News
News
X

Paytms Vijay Shekhar Sharma: పేటీఎం సీఈవో కథ కంచికేనా! ఇన్వెస్టర్ల ఓటు ఎటువైపు?

Paytms CEO: పేటీఎం స్థాపకుడు, సీఈవో విజయ శేఖర శర్మ అత్యంత కఠిన పరీక్ష ఎదుర్కోబోతున్నారు. సంస్థ సీఈవోగా కొనసాగేందుకు ఇన్వెస్టర్ల విశ్వాసం చూరగొంటారో లేదో నేటితో తేలిపోనుంది.

FOLLOW US: 

Paytms CEO Vijay Shekhar Sharma: పేటీఎం స్థాపకుడు, సీఈవో విజయ శేఖర శర్మ అత్యంత కఠిన పరీక్ష ఎదుర్కోబోతున్నారు. సంస్థ సీఈవోగా కొనసాగేందుకు ఇన్వెస్టర్ల విశ్వాసం చూరగొంటారో లేదో నేటితో తేలిపోనుంది. ఈ రోజు మధ్యాహ్నం జరిగే ఓటింగ్‌లో మదుపర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని మార్కెట్‌ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

దేశంలోని అతిపెద్ద ఐపీవోల్లో ఒకటిగా పేటీఎం స్టాక్‌ మార్కెట్లోకి ప్రవేశించింది. లక్ష కోట్లకు పైగా విలువతో అరంగేట్రం చేసింది. కానీ ఇది మూణ్ణాళ్ల ముచ్చటగానే మారింది. తొలి రోజు నుంచే నష్టాల బాట పట్టింది. షేరు ధర రూ.2150 నుంచి రూ.600 స్థాయికి పతనమైంది. కంపెనీ వరుస త్రైమాసికాల్లో నష్టాలనే నమోదు చేస్తోంది. అలాంటప్పుడు లాభాల్లోకి తీసుకురాని సీఈవో ఎందుకని ఇన్వెస్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

శుక్రవారం మధ్యాహ్నం పేటీఎం వార్షిక సాధారణ సమావేశం వర్చువల్‌గా జరుగుతోంది. అనేక అంశాలపై ఓటింగ్‌ నిర్వహించబోతున్నారు. సీఈవోగా విజయ్ శేఖర్‌ శర్మ పాత్రపై ఓటింగ్‌ ఉండనుంది. ఇన్వెస్టర్లు తిరిగి ఆయన్నే సీఈవోగా ఎన్నుకోవాలని ఓ ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ గత వారం సూచించింది. పేటీఎంను నష్టాల్లోంచి లాభాల్లోకి తీసుకురాగల సత్తా ఆయనకే ఉందని చెబుతోంది. మరోవైపు ఆయనపై వ్యతిరేకత అంతకంతకూ తీవ్రమవుతోంది.

గతేడాది నవంబర్లో పేటీఎం స్టాక్‌ మార్కెట్లో అరంగేట్రం చేసింది. అప్పటి నుంచి షేరు విలువ ఏకంగా 60 శాతం మేర పడిపోయింది. దాంతో ఇన్వెస్టర్లు లబోదిబో అంటున్నారు. అయితే భారత్‌లో వంద బిలియన్‌ డాలర్ల వార్షిక ఆదాయం పొందే తొలి ఇంటర్నెట్‌ కంపెనీగా అవతరించేందుకు పేటీఎం సిద్ధంగా ఉందని విజయ శేఖర శర్మ చెబుతున్నారు. లాభాల వైపు మళ్లేలా  కంపెనీ వృద్ధి కొనసాగుతోందని హామీ ఇస్తున్నారు.

విజయ శేఖర్‌ ఈ మధ్యే కంపెనీ సీఈవోగా తిరిగి ఎంపికయ్యారు. ఆయన నియామకానికి వ్యతిరేకంగా ఓటేయాలని, ప్రొఫెషనల్‌కు ఆ బాధ్యతలు అప్పగించాలని ఇన్‌స్టిట్యూషనల్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ ఇండియా లిమిటెడ్‌ గత వారం సూచించింది. కంపెనీ లాభాల బాటలో పయనించబోతోందని ఐపీవోకు ముందు విజయ శేఖర్‌ ఎన్నోసార్లు చెప్పినా ఇప్పటి వరకు అలా జరగలేదు. కాగా పేటీఎం షేరు ధర శుక్రవారం నష్టాల్లో ఉంది. రూ.12 నష్టంతో రూ.774 వద్ద కొనసాగుతోంది.

View this post on Instagram
 
A post shared by Paytm (@paytm)

Published at : 19 Aug 2022 02:28 PM (IST) Tags: Paytm Paytm ipo Paytm Share Price Vijay Shekhar Sharma paytm ceo

సంబంధిత కథనాలు

Suzlon Energy Stock: 50% డిస్కౌంట్‌లో షేర్లు కావాలా?, ఈ రైట్స్‌ ఇష్యూ మీ కోసమే!

Suzlon Energy Stock: 50% డిస్కౌంట్‌లో షేర్లు కావాలా?, ఈ రైట్స్‌ ఇష్యూ మీ కోసమే!

Rupee vs US Dollar: రూపాయి చిల్లు పెరిగింది బాస్‌, 81.52 కు చేరింది

Rupee vs US Dollar: రూపాయి చిల్లు పెరిగింది బాస్‌, 81.52 కు చేరింది

Stock Market Opening Bell 26 September 2022: అసలే బిగ్‌ గ్యాప్‌ డౌన్‌, ఆపై మరింత పతనం

Stock Market Opening Bell 26 September 2022: అసలే బిగ్‌ గ్యాప్‌ డౌన్‌, ఆపై మరింత పతనం

Stocks to watch 26 September 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - ఫోకస్‌లో Harsha Engineers, BPCL

Stocks to watch 26 September 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - ఫోకస్‌లో Harsha Engineers, BPCL

Petrol-Diesel Price, 26 September: ముడి చమురు భారీగా పతనం - మన పెట్రోల్‌ బంకుల్లో రేట్లు ఎంత మారాయంటే?

Petrol-Diesel Price, 26 September: ముడి చమురు భారీగా పతనం - మన పెట్రోల్‌ బంకుల్లో రేట్లు ఎంత మారాయంటే?

టాప్ స్టోరీస్

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Jacqueline Fernandez Bail: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు బెయిల్!

Jacqueline Fernandez Bail: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు బెయిల్!

Rajasthan Congress Crisis: రాజస్థాన్‌లో రాత్రికి రాత్రే హైడ్రామా- 90 మంది ఎమ్మెల్యేల రాజీనామా!

Rajasthan Congress Crisis: రాజస్థాన్‌లో రాత్రికి రాత్రే హైడ్రామా- 90 మంది ఎమ్మెల్యేల రాజీనామా!