News
News
X

July First Release : జూలై 1 విడుదల - వీటి గురించి తెలుసుకోకపోతే ఖర్చలెక్కువైపోతాయ్ !

జూలై 1 నుంచి బ్యాంకింగ్, కార్మిక రంగాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాటి గురించి తెలుసుకుంటే పనులు సింపుల్‌గా చేసుకోవచ్చు.

FOLLOW US: 

July First Release   :  జూలై ఒకటో తేదీ నుంచి ఆర్థిక పరమైన విషయాల్లో కొన్ని అంశాలను మనం మార్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా  క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల విషయంలో ఆర్బీఐ పలు మార్పులు చేసింది. క్రెడిట్‌ కార్డులను తొలగించుకోవడం, బిల్లుల చెల్లింపుల విషయంలో కొత్త రూల్స్‌ తీసుకొచ్చింది. కొత్త రూల్స్‌ అన్ని షెడ్యూల్‌ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలకు వర్తిస్తుంది. పేమెంట్‌ బ్యాంకులు, కో-ఆపరేటివ్‌ బ్యాంకులు, జిల్లా సెంట్రల్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకులకు ఈ నిబంధనలు వర్తించవు.

వినియోగదారుడి అనుమతితోనే క్రెడిట్ కార్డు మంజూరు చేయాలి ..లేకపోతే ?

కొత్త రూల్స్‌ ప్రకారం వినియోగదారుడి ప్రమేయం లేకుండా బ్యాంకులు కొత్త క్రెడిట్‌ కార్డులు ఇచ్చినా.. అప్‌గ్రేడ్‌ చేసినా.. ఆ తర్వాత దానికి సంబంధించి బిల్లులు వేసినా ఆ మొత్తాన్ని కార్డు ఇచ్చిన సంస్థ చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా బిల్లు మొత్తానికి రెట్టింపు జరిమానా విధిస్తారు.వినియోగదారుడి వద్ద ఉన్న క్రెడిట్‌ కార్డును వద్దనుకుంటే.. ఈ విషయంలో కంపెనీకి ఫిర్యాదు చేస్తే 7 రోజుల్లోగా ఆ కార్డును బ్లాక్‌ చేయాలి. లేదంటే అప్పటి నుంచి ప్రతి రోజూ సంస్థ రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

అమల్లోకి కొత్త కార్మిక చట్టాలు -  పీఎఫ్ జమ మరింత పెంపు

ఇక కొత్త కార్మిక చట్టాలు కూడా జూలై 1 నుంచే్ అమల్లోకి రానున్నాయి. రోజుకు 12 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 8 గంటలే ఉండేది. అయితే వారంలో 4 రోజులు మాత్రమే పని ఉంటుంది. మూడు రోజులు కంపెనీలు సెలవులు ఇవ్వాల్సి ఉంటుంది. భవిష్య నిధిలో ఎక్కువ మొత్తంలో జమ చేయాల్సి రావడం వల్ల చేతికి అందాల్సిన మొత్తం తగ్గుతుంది. గ్రాస్‌ శాలరీలో 50 శాతం మేర పీఎఫ్‌లో జమ చేయాల్సి వస్తుంది. . ఆర్జిత సెలవులు పొందే అర్హతను 240 పనిదినాల నుంచి 180 రోజులకు తగ్గించారు. ఉద్యోగంలో కొత్తగా చేరిన వారికి 240 రోజుల పనిచేసిన తర్వాతనే ఈఎల్స్‌ లభించేవి. దాన్ని 180 రోజులకు కుదించారు. అయితే ఈ చట్టాలను అన్ని రాష్ట్రాలు ఆమోదించలేదు. తెలుగు రాష్ట్రాల్లో అమలు కావట్లేదు. 

వాడి పడేసే ప్లాస్టిక్‌పై దేశవ్యాప్తంగా నిషేధం 

అలాగే  జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగంపై కేంద్రం నిషేధం విధించింది. వీటి తయారీ, పంపిణీ, దిగుమతి, అమ్మకంపైనా నిషేధం విధించింది. బెలూన్‌ పుల్లలు, సిగరెట్‌ ప్యాకెట్లు, డిస్పోజబుల్‌ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఇయర్‌ బడ్స్‌, ఐస్‌క్రీం పుల్లలు, పీవీసీ బ్యానర్లు మరికొన్ని నిషేధిత జాబితాలో ఉన్నాయి.

Published at : 28 Jun 2022 05:21 PM (IST) Tags: Single Use Plastic Ban July 1 July 1 regulations banking changes

సంబంధిత కథనాలు

Petrol-Diesel Price, 9 August: నేడు చాలాచోట్ల పెట్రోల్, డీజిల్ ధరలు పైకి - మీ నగరంలో ఇవాళ ఇలా

Petrol-Diesel Price, 9 August: నేడు చాలాచోట్ల పెట్రోల్, డీజిల్ ధరలు పైకి - మీ నగరంలో ఇవాళ ఇలా

Gold-Silver Price: బంగారం కొంటున్నారా? మీ నగరంలో లేటెస్ట్ గోల్డ్, సిల్వర్ రేట్స్ ఇలా

Gold-Silver Price: బంగారం కొంటున్నారా? మీ నగరంలో లేటెస్ట్ గోల్డ్, సిల్వర్ రేట్స్ ఇలా

Cryptocurrency Prices: రివ్వున ఎగిసిన క్రిప్టోలు! భారీగా పెరిగిన బిట్‌కాయిన్‌

Cryptocurrency Prices: రివ్వున ఎగిసిన క్రిప్టోలు! భారీగా పెరిగిన బిట్‌కాయిన్‌

Stock Market News: రిలాక్స్‌ గాయ్స్‌! దూసుకెళ్లిన సెన్సెక్స్‌, నిఫ్టీ! రూపాయి మాత్రం...!

Stock Market News: రిలాక్స్‌ గాయ్స్‌! దూసుకెళ్లిన సెన్సెక్స్‌, నిఫ్టీ! రూపాయి మాత్రం...!

Modi Govt Scheme: పెళ్లైన వారికి బొనాంజా! రూ.200తో ఏటా రూ.72వేలు పొందే స్కీమ్‌ ఇది!

Modi Govt Scheme: పెళ్లైన వారికి బొనాంజా!  రూ.200తో ఏటా రూ.72వేలు పొందే స్కీమ్‌ ఇది!

టాప్ స్టోరీస్

India vs Australia History: ఏ ఆట అయినా, ఏ టోర్నమెంట్ అయినా ఈ ఆస్ట్రేలియన్స్ వదలరా మనల్ని..?

India vs Australia History: ఏ ఆట అయినా, ఏ టోర్నమెంట్ అయినా ఈ ఆస్ట్రేలియన్స్ వదలరా మనల్ని..?

A little boy got angry on his teacher : గోదావరియాసలో మాస్టారిపై కంప్లైంట్ చేసిన పిల్లాడు | ABP Desan

A little boy got angry on his teacher : గోదావరియాసలో మాస్టారిపై కంప్లైంట్ చేసిన పిల్లాడు | ABP Desan

APSRTC Bus Theft: ఆర్టీసీ బస్సునే కొట్టేసిన దుండగుడు, కంగారుపడ్డ డ్రైవర్ - ఇంతలో ఊహించని ట్విస్ట్!

APSRTC Bus Theft: ఆర్టీసీ బస్సునే కొట్టేసిన దుండగుడు, కంగారుపడ్డ డ్రైవర్ - ఇంతలో ఊహించని ట్విస్ట్!

Asia Cup Squad Announced: ఆసియా కప్ భారత జట్టును ప్రకటించిన BCCI, 3 ప్లేయర్స్ బ్యాకప్| ABP Desam

Asia Cup Squad Announced: ఆసియా కప్ భారత జట్టును ప్రకటించిన BCCI, 3 ప్లేయర్స్ బ్యాకప్| ABP Desam