By: ABP Desam | Updated at : 03 Mar 2023 03:51 PM (IST)
Edited By: Arunmali
పాన్-ఆధార్ లింక్ చేయాల్సిన అవసరం లేదు
PAN- Aadhaar Linking Process: భారతదేశ పౌరులు తమ పాన్ - ఆధార్ నంబర్ అనుసంధానించడానికి 2023 మార్చి 31వ తేదీని గడువుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు తమ ఆధార్ నంబర్‌తో పాన్ కార్డ్‌ని లింక్ చేయని వ్యక్తులు ఈ చివరి తేదీ లోగా రెండింటి అనుసంధానాన్ని పూర్తి చేయాలి. లేకపోతే, పాన్ కార్డ్ నిరుపయోగంగా మారే అవకాశం ఉంది. పాన్ కార్డ్ ద్వారా జరగాల్సిన పనులు ఏవీ జరగవు, ఆగిపోతాయి. అలాంటి వ్యక్తుల వద్ద పాన్ కార్డ్ ఉన్నా, దానిని ఉపయోగించలేరు.
పాన్ కార్డును ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఇదే సమయంలో.. ఆదాయపు పన్ను చట్టం - 1961 ప్రకారం మినహాయింపు పొందిన కేటగిరీలోకి రాని పాన్ కార్డ్ హోల్డర్లందరూ తమ పాన్‌ను ఆధార్ నంబర్‌తో 31.03.2023 లోపు లింక్ చేయడం తప్పనిసరి అని ఆదాయపు పన్ను విభాగం (Income Tax Department) కూడా పన్ను చెల్లింపుదార్లకు తెలియజేసింది. ఆదాయపు పన్ను చట్టం - 1961 ప్రకారం మినహాయింపు పొందిన కేటగిరీలోకి వచ్చే పాన్ కార్డ్ హోల్డర్లు తమ పాన్ కార్డ్‌ను ఆధార్ నంబర్‌తో లింక్ చేయాల్సిన అవసరం లేదు, ఆ వర్గాలకు మినహాయింపు ఇచ్చారు. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయాల్సిన అవసరం లేని వ్యక్తులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
వీరికి పాన్-ఆధార్ లింక్ తప్పనిసరి కాదు
2017 మే నెలలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, పాన్ - ఆధార్ లింక్ చేయాల్సిన అవసరం నుంచి కొన్ని వర్గాలకు మినహాయింపు ఇచ్చారు. ఈ వర్గాలలోకి వచ్చే పౌరులు ఎవరంటే..
అసోం, మేఘాలయ, జమ్ము & కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు
ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం నాన్ రెసిడెంట్
గత సంవత్సరం నాటికి 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులు
భారతదేశ పౌరులు కాని వ్యక్తులు
పాన్ - ఆధార్‌ను ఎలా లింక్ చేయాలి?
మీరు ఇప్పటి వరకు మీ పాన్ ఆధార్ నంబర్‌తో లింక్ చేయనట్లయితే, ఇప్పటికైనా లింక్ చేయండి. దీనివల్ల కొన్ని ఇబ్బందులు మీకు తప్పుతాయి. పాన్ - ఆధార్ నంబర్ లింక్ చేయడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆ స్టెప్స్‌ను అనుసరించడం ద్వారా ఈ ప్రక్రియను మీరు సులభంగా పూర్తి చేయవచ్చు.
ఆన్‌లైన్ ప్రక్రియలో.. ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్ incometaxindiaefiling.gov.in ని సందర్శించండి. ఈ వెబ్‌సైట్ హోమ్ పేజీలోనే పాన్-ఆధార్ లింక్ కోసం ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని ద్వారా మీ పాన్‌ను ఆధార్ నంబర్‌తో లింక్ చేయవచ్చు.
SMS ద్వారా కూడా మీరు మీ పాన్ - ఆధార్ నంబర్‌ను అనుసంధానించవచ్చు. ఇందు కోసం.. మీ మొబైల్ నంబర్ నుంచి UIDPAN < SPACE > < 12 ఆధార్ నంబర్ > < SPACE > < 10 డిజిట్స్ PAN> ఫార్మాట్‌లో 567678 కు లేదా 56161 కు SMS పంపాలి.
ఆఫ్‌లైన్ ప్రక్రియలోనూ మీరు ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. మీ పాన్‌ను ఆధార్ నంబర్‌తో లింక్ చేయడానికి మీరు మీ సమీపంలోని పాన్ సేవ కేంద్రాన్ని లేదా ఆధార్ సేవ కేంద్రాన్ని సందర్శించవచ్చు. అక్కడి వాళ్లు మీ రెండు కార్డ్ నంబర్లను అనుసంధానిస్తారు.
PF Salary Limit: పీఎఫ్ జీతాల పరిమితి 25-30 వేలకు పెంచే యోచనలో ప్రభుత్వం! దీని వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం?
World Cheapest Silver Price: ప్రపంచంలో అత్యంత చౌకగా వెండి లభించే దేశం ఏదీ? భారత్ కంటే 40 వేల రూపాయల వరకు తక్కువ!
Gold and Silver Prices: నేటి బంగారం ధర: బంగారం, వెండి ధరలు తగ్గాయి, జనవరి 8న బంగారం ఎంత చౌకగా వచ్చిందో తెలుసుకోండి
YouTube Earnings : యూట్యూబ్‌లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Donald Trump Tariffs: ఇరాన్ తో వ్యాపారం చేస్తే అమెరికా 25 శాతం టారిఫ్.. ఈ దేశాలపై నేరుగా ప్రభావం
YS Jagan: బెంగళూరులోనే ఎక్కువ కాలం జగన్ - కుట్రల కోసమేనని టీడీపీ ఆరోపణలు - ఏపీలో ఎందుకు ఉండలేరు?
Bangladesh Crime News: బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య, తీవ్ర గాయాలతో మృతదేహం లభ్యం
Bhartha Mahasayulaku Wignyapthi OTT : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' వచ్చేది ఆ ఓటీటీలోకే - ఈ టీవీ ఛానల్‌లో రవితేజ మూవీ చూసెయ్యండి