By: ABP Desam | Updated at : 09 Mar 2022 11:53 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ఎక్కువ వడ్డీ అందిస్తున్న పోస్టాఫీసు స్కీములివే - డబ్బు దాచుకోండి!
Post Office Schemes: సంపాదించుకున్న మొత్తంలో కొంత దాచుకోవాలనే ఎవరైనా అనుకుంటారు! ఆ సొమ్ముకు తగిన రాబడి రావాలని కోరుకుంటారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు (Fixed Deposits), రికరింగ్ డిపాజిట్లు చేస్తుంటారు. కేంద్ర ప్రభుత్వ దన్నుతో పోస్టాఫీసులు (Post Office) కొన్ని అద్భుతమైన పథకాలు కొనసాగుతున్నాయి. బ్యాంకులను మంచి వడ్డీని అందిస్తున్నాయి. ఎలాంటి రిస్కూ ఉండదు. పైగా పన్ను మినహాయింపులు లభిస్తున్నాయి. వివిధ పథకాలపై పోస్టాఫీసు 5.5 నుంచి 7.6 శాతం వరకు వడ్డీరేటు అందిస్తున్నాయి.
Sukanya Samriddhi Yojana (SSY) - సుకన్యా సమృద్ధి యోజన
మీకు ఆడిపిల్లలు ఉంటే డబ్బులు దాచుకొనేందుకు సుకన్యా సమృద్ధి యోజన మంచి పథకం. బాలికలకు చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. పదేళ్లలోపు వయసున్న పిల్లల పేరుతో ఈ ఖాతాలు తెరవొచ్చు. మిగతా స్కీములతో పోలిస్తే అత్యధికంగా ఎస్‌ఎస్‌వైలో 7.6 శాతం వడ్డీని ఆర్జించొచ్చు. కేవలం రూ.250 నుంచి ఏటా రూ.1.5 లక్షల వరకు ఇందులో డిపాజిట్ చేయొచ్చు. పైగా ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సి (Section 80C) కింద పన్ను మినహాయింపులు పొందొచ్చు.
Senior Citizen Savings Scheme (SCSS) - సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కింద ఖాతాదారులు వార్షిక ప్రాతిపదికన 7.4 శాతం వరకు వడ్డీ పొందొచ్చు. ఈ ఖాతాలు తెరవాలంటే డిపాజిట్ దారు వయసుల 60 ఏళ్ల కన్నా ఎక్కువగా ఉండాలి. ఇందులో రూ.1000 చొప్పున దాచుకోవచ్చు. గరిష్ఠంగా రూ.15 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.
Public Provident Fund (PPF) - పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్
ఈ మధ్య చాలామంది వినియోగించుకుంటున్న స్కీమ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. రిటైర్మెంట్ తర్వాత ఒక భారీ నిధిని సమకూర్చుకొనేందుకు పీపీఎఫ్ ఖాతాలు తెరుస్తారు. ఒక ఆర్థిక ఏడాదిలో కనీసం రూ.500 దాచుకోవచ్చు. గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. పీపీఎఫ్ మెచ్యూరిటీ 15 ఏళ్లు. ఖాతా తెరిచిన సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకోరు. ఈ ఖాతాలపైనా పన్ను మినహాయింపు లభిస్తోంది.
आप पोस्ट इंफो ऐप के माध्यम से नंबर दर्ज करके और ट्रैक बटन को स्पर्श करके अपने आर्टिकल्स की जानकारी प्राप्त कर सकते हैं। ऐप डाउनलोड करने के लिए यहां क्लिक करें: https://t.co/diZxhipIuw#DigitalDostIndiaPost pic.twitter.com/kphUz6Totc
— India Post (@IndiaPostOffice) March 7, 2022
Latest Gold-Silver Prices Today 28 November 2023: పట్టుకోలేనంత ఎత్తులో పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Gold-Silver Prices Today 28 November 2023: ఆరు నెలల గరిష్టంలో గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Investment tips: పర్సనల్ లోన్ తీసుకుని ఈ పనులు ఎప్పుడూ చేయొద్దు, లాభం కంటే నష్టమే ఎక్కువ!
Latest Gold-Silver Prices Today 27 November 2023: బంగారం కొనేవాళ్లకు డాలర్ దెబ్బ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Gold-Silver Prices Today 27 November 2023: పసిడి రేటు పరుగులు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Andhra News : అనంతపురంలో బీజేపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ! టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై వివాదం
KCR Election Campaign: హైదరాబాద్ మినహా 97 నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచారం- నేడు గజ్వేల్‌లో ఫైనల్ మీటింగ్
Kriti Sanon : బన్నీతో కలిసి పనిచేసే క్షణాల కోసం ఎదురుచూస్తున్నా: కృతిసనన్
Kangana Ranaut: మాజీ ప్రధాని ఇందిరా గాంధీని కలిసిన కంగనా, అదెలా సాధ్యమని షాక్ అవుతున్నారా?
/body>