search
×

New PAN Card Apply: QR కోడ్‌తో ఉన్న కొత్త పాన్‌ కార్డ్‌ కావాలా? - ఇలా అప్లై చేయండి

PAN Card With QR Code: QR కోడ్‌తో కొత్త పాన్ కార్డ్‌ను మీరు ఉచితంగా పొందొచ్చు. దీనికోసం, ముందుగా, పాన్‌ డేటాబేస్‌లో మీ ఇంటి అడ్రస్‌ను అప్‌డేట్‌ చేయాలి.

FOLLOW US: 
Share:

PAN Card 2.0 Update Online: కేంద్ర ప్రభుత్వం, పాన్‌ 2.0 ప్రాజెక్ట్‌ కింద క్యూఆర్‌ కోడ్‌తో కూడిన పాన్‌ కార్డులు జారీ చేస్తోంది. అయితే, పాత/ప్రస్తుతం ఉన్న పాన్‌ కార్డు రద్దవుతుందా, రద్దయిన దాని బదులు కొత్త పాన్‌ కార్డ్‌ తీసుకోవాలా, కొత్త పాన్‌ కార్డు తీసుకుంటే కొత్త నంబర్‌ వస్తుందా అన్న ప్రశ్నలు చాలామందిలో ఉన్నాయి. పాన్‌ 2.0 ప్రాజెక్టు అమలవుతున్నప్పటికీ, పాత పాన్‌ కార్డును రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు, దానినే కొనసాగించవచ్చు. ఒకవేళ, మీరు QR కోడ్‌తో కూడిన కొత్త కార్డు తీసుకోవాలనుకుంటే, దాని కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికే మీ దగ్గర ఉన్న నంబర్‌తోనే కొత్త కార్డు జారీ అవుతుంది, నంబర్‌ మారదు.

కొత్త పాన్‌ కార్డ్‌ ఎలా తీసుకోవాలి?
పాత/ప్రస్తుతం ఉన్న పాన్‌ కార్డ్‌ స్థానంలో కొత్త కార్డ్‌ తీసుకోవాలంటే, ముందుగా చూడాల్సింది మీ చిరునామా. ఒకవేళ మీ చిరునామా మారి ఉంటే, ముందుగా ఆన్‌లైన్‌లో మీ ఇంటి అడ్రస్‌ను అప్‌డేట్‌ చేయాలి. ఆ తర్వాత క్యూఆర్‌ కోడ్‌ కలిగిన పాన్‌ కార్డు కోసం అప్లై చేసి కొత్త కార్డ్‌ పొందొచ్చు. ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ దగ్గర రిజిస్టర్‌ అయిన పాత అడ్రస్‌ స్థానంలో కొత్త అడ్రస్‌ను పాన్‌ కార్డ్‌ హోల్డర్లు ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ఒకవేళ మీ చిరునామా మారకపోతే, నేరుగా కొత్త కార్డ్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

సాధారణంగా, పాన్‌ కార్డుపై కార్డ్‌ హోల్డర్‌ ఇంటి అడ్రస్‌ ముద్రించరు. దీంతో, చాలా మంది చిరునామాలను అప్‌డేట్‌ చేయడం లేదు. పాన్‌ కార్డ్‌పై ఇంటి అడ్రస్‌ లేనప్పటికీ, ఇమ్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ రికార్డుల్లో మీ చిరునామా నమోదై ఉంటుంది. ఆదాయ పన్నుకు సంబంధించిన కీలక సమాచారాన్ని సరైన సమయంలో పొందాలంటే పాన్‌ కార్డ్‌లో మీ ఇంటి లేటెస్ట్‌ అడ్రస్‌ ఉండేలా చూసుకోవాలి.

పాన్‌ కార్డ్‌లో ఇంటి అడ్రస్‌ ఎలా మార్చుకోవాలి?
పాన్‌ కార్డ్‌ హోల్డర్‌ ఈ పనిని ఉచితంగా పూర్తి చేయొచ్చు. ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ రికార్డుల్లో మీ ఇంటి చిరునామాను నవీకరించేందుకు, ముందుగా, మీ ఆధార్‌-పాన్‌ అనుసంధానం (Aadhar - PAN Linking) పూర్తై ఉండాలి. మీ ఆధార్‌ వివరాల్లో తాజా అడ్రస్‌ ఉండాలి. మీరు పాన్‌లో చిరునామా మార్చుకోవడానికి ప్రయత్నించినప్పుడు, ఆదాయ పన్ను విభాగం మీ ఆధార్‌ మీద ఉన్న అడ్రస్‌ను పాన్‌లోకి తీసుకుంటుంది. తత్ఫలితంగా, మీ ఆధార్‌లో ఉన్న అడ్రస్‌ ఆదాయ పన్ను విభాగం రికార్డుల్లోకి/ పాన్‌ డేటాబేస్‌లోకి ఎక్కుతుంది.

- NSDL జారీ చేసిన పాన్‌ కార్డ్‌ మీ దగ్గర ఉంటే, https:///www.onlineservices.nsdl.com/paam/endUserAddressUpdate.html లింక్‌ ద్వారా అడ్రస్‌ అప్‌డేట్‌ చేసుకోవచ్చు. 

- UTI ITSL జారీ చేసిన పాన్‌ కార్డ్‌ మీ దగ్గర ఉంటే, https:///www.pan.utiitsl.com/PAN_ONLINE/homeaddresschange లింక్‌ ద్వారా అడ్రస్‌ అప్‌డేట్‌ చేసుకోవచ్చు.

- పాన్‌ కార్డ్‌ను జారీ చేసిన కంపెనీ పేరు మీ పాన్‌ కార్డ్‌ వెనుక ఉంటుంది.

ఆన్‌లైన్‌లో పాన్‌ కార్డ్‌ అడ్రస్‌ను మార్చుకోవడం...

- మీ పాన్‌ కార్డ్‌ను జారీ చేసిన కంపెనీని బట్టి, పైన ఉన్న రెండు లింకుల్లో ఒకదానిని ఎంచుకోవాలి. 
- హోమ్‌ పేజీలో, మీ పాన్, ఆధార్‌ నంబర్‌, పుట్టిన తేదీని నమోదు చేయాలి. 
- పాన్‌ కార్డ్‌ కోసం ఆధార్‌ వివరాలను వినియోగించుకునే అనుమతి కోసం బాక్స్‌లో టిక్‌ పెట్టి "Submit" మీద క్లిక్‌ చేయాలి.
- ఇప్పుడు, మరో కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. ఆధార్‌తో అనుసంధానమై ఉన్న మీ మొబైల్ నంబర్‌, ఇ-మెయిల్‌ ఐడీకి OTP వస్తుంది. OTPతో ఆధార్‌ ఆధారిత ఇ-కేవైసీని జెనరేట్‌ చేయొచ్చు. ఇక్కడ, "Continue with e-KYC" మీద క్లిక్‌ చేయాలి.
- మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ లేదా ఇ-మెయిల్‌ ఐడీకి వచ్చిన OTPని ఎంటర్‌ చేసి ఇచ్చి "Submit" బటన్‌ మీద నొక్కండి.
- ఇక్కడ, ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ రికార్డుల్లో ఉన్న మొబైల్‌ నంబర్‌, ఇ-మెయిల్‌ ఐడీని అప్‌డేట్‌ చేయొచ్చు. ఇది ఆప్షనల్‌. 
- తర్వాత, ఆధార్‌లో ఉన్న చిరునామా వివరాలు 'నక్షత్రం గుర్తులతో' కలిసి కనిపిస్తాయి. ఆ వివరాలు చెక్‌ చేసుకుని "Verify" బటన్‌ మీద క్లిక్‌ చేయండి.
- ఇప్పుడు మరో కొత్త పేజ్‌ కనిపిస్తుంది. ఇక్కడ మీ కొత్త చిరునామాను ఎంటర్‌ చేయండి.
- ఇక్కడితో ప్రాసెస్‌ పూర్తవుతుంది, మీ చిరునామా ఉచితంగా అప్‌డేట్‌ అవుతుంది.

ఆదాయ పన్ను విభాగం దగ్గర మీ ఇంటి చిరునామాను నవీకరించగానే, తొలుత, QR కోడ్‌తో ఉన్న ఇ-పాన్‌ మీ రిజిస్టర్డ్‌ ఇ-మెయిల్‌ ఐడీకి వస్తుంది. ఆ తర్వాత కొత్త కార్డ్‌ మీరు అప్‌డేట్‌ చేసిన ఇంటి అడ్రస్‌కు వస్తుంది. 

మరో ఆసక్తికర కథనం: రెపో రేట్‌ యథాతథం, తప్పని EMIల భారం - వరుసగా 11వ సారీ 'ఆశలపై నీళ్లు' 

Published at : 07 Dec 2024 10:57 AM (IST) Tags: Pan Card Income Tax Department online PAN Card With QR Code QR Code PAN Card

ఇవి కూడా చూడండి

Emergency Fund: ఎమర్జెన్సీ ఫండ్‌ ఏర్పాటు చేసుకుంటున్నారా? అందరూ చేసే ఈ తప్పులు మీరు మాత్రం చేయొద్దు

Emergency Fund: ఎమర్జెన్సీ ఫండ్‌ ఏర్పాటు చేసుకుంటున్నారా? అందరూ చేసే ఈ తప్పులు మీరు మాత్రం చేయొద్దు

Credit Card Loan: క్రెడిట్ కార్డ్ లోన్‌ తీసుకోబోతున్నారా? ముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి

Credit Card Loan: క్రెడిట్ కార్డ్ లోన్‌ తీసుకోబోతున్నారా? ముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి

Travel Credit Card: ట్రావెల్ క్రెడిట్ కార్డ్‌లతో ప్రయోజనాలే కాదు, మీకు తెలీని సీక్రెట్స్‌ కూడా ఉన్నాయి

Travel Credit Card: ట్రావెల్ క్రెడిట్ కార్డ్‌లతో ప్రయోజనాలే కాదు, మీకు తెలీని సీక్రెట్స్‌ కూడా ఉన్నాయి

Upcoming IPO: మార్కెట్‌లోకి రానున్న రూ.15000 కోట్ల IPO, డబ్బులతో రెడీగా ఉండండి

Upcoming IPO: మార్కెట్‌లోకి రానున్న రూ.15000 కోట్ల IPO, డబ్బులతో రెడీగా ఉండండి

Return On Gold: రూ.2943కు కొన్నారు, రూ.8624కు అమ్ముతున్నారు - గోల్డ్‌ మీద మూడు రెట్ల లాభం

Return On Gold: రూ.2943కు కొన్నారు, రూ.8624కు అమ్ముతున్నారు - గోల్డ్‌ మీద మూడు రెట్ల లాభం

టాప్ స్టోరీస్

Telangana: ఆదాయం తగ్గి అప్పులు పెరిగినా దైర్యం కోల్పోలేదు - ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

Telangana: ఆదాయం తగ్గి అప్పులు పెరిగినా దైర్యం కోల్పోలేదు - ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

Chandra Babu Latest News: హిందీ, ఇంగ్లీషు నేర్చుకుంటే తప్పేంటీ- నేరిస్తే ఢిల్లీతో కమ్యూనికేషన్ ఈజీ: ముఖ్యమంత్రి చంద్రబాబు

Chandra Babu Latest News: హిందీ, ఇంగ్లీషు నేర్చుకుంటే తప్పేంటీ- నేరిస్తే ఢిల్లీతో కమ్యూనికేషన్ ఈజీ: ముఖ్యమంత్రి చంద్రబాబు

Himachal Viral Video: హిమాలయాల్లో డేంజరస్ డ్రైవింగ్..హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు ఈ వీడియో చూడకండి…

Himachal Viral Video: హిమాలయాల్లో డేంజరస్  డ్రైవింగ్..హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు ఈ వీడియో చూడకండి…

Andhra Pradesh Cabinet Decisions : చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం- కేబినెట్ కీలక నిర్ణయాలు 

Andhra Pradesh Cabinet Decisions : చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం- కేబినెట్ కీలక నిర్ణయాలు