search
×

Stock Market Today: కొనసాగిన అమ్మకాలు! 19,450 కిందకు నిఫ్టీ - సెన్సెక్స్‌ 286 డౌన్‌

Stock Market Closing 04 October 2023: భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టపోయాయి. వరుసగా రెండో సెషన్లోనూ పతనం కొనసాగింది.

FOLLOW US: 
Share:

Stock Market Closing 04 October 2023:

భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టపోయాయి. వరుసగా రెండో సెషన్లోనూ పతనం కొనసాగింది. క్రూడాయిల్‌ ధరలు, డాలర్‌ ఇండెక్స్‌, వినియోగ ధరల ద్రవ్యోల్బణం పెరుగుదల వంటివి మార్కెట్లో నెగెటివ్‌ సెంటిమెంటు పెంచాయి. వీటికి తోడు ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ముఖ్యంగా బ్యాంకు, ఫైనాన్స్‌ షేర్లు విలవిల్లాడాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 92 పాయింట్లు తగ్గి 19,436 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 286 పాయింట్లు తగ్గి 65,226 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 పైసలు బలహీనపడి 83.24 వద్ద స్థిరపడింది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 65,512 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,330 వద్ద మొదలైంది. 64,878 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,332 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 286 పాయింట్లు తగ్గి 65,226 వద్ద ముగిసింది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

మంగళవారం 19,528 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 19,446 వద్ద ఓపెనైంది. 19,333 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,457 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 92 పాయింట్లు తగ్గి 19,436 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ తగ్గింది. ఉదయం 44,108 వద్ద మొదలైంది. 43,8౫౭ వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,161 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 435 పాయింట్ల నష్టంతో 43,964 వద్ద ముగిసింది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 11 కంపెనీలు లాభాల్లో 37 నష్టాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ (3.23%), నెస్లే ఇండియా (3.03%), ఐచర్‌ మోటార్స్‌ (1.63%), హిందుస్థాన్‌ యునీలివర్‌ (1.61%), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు (1.59%) షేర్లు లాభపడ్డాయి. యాక్సిస్‌ బ్యాంకు (4.72%), ఎస్బీఐ (2.94%), ఎన్టీపీసీ (2.38%), ఇండస్‌ఇండ్‌ బ్యాంకు (2.33%), బజాజ్‌ ఆటో (2.20%) నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, మీడియా, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకు, రియాల్టీ, ప్రైవేటు బ్యాంకు, హెల్త్‌కేర్‌ సూచీలు భారీగా పతనమయ్యాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.57,370 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.300 తగ్గి రూ.70,700 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.110 తగ్గి రూ.23,090 వద్ద ఉంది.

క్రితం సెషన్లో ఏం జరిగిందంటే?

భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. క్రూడాయిల్‌ ధరలు పెరగడం, ఐరోపా మార్కెట్లు పతనమవ్వడం ఇన్వెస్టర్లలో నెగెటివ్‌ సెంటిమెంటుకు దారితీసింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఆటో, ఆయిల్‌, ఫార్మా రంగాలు సెల్లింగ్‌ ప్రెజర్‌ ఎదుర్కొన్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 109 పాయింట్లు తగ్గి 19,528 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 316 పాయింట్లు తగ్గి 65,512 వద్ద ముగిశాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 04 Oct 2023 04:04 PM (IST) Tags: Nifty Stock Market Sensex

ఇవి కూడా చూడండి

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

టాప్ స్టోరీస్

Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు

Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు

Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం

AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం

Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్

Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్