Gemini : గూగుల్ యాప్స్ వాడే వాళ్లకు గుడ్ న్యూస్.. జెమిని కోసం నెలకు రూ. 1,500 చెల్లించాల్సిన అవసరం లేదు
Gemini AI :వర్క్‌స్పేస్ యాప్‌లలో గూగుల్ జెమిని-ఆధారిత AI ఫీచర్‌ల కోసం ఇప్పటి వరకు డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చేంది. కానీ ఇప్పుడు అది పూర్తిగా ఉచితం.

Google Apps : టెక్నాలజీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న గూగుల్ GenAI జెమినిని గూగుల్ సంస్థ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గూగుల్ తన జనరేటివ్ ఏఐ చాట్ బాట్ జెమిని మొబైల్ యాప్ (Google Gemini app)ను ఇంగ్లీష్‌తో పాటు మరో తొమ్మిది భారతీయ భాషల్లో కూడా విడుదల చేసింది. హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో ఈ చాట్ జీపీటీ తరహా సేవలను అందించే జెమిని మొబైల్ యాప్ (Google Gemini app) ప్రస్తుతం అందుబాటులో ఉంటుంది. జెమినీ అడ్వాన్స్ డ్ లోఈ 9స్థానిక భాషలను గూగుల్ అనుసంధానం చేయగలదు. అంతేకాకుండా.. గూగుల్ జెమినీ అడ్వాన్డ్స్‌లో కొత్త ఫీచర్లను కూడా ప్రవేశపెట్టారు. ఇందులో కొత్తగా డేటా విశ్లేషణ సామర్థ్యాలు, ఫైల్ అప్ లోడింగ్, ఇంగ్లీష్ లో గూగుల్ మెసేజ్ లు జెమినితో చాట్ చేసే అవకాశం వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇది కస్టమర్లకు ఏఐ సపోర్టు అందించడానికి దేశంలోని అన్ని భాషలలో టైప్ చేయడానికి లేదా మాట్లడడానికి వీలుగా కల్పిస్తుంది.
వర్క్‌స్పేస్ యాప్‌లలో గూగుల్ జెమిని-ఆధారిత AI ఫీచర్‌ల కోసం ఇప్పటి వరకు డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చేంది. కానీ ఇప్పుడు అది పూర్తిగా ఉచితం. ఈ వారం నుండి గతంలో నెలకు రూ.1,500 జెమిని బిజినెస్ ప్లాన్‌తో ముడిపడి ఉన్న దాని అన్ని ఏ సాధనాలు ప్రామాణిక వర్క్‌స్పేస్ బిజినెస్, ఎంటర్‌ప్రైజ్ సబ్‌స్క్రిప్షన్‌లలో చేర్చబడిందని గూగుల్ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ , ఓపెన్‌ఏఐతో గూగుల్ పోటీ పడుతున్నందున AI సామర్థ్యాలను మరింత మెరుగు పరుచడమే కంపెనీ లక్ష్యం. ఈ కొత్త ఫీచర్‌లను కవర్ చేయడానికి గూగుల్ అన్ని వర్క్‌స్పేస్ ప్లాన్‌ల ధరను పెంచుతోంది. చాలా వ్యాపారాలు ఇప్పుడు నెలకు వినియోగదారునికి దాదాపు రూ.125 ఎక్కువ చెల్లిస్తాయి. గతంలో రూ.900 ($12) ఖర్చయ్యే బేస్ సబ్‌స్క్రిప్షన్ ఇప్పుడు రూ.1,050 ($14) ధర నిర్ణయించబడుతుంది. ఇది ఖచ్చితంగా బ్యాంక్ బ్రేకర్ కాదు.. కానీ ఎక్కువ మొత్తంలో ఉద్యోగులను కలిగి ఉన్న కంపెనీలకు ఇది గమనించదగిన మార్పు.
Also Read :Elon Musk : బంపర్ ఆఫర్ ఇచ్చిన ఎలాన్ మస్క్.. డిగ్రీ లేకుండానే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జాబ్
AI ప్యాకేజీలో ఏముంది?
గూగుల్ వర్క్ స్పేస్ ఏఐ సూట్‌తో మీరు Gmailలో ఇమెయిల్ సారాంశాలు మీట్ లో ఆటోమేటెడ్ మీటింగ్ నోట్స్, షీట్స్ లో స్ప్రెడ్‌షీట్ డిజైన్ సహాయం, డాక్స్ లో ఏఐ రైటింగ్ అసిస్టెంట్‌లు వంటి సాధనాలను పొందవచ్చు. గూగుల్ ఫ్లాగ్‌షిప్ ఏఐ Gemini bot, ఇమెయిల్‌లను రిసీవ్ చేసుకోవడం, డేటాను కనుగొనడంలలో వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తుంది. అంతే కాకుండా యూజర్ల కొన్ని డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయడానికి, నోట్ బుక్ లను షేర్ చేసుకునేందుకు అనుమతినిస్తుంది.
ఫ్రీగా ఎందుకు ఇస్తుంది ?
జెమినీ కోసం అదనపు రుసుమును రద్దు చేయాలనే గూగుల్ నిర్ణయం వ్యూహాత్మకంగా కనిపిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఏఐ రేసు నడుస్తోంది. ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కొనేందుకు కంపెనీ ఇలాంటి చర్య తీసుకుంది. ఈ మేరకు గూగుల్ స్పష్ట మైన ప్రకటన చేసింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

