Zomato: జొమాటో 'డెలివెరీ బాయ్' సంపాదన రోజుకు కోటి రూపాయలు
దీపిందర్ గోయల్ లో ప్రొఫైల్ మెయిన్‌టెయిన్ చేస్తాడు. ఎందుకంటే, అతనికి నత్తి ఉంది.
Zomato Delivery Boy: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెడితే, ఇంటి డోర్ దగ్గరకే ఆ ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చే జొమాటో జొమాటో డెలివెరీ బాయ్స్ గురించి దేశంలో చాలామందికి తెలుసు. ఇంటికి ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చినందుకు, ఒక్కో ఆర్డర్‌పై వాళ్లకు కొంత డబ్బు కమీషన్‌గా అందుతుంది. ఒక్కో జొమాటో డెలివెరీ బాయ్ నెలకు సగటున 40-50 వేల రూపాయల వరకు సంపాదిస్తాడు.
సీఈవో & డెలివెరీ బాయ్
జొమాటో ఫౌండర్ & CEO దీపిందర్ గోయల్ (Zomato Founder and CEO Deepinder Goyal) కూడా అప్పుడప్పుడు స్వయంగా ఆర్డర్లు డెలివెరీ చేస్తుంటాడు. కంపెనీ ప్రచారం కోసం, డెలివెరీ బాయ్ అవతారం ఎత్తి, ఇంటింటికి వెళ్లి ఆహారం అందజేస్తాడు. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో, తాను కూడా ఒక డెలివరీ బాయ్‌ని అని దీపిందర్ గోయల్ రాసుకున్నాడు.
దీపిందర్ గోయల్ జీవితం ఒక సినిమా స్టోరీకి ఏమాత్రం తక్కువ కాదు. తన లైఫ్‌లో వ్యక్తిగతంగా, వృత్తిగతంగా చాలా అడ్డంకులను అధిగమించి విజయం సాధించారు. అతని కంపెనీ త్వరలోనే లాభాల బాట పట్టే సూచనలు ఉన్నాయి. అతని సంపద విలువ 1 బిలియన్ డాలర్ల మార్క్ దాటింది. కొవిడ్ మహమ్మారి సమయంలో, తన డెలివరీ పార్ట్‌నర్స్ చదువుల ఫీజుల కోసం రూ. 700 కోట్ల విలువైన కంపెనీ షేర్లను విరాళంగా ఇచ్చి వార్తల్లో నిలిచాడు దీపిందర్ గోయల్. ఇప్పటివరకు చెఫ్‌కార్ట్, అన్‌అకాడెమీ సహా 16 స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టాడు.
బిలో యావరేజ్ స్టుడెంట్ - దిల్లీ ఐఐటీలో సీటు
దీపిందర్ గోయల్, పంజాబ్‌లోని ముక్త్‌సర్ జిల్లాలో జన్మించాడు. చదువుల్లో బిలో యావరేజ్ స్టుడెంట్. 8వ తరగతిలో, పరీక్ష ఇన్విజిలేటర్ అతనికి సాయం చేశాడు. ఆ తరగతిలో ఫెయిల్ అవ్వాల్సిన గోయల్, స్కూల్ స్థాయిలో 3వ ర్యాంక్ తెచ్చుకున్నాడు. ఇదే అతని జీవితంలో టర్నింగ్ పాయింట్. ఆ తరువాత, అతను తన స్కూల్ టాప్ ర్యాంక్ హోల్డర్లలో ఒకడిగా మారాడు. ఐఐటీ ప్రిపరేషన్ కోసం అతని కుటుంబ సభ్యులు గోయల్‌ను చండీగఢ్ పంపించారు. అయితే, అక్కడి సూపర్‌ఫాస్ట్ స్టుడెంట్స్‌తో పోటీ పడలేక కోచింగ్ మధ్యలోనే ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే, టార్గెట్ మాత్రం మిస్ కాలేదు, దిల్లీ ఐఐటీలో సీటు సంపాదించాడు.
దీపిందర్ గోయల్ లో ప్రొఫైల్ మెయిన్‌టెయిన్ చేస్తాడు. ఎందుకంటే, అతనికి నత్తి ఉంది. అందుకే, నలుగురిలో కలవడానికి, హైలైట్ అవ్వడానికి ఇష్టపడడు. తన నత్తిని వదిలించుకోవడానికి ప్రాక్టిస్ చేసి, కాలక్రమేణా మెరుగుపడ్డాడు. కానీ, ఇప్పటికీ కొన్ని అక్షరాలను స్పష్టంగా పలకలేడు.
రోజుకు కోటి రూపాయలు సంపాదన
జొమాటో 2021లో స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయింది. ఆ తర్వాత గోయల్ నికర విలువ 650 మిలియన్ డాలర్లకు (రూ. 5,345 కోట్లు) చేరుకుంది. ఆ సమయంలో, అతను కంపెనీలో అతనికి 4.7 శాతం వాటా ఉంది. ప్రస్తుతం కంపెనీ నుంచి ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోవడం లేదు. అయితే ESOPs (Employee Stock Ownership Plans) రూపంలో రూ. 358 కోట్లు అందుకున్నాడు. ఈ లెక్కన, రోజుకు కోటి రూపాయలు సంపాదించాడు.
ప్రస్తుతం, జొమాటో మార్కెట్ క్యాప్ రూ. 66,874 కోట్లు.
మరో ఆసక్తికర కథనం: మ్యూచువల్ ఫండ్స్‌లో SIP మాత్రమే కాదు, STP కూడా ఉంది తెలుసా?