UPI Payments Via PPI: యూపీఐ యూజర్లకు అలర్ట్! ఇకపై ఆ లావాదేవీలపై ఏప్రిల్ 1 నుంచి ఫీజు!
UPI Payments Via PPI: మొబైల్ పేమెంట్ యాప్ కస్టమర్లకు అలర్ట్! ఇకపై యూపీఐ ద్వారా కొన్ని రకాల చెల్లింపులపై ఇంటర్‌ఛేంజ్ ఫీజు వసూలు చేస్తున్నారు.
UPI Payments Via PPI:
మొబైల్ పేమెంట్ యాప్ కస్టమర్లకు అలర్ట్! ఇకపై యూపీఐ ద్వారా కొన్ని రకాల చెల్లింపులపై ఇంటర్‌ఛేంజ్ ఫీజు వసూలు చేస్తున్నారు. ప్రీపెయిడ్ సాధానాలైన వ్యాలెట్లు లేదా కార్డుల ద్వారా యూపీఐ విధానంలో చేపట్టే మర్చంట్ లావాదేవీలకు 1.1 శాతం రుసుము తీసుకుంటారు.
ఆన్‌లైన్ మర్చంట్స్, పెద్ద మర్చంట్స్, చిన్నపాటి ఆఫ్‌లైన్ మర్చంట్ల వద్ద చేసే రూ.2000కు పైగా విలువైన లావాదేవీలపై 1.1 శాతం ఇంటర్ ఛేంజ్ ఫీజు తీసుకుంటారు. ప్రీపెయిడ్ సాధనాలను జారీ చేసినవారు డబ్బులు డిపాజిట్ అయిన బ్యాంకుకు 15 బేసిస్ పాయింట్ల మేర ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా అవతలి పేమెంట్ బ్యాంకు నుంచి వీరికి వస్తే 15 బేసిస్ పాయింట్ల మేర ఫీజు వస్తుంది. సాధారణంగా కార్డు పేమెంట్ల అంగీకారం, ప్రాసెసింగ్, ఆథరైజింగ్ లావాదేవీల ఖర్చులు రాబట్టేందుకు ఇలా ఇంటర్ ఛేంజ్ ఫీజు తీసుకుంటారు.
బ్యాంకు, ప్రీపెయిడ్ వ్యాలెట్ మధ్య పర్సన్ టు పర్సన్, పర్సన్ టు మర్చంట్ లావాదేవీలపై ఈ రుసుములు వర్తించవు. అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తికి, ఒక వ్యక్తి వేరే మర్చంట్‌తో చేసే లావాదేవీలపై ఫీజు ఉండదు. ఎన్‌పీసీఐ 1.1 శాతం ఇంటర్ ఛేంజ్ ఫీజు అమలు చేస్తున్నా అందరికీ ఇది ఒకేలా వర్తించదు. కొందరు తక్కువ ఫీజుకు అర్హులు అవుతారు. ఉదాహరణకు ఒక ప్రీపెయిడ్ సాధనం నుంచి యూపీఐ ద్వారా పెట్రోల్ స్టేషన్లో చెల్లిస్తే 0.5 శాతమే ఫీజు వర్తిస్తుంది.
ప్రీపెయిడ్ సాధనాల నుంచి యూపీఐ ద్వారా రూ.2000కు పైగా లావాదేవీ జరిపితే టెలికాంకు 0.70 శాతం, మ్యూచువల్ ఫండ్‌కు ఒక శాతం, యుటిలిటీస్‌కు 0.70 శాతం, విద్యకు 0.70 శాతం, సూపర్ మార్కెట్‌కు 0.90 శాతం, బీమాకు ఒక శాతం, వ్యవసాయానికి 0.70 శాతం కన్వీనియెన్స్ స్టోర్‌కు 1.10 శాతం ఇంటర్ ఛేంజ్ ఫీజు వర్తిస్తుంది. ఏదేమైనా గరిష్ఠంగా రూ.15 మాత్రమే వసూలు చేస్తారని తెలుస్తోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.