By: ABP Desam | Updated at : 23 Feb 2023 02:58 PM (IST)
Edited By: Arunmali
ప్లాన్ ఒకటి - ప్రయోజనాలు మూడు
LIC Bima Ratna Plan: దేశంలో అతి పెద్ద బీమా పాలసీ కంపెనీ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Life Insurance Corporation), దేశంలోని ప్రతి జనాభా విభాగానికి అనుకూలంగా వివిధ రకాల పథకాలను (LIC Policy) తీసుకు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు, LIC బీమా రత్న పాలసీ (LIC Bima Ratna Plan) గురించి చెప్పబోతున్నాం. మీరు ఈ ప్లాన్‌లో 2 రెట్లు రాబడిని కూడా పొందవచ్చు. దీంతో పాటు, ఈ పాలసీలో మొత్తం 3 ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఈ ప్లాన్ మీకు ఉపయోగపడుతుందని అవుతుందనిపిస్తే, ఇందులో మీరు పెట్టుబడి పెట్టవచ్చు.
LIC బీమా రత్న ప్లాన్ ప్రయోజనాలు
LIC ధన్ రత్న ప్లాన్‌లో (LIC Bima Ratna Plan) పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు మీ డిపాజిట్ మొత్తం కంటే కొన్ని రెట్ల ఎక్కువ డబ్బును తిరిగి పొందవచ్చు. ఇది మాత్రమే కాదు, ఈ పథకంతో అనుసంధానించిన - మనీ బ్యాక్, గ్యారెంటీడ్ బోనస్, డెత్ బెనిఫిట్ - 3 ప్రయోజనాలను మీరు పొందుతారు.
LIC బీమా రత్న ప్లాన్ వివరాలు
రక్షణ & పొదుపును మిళితం చేసే నాన్-లింక్డ్, నాన్-పార్టిసిటింగ్, వ్యక్తిగత పొదుపునకు సంబంధించిన జీవిత బీమా ప్లాన్ ఈ LIC బీమా రత్న పాలసీ. ఈ పాలసీని 2022 మే 27న ప్రారంభించారు. LIC బీమా రత్న ప్లాన్‌లో, మీరు పాలసీ వ్యవధి ప్రకారం ప్రయోజనాలు పొందుతారు. ఈ పాలసీ కాల పరిమితి 15 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ 15 ఏళ్ల పాలసీ సమయంలో.. 13వ సంవత్సరం, 14వ సంవత్సరంలో 25% మొత్తం మీకు తిరిగి వస్తుంది. అదే విధంగా, 20 సంవత్సరాల పాలసీ సమయంలో.. 18వ సంవత్సరం, 19వ సంవత్సరంలో 25% మొత్తం చేతికి వస్తుంది. అదే విధంగా 25 సంవత్సరాల పాలసీలో... ఈ పని 23వ సంవత్సరం, 24వ సంవత్సరంలో జరుగుతుంది.
ఈ పాలసీలో, మొదటి 5 సంవత్సరాల్లో ప్రతి రూ. 1000పై ఖచ్చితంగా రూ. 50 బోనస్ పొందుతారు. ఆ తర్వాతి 5 సంవత్సరాల్లో, అంటే 6 నుంచి 10 సంవత్సరాల మధ్య, ప్రతి రూ. 1000 కి ఈ బోనస్ రూ. 55 అవుతుంది. ఆ తర్వాత, 11 నుంచి 25 సంవత్సరాల్లో, ప్రతి రూ. 1000పై ఈ బోనస్ రూ. 60 గా మారుతుంది.
మిగిలిన ముఖ్యమైన విషయాలు ఏంటి?
ఎల్‌ఐసీ బీమా బీమా ప్లాన్‌లో పెట్టుబడికి ఉండాల్సిన కనీస వయస్సు 90 రోజులు, గరిష్ట వయస్సు 55 సంవత్సరాలు.
ఈ పథకంలో కనీస మొత్తం రూ. 5 లక్షలు అందుతుంది.
బీమా రత్న యోజనలో నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక ప్రాతిపదికన చెల్లింపులు చేయవచ్చు.
మీరు ఈ పాలసీని కనీస మొత్తం రూ. 5 లక్షలతో 15 సంవత్సరాల కాలానికి బీమా చేస్తే, పాలసీ మెచ్యూర్ అయ్యే సమయానికి మీరు మొత్తం రూ. 9,12,500 పొందుతారు.
PPF: పీపీఎఫ్ వడ్డీ పెరగలేదు, అయినా ఇతర పథకాల కంటే ఎక్కువ ఎలా సంపాదించవచ్చు?
SCSS: సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో వడ్డీ, పెట్టుబడి పరిమితి రెండూ పెరిగాయి
MSSC Scheme: ప్రారంభమైన ఉమెన్ స్పెషల్ స్కీమ్, పెట్టుబడికి ముందు ఈ విషయాలు తెలుసుకోండి
Small Savings Schemes: పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు పెంచిన కేంద్ర ప్రభుత్వం- నేటి నుంచే అమల్లోకి
Gold-Silver Price 01 April 2023: భారీ షాక్ ఇచ్చిన బంగారం, వెండి - ఒక్కసారిగా పెరిగిన రేటు
మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?
Pawan Kalyan Movie Title : అబ్బాయి అకీరా నందన్ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్?
Pushpa 2 OTT Rights Price : 'పుష్ప 2' ఓటీటీ రైట్స్‌కు 200 కోట్లు - ఇదంతా 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ మహిమేనా?
Bank Holidays list in April: ఏప్రిల్‌లో బ్యాంక్‌లు 15 రోజులు పని చేయవు, లిస్ట్ చూడండి