By: ABP Desam | Updated at : 20 Feb 2022 08:15 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ఈపీఎఫ్‌వో
EPFO New Pension Scheme for formal workers: సంఘటిత రంగంలోని ఉద్యోగుల కోసం EPFO సరికొత్త పింఛను పథకం తీసుకొచ్చేందుకు సమాలోచనలు చేస్తోంది. ఉద్యోగుల పింఛను పథకం EPS-95 పరిధితో సంబంధం లేకుండా నెలకు రూ.15,000కు పైగా బేసిక్ పే, డీఏ వచ్చేవారి కోసం దీనిని ప్రవేశపెట్టాలని అనుకుంటోంది. ప్రస్తుతం ఉద్యోగంలో చేరినప్పుడు రూ.15,000 వరకు పొందుతున్నవారు తప్పనిసరిగా EPS-95 కిందకు వస్తున్నారు.
'ఈపీఎఫ్‌వోలో అధికంగా కంట్రిబ్యూట్ చేస్తున్న వారికి అత్యధిక పింఛను అందించాలన్న డిమాండ్లు ఉన్నాయి. అందుకే సరికొత్త పింఛను పథకం తీసుకురావడం పరిగణనలో ఉంది. లేదా మూల వేతం రూ.15,000కు పైగా ఉన్న ఉద్యోగుల కోసం ఓ పథకం తీసుకురావాలని అనుకుంటున్నారు' అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.
మార్చి 11, 12న గువాహటిలో ఈపీఎఫ్‌వో ధర్మకర్తల మండలి సమావేశం కానుంది. అక్కడ జరిగే సమావేశంలో ఇది చర్చకు రానుంది. 2021, నవంబర్‌లో పింఛను వ్యవహారాలపై వేసిన కబ్ కమిటీ కూడా అప్పుడే నివేదికను సమర్పించనుంది.
ఇప్పుడు రూ.15,000కు పైగా మూల వేతనం వస్తున్న ఉద్యోగులు ఇష్టం లేకున్నా 8.33 శాతం చొప్పున తక్కువ మొత్తాన్నే జమ చేయాల్సి వస్తోంది. దీనివల్ల తక్కువ పింఛను లభిస్తోంది. రూ.15,000 లోపు మూల వేతనం ఉన్నవారు ఎక్కువ కంట్రిబ్యూట్ చేయకుండా 2014లో ఈపీఎఫ్‌వో పింఛను పథకంలో పరిమితి ఉండేలా ఓ సవరణ తీసుకొచ్చింది. మొదట్లో ఇది రూ.6,500 నుంచి పెంచారు. ఆ తర్వాత రూ.15,000 వరకు అమలు చేశారు. ఇప్పుడు మూల వేతనాన్ని రూ.25,000 వరకు పెంచాలని డిమాండ్లు ఉన్నాయి. అయితే ఆ ప్రతిపాదన ఇంకా ఆమోదించలేదు.
'ఉద్యోగ భవిష్య నిధి చట్టం - 1952 ప్రకారం నెలవారీ మూలవేతనం పరిమితి రూ.15,000 నుంచి రూ.25,000 పెంచాలన్న ప్రతిపాదన ఉంది. ఈ విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు' అని 2016, డిసెంబర్లో అప్పటి కార్మిక శాఖా మంత్రి బండారు దత్తాత్రేయ లోక్‌సభలో పేర్కొన్నారు. ప్రస్తుతానికి మూల వేతనం పెంపు గురించి బలమైన డిమాండ్లు ఉన్నాయని ఆ అధికారి అంటున్నారు.
Also Read: ట్రంప్ వారి కొత్త సోషల్ మీడియా యాప్ - సోమవారమే విడుదల! పేరేంటో తెలుసా?
Also Read: ఫండమెంటల్స్ బలం - లక్షకు రూ.1.81 కోట్ల లాభం, ఆ షేరేంటంటే!
#EPFO never asks its members to share their personal details like Aadhaar, PAN, UAN, Bank Account or OTP over phone or on social media.#EPFO कभी भी अपने सदस्यों से व्यक्तिगत विवरण जैसे आधार, पैन, यूएएन, बैंक खाता या ओटीपी फोन या सोशल मीडिया पर साझा करने के लिए नहीं कहता है। pic.twitter.com/mhhGS3uh9I
— EPFO (@socialepfo) February 20, 2022
#EPFO adds 14.60 lakh net subscribers in December 2021 with 9.11 lakh New Members. 46.89% from 18-25 age group.
— EPFO (@socialepfo) February 20, 2022
For more details:https://t.co/YyTpOO18UI
For Payroll data:https://t.co/SEFnVWWYk2@LabourMinistry @PIB_India @PIBHindi @byadavbjp @Rameswar_Teli @PMOIndia @esichq
PF Salary Limit: పీఎఫ్ జీతాల పరిమితి 25-30 వేలకు పెంచే యోచనలో ప్రభుత్వం! దీని వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం?
World Cheapest Silver Price: ప్రపంచంలో అత్యంత చౌకగా వెండి లభించే దేశం ఏదీ? భారత్ కంటే 40 వేల రూపాయల వరకు తక్కువ!
Gold and Silver Prices: నేటి బంగారం ధర: బంగారం, వెండి ధరలు తగ్గాయి, జనవరి 8న బంగారం ఎంత చౌకగా వచ్చిందో తెలుసుకోండి
YouTube Earnings : యూట్యూబ్‌లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Donald Trump Tariffs: ఇరాన్ తో వ్యాపారం చేస్తే అమెరికా 25 శాతం టారిఫ్.. ఈ దేశాలపై నేరుగా ప్రభావం
YS Jagan: బెంగళూరులోనే ఎక్కువ కాలం జగన్ - కుట్రల కోసమేనని టీడీపీ ఆరోపణలు - ఏపీలో ఎందుకు ఉండలేరు?
Bangladesh Crime News: బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య, తీవ్ర గాయాలతో మృతదేహం లభ్యం
Bhartha Mahasayulaku Wignyapthi OTT : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' వచ్చేది ఆ ఓటీటీలోకే - ఈ టీవీ ఛానల్లో రవితేజ మూవీ చూసెయ్యండి
This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy