మీద "ఓవర్ వెయిట్" రేటింగ్‌ను ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ మేజర్ మోర్గాన్ స్టాన్సీ కొనసాగించింది. వీటితో పాటు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (NS: PNBK) మీద "ఈక్వల్ వెయిట్" రేటింగ్‌తో ఉంది.
మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయం ప్రకారం... ప్రస్తుతం కొనసాగుతున్న రికవరీ సైకిల్ PSU బ్యాంకులకు ప్రయోజనం చేకూరుస్తోందని; బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్స్ ఉత్తమ 'రిస్క్ టు రివార్డ్' రేషియోతో ఉన్నాయని వెల్లడించింది. YTD ప్రాతిపదికన... ఈ PSU స్టాక్స్ వాటి సైక్లికల్ & డిఫెన్సివ్ కౌంటర్‌పార్ట్స్‌ను ఓవర్‌టేక్ చేశాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడా టార్గెట్ ధరను ఒక్కో షేరుకు రూ. 195 నుంచి రూ. 220 కి మోర్గాన్ స్టాన్లీ పెంచింది. ప్రస్తుత ధరతో పోలిస్తే ఈ షేరు మరో 27 శాతం పెరుగుతుందని ఈ టార్గెట్ ప్రైస్ అర్ధం. బ్యాంక్ ఆఫ్ ఇండియా టార్గెట్ ధరను రూ. 95 నుంచి రూ. 125 కి పెరిగింది. ఇది మరో 39.2 శాతం ర్యాలీని సూచిస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ టార్గెట్ ప్రైస్‌ను రూ. 40 నుంచి రూ. 60 కి ఈ గ్లోబల్ బ్రోకరేజ్ పెంచింది. ఇది 50 శాతం వృద్ధికి సూచన.
కెనరా బ్యాంక్‌కు "అండర్ వెయిట్" కాల్
దేశంలో స్టార్ PSU బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (NS: SBI) స్టాక్ మీద "ఓవర్ వెయిట్" రేటింగ్‌ను మోర్గాన్ స్టాన్లీ నిలుపుకుంది. ఈ బ్యాంక్ స్టాక్‌కు ఇచ్చిన ప్రైస్ టార్గెట్ ఒక్కో షేరుకు రూ. 715. అయితే కెనరా బ్యాంక్ (NS: CNBK) మీద ఈ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌కు సదభిప్రాయం లేదు. ఈ స్క్రిప్‌కు "అండర్ వెయిట్" కాల్ ఇచ్చింది. దాని టార్గెట్ ధరను ఒక్కో షేరుకు రూ. 280 నుంచి రూ. 345 కి పెంచింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Gold-Silver Prices Today 30 November 2023: కొద్దిగా మెత్తబడ్డ పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Gautam Adani: అదానీ రిటర్న్స్ - టాప్-20 బిలియనీర్స్ లిస్ట్‌లోకి రీఎంట్రీ, ఒక్కరోజులో రూ.లక్ష కోట్ల ర్యాలీ
Bank Holidays: డిసెంబర్‌లో బ్యాంక్‌లకు 18 రోజులు సెలవులు, 6 రోజులు సమ్మె - ఇక మీ బ్యాంక్ పని అయినట్టే!
Deadlines in December: డెడ్‌లైన్స్ ఇన్ డిసెంబర్, వీటిని సకాలంలో పూర్తి చేయకపోతే మీకే నష్టం!
Downgraded Stocks: రిలయన్స్, ఎస్‌బీఐ కార్డ్ సహా 7 పాపులర్ స్టాక్స్ - ఇవి మీ దగ్గర ఉంటే జాగ్రత్త!
TS Election Voting: ఉదయమే ఓటు వేసిన చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్ - క్యూ లైనులో స్టార్స్, మరి మీరు?
Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్ డ్యాం వద్ద హైటెన్షన్, 500 మంది ఏపీ పోలీసుల మోహరింపు, సగం ప్రాజెక్టు స్వాధీనానికి యత్నం
Telangana Election Polling Updates: తెలంగాణలో ఓట్ల జాతర- 7 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద బార్లు
Telangana Assembly Election 2023: వెల్లివిరిసిన ఓటుస్వామ్యం- ఒటెత్తిన ప్రజానీకం
/body>