search
×

LIC Policy: మార్చి 31లోపు మీ LIC పాలసీని PANతో లింక్ చేయాలి, లేదంటే ఇబ్బంది తప్పదు!

2023 మార్చి 31వ తేదీ లోగా మీ ఎల్‌ఐసీ పాలసీని పాన్‌తో జోడించడం తప్పనిసరి అని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది.

FOLLOW US: 
Share:

LIC Policy PAN Linkage: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ‍‌(LIC) నుంచి మీరు గతంలో ఒక పాలసీ తీసుకున్నట్లయితే, మీ కోసం LIC ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వినియోగదార్లు తమ LIC పాలసీతో పాన్‌ కార్డ్‌ని (PAN Card) లింక్ చేయాలి. లేకపోతే, ఆ LIC పాలసీకి సంబంధించి కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని సమాచారం.

2023 మార్చి 31వ తేదీ లోగా మీ ఎల్‌ఐసీ పాలసీని పాన్‌తో జోడించడం తప్పనిసరి అని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. మీరు ఇప్పటి వరకు మీ LIC పాలసీని పాన్‌తో లింక్ చేయకపోతే, ఆ పనిని ఎలా పూర్తి చేయవచ్చో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ మీ పాలసీని పాన్‌తో అనుసంధానిస్తే, ఆన్‌లైన్‌ ద్వారా దాని స్థితిని (Status) కూడా తెలుసుకోవచ్చు. పాలసీని లింక్‌ చేయడానికి లేదా స్థితిని తెలుసుకోవడానికి ఎల్‌ఐసీ కస్టమర్లు కొన్ని దశలను అనుసరించాలి. 

LIC పాలసీ లింక్‌ స్టేటస్‌ను ముందుగా తెలుసుకోండి

వినియోగదార్లు, LIC ఇండియా వెబ్‌సైట్‌ను సందర్శించాలి, లేదా https://linkpan.licindia.in/UIDSeedingWebApp/getPolicyPANStatus లింక్‌ ద్వారా నేరుగా ఆ వెబ్‌ పేజీలోకి వెళ్లవచ్చు. 

ముందుగా, https://linkpan.licindia.in/UIDSeedingWebApp/getPolicyPANStatus లింక్‌ను కాపీ చేసి, గూగుల్‌ అడ్రస్‌ బార్‌లో లేదా సెర్చ్‌ బార్‌లో పేస్ట్‌ చేయండి. లేదా, ఈ లింక్‌ను యథాతథంగా గూగుల్‌ అడ్రస్‌ బార్‌ లేదా సెర్చ్‌ బార్‌లో టైప్ చేయండి.
ఇప్పుడు, సంబంధిత గడిలో మీ పాలసీ నంబర్‌ను నమోదు చేయండి.
ఆ తర్వాత మీ పుట్టిన తేదీ సమాచారాన్ని పూరించండి.          
ఇప్పుడు పాన్ కార్డ్ వివరాలను నమోదు చేయండి. ఆపై క్యాప్చా (Captcha) నింపండి
ఇప్పుడు, మీరు నింపిన వివరాలన్నీ మరోసారి సరి చూసుకుని సబ్మిట్‌ (Submit) బటన్‌ మీద ప్రెస్‌ చేయండి.
ఇప్పుడు PAN లింక్ సమాచారం మీకు కనిపిస్తుంది.

పాన్ కార్డ్ లింక్ కాకపోతే ఏం చేయాలి?                

మీ పాన్ కార్డ్ ఎల్‌ఐసీ పాలసీకి లింక్ కాకపోతే, https://licindia.in/Home/Online-PAN-Registration లింక్‌లోకి వెళ్లిండి. 
ఇక్కడ కనిపించే ప్రొసీడ్‌ బటన్‌ నొక్కండి
ఇప్పుడు మరొక పేజీ ఓపెన్‌ అవుతుంది. ఇందులో మీ పుట్టిన తేదీని నింపండి.
ఆ తర్వాత జెండర్‌ (ఆడ లేదా మగ) మీద క్లిక్‌ చేయండి.            
ఇప్పుడు మీ పాన్‌ నంబర్‌ నింపండి.                      
ఆ తర్వాత గడిలో, పాన్‌ మీద ఉన్న రీతిలోనే మీ పేరును పూరించండి               
ఆ తర్వాత మొబైల్ నంబర్, పాలసీ నంబర్, క్యాప్చా కోడ్‌ నమోదు చేయండి.
ఇప్పుడు, 'GET OTP' బటన్‌ మీద క్లిక్ చేయండి. మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని సంబంధిత గడిలో నమోదు చేయండి.
OTPని నమోదు చేసిన తర్వాత సబ్మిట్‌ బటన్‌ మీద ప్రెస్‌ చేయండి.
ఇప్పుడు మీ LIC పాలసీ పాన్ కార్డ్‌కి లింక్ అవుతుంది.

Published at : 15 Feb 2023 03:32 PM (IST) Tags: Pan Card lic policy LIC LIC Policy PAN Link

సంబంధిత కథనాలు

WhatsApp Banking: IPPB సేవల్లో మరింత సౌలభ్యం, ఇకపై వాట్సాప్‌ ద్వారా బ్యాంకింగ్‌

WhatsApp Banking: IPPB సేవల్లో మరింత సౌలభ్యం, ఇకపై వాట్సాప్‌ ద్వారా బ్యాంకింగ్‌

PPF: పీపీఎఫ్‌ వడ్డీ పెరగలేదు, అయినా ఇతర పథకాల కంటే ఎక్కువ ఎలా సంపాదించవచ్చు?

PPF: పీపీఎఫ్‌ వడ్డీ పెరగలేదు, అయినా ఇతర పథకాల కంటే ఎక్కువ ఎలా సంపాదించవచ్చు?

SCSS: సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో వడ్డీ, పెట్టుబడి పరిమితి రెండూ పెరిగాయి

SCSS: సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో వడ్డీ, పెట్టుబడి పరిమితి రెండూ పెరిగాయి

MSSC Scheme: ప్రారంభమైన ఉమెన్‌ స్పెషల్ స్కీమ్‌, పెట్టుబడికి ముందు ఈ విషయాలు తెలుసుకోండి

MSSC Scheme: ప్రారంభమైన ఉమెన్‌ స్పెషల్ స్కీమ్‌, పెట్టుబడికి ముందు ఈ విషయాలు తెలుసుకోండి

Small Savings Schemes: పొదుపు ప‌థ‌కాల‌పై వ‌డ్డీ రేట్లు పెంచిన కేంద్ర ప్ర‌భుత్వం- నేటి నుంచే అమ‌ల్లోకి

Small Savings Schemes: పొదుపు ప‌థ‌కాల‌పై వ‌డ్డీ రేట్లు పెంచిన కేంద్ర ప్ర‌భుత్వం-  నేటి నుంచే అమ‌ల్లోకి

టాప్ స్టోరీస్

BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్

BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్

Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ లాజిక్ వేరే...

Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ లాజిక్ వేరే...

NTR30 Shoot Begins : అదిగో భయం - కొరటాల సెట్స్‌కు ఎన్టీఆర్ వచ్చేశాడు

NTR30 Shoot Begins : అదిగో భయం - కొరటాల సెట్స్‌కు ఎన్టీఆర్ వచ్చేశాడు

AP News : ప్రొబేషన్ కోసం పడిగాపులు - ఏపీలో 17వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్ని కష్టాలో ...

AP News  :  ప్రొబేషన్ కోసం పడిగాపులు - ఏపీలో 17వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్ని కష్టాలో ...