By: ABP Desam | Updated at : 13 Jun 2023 03:08 PM (IST)
మ్యూచువల్ ఫండ్స్‌లో SIP మాత్రమే కాదు, STP కూడా ఉంది
Mutual Funds - STP: సాధారణంగా, ఒక విషయం మీద నిలకడలేని వారిని, అవకాశవాదులను "గోడ మీద పిల్లులు" అంటుంటారు. ఎవరినైనా విమర్శించడానికి ఈ పదాన్ని వాడుతుంటారు. స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే, గోడ మీద పిల్లి వాటమే కరెక్ట్. ఎందుకంటే, మార్కెట్‌ను బట్టి మన నిర్ణయాలను మార్చుకుంటుండాలి. గోడకు ఎటు వైపు అవకాశం ఉంటే అటు వైపు దూకాలి.
అసలు విషయానికి వద్దాం. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టే మార్గాల్లో ఎక్కువ ప్రాచుర్యం పొందిన పద్ధతి 'సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్' (SIP). దీంతోపాటు, "సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్" (Systematic Transfer Plan- STP) కూడా ఉంది. దీని గురించి చాలా మందికి తెలియదు. ఇంతకుముందు చెప్పుకున్నట్లు, 'గోడ మీద పిల్లి' వాటంతో వచ్చే ప్రయోజనాలను ఈ ప్లాన్ మనకు అందిస్తుంది.
STP ద్వారా, ఒక మ్యూచువల్ ఫండ్ పథకం నుంచి మరో మ్యూచువల్ ఫండ్‌లోకి జంప్ చేయవచ్చు. ఎక్కువ లాభాలను అందించే సెక్యూరిటీల్లోకి మారిపోవచ్చు. మార్కెట్ స్వింగ్ సమయంలో, నష్టపోయే పథకాల నుంచి లాభపడే పథకాల్లోకి పెట్టుబడిని మార్చుకోవచ్చు. మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి పెట్టుబడి మొత్తాలకు రక్షణ ఉంటుంది. సాధారణంగా, డెట్ ఫండ్ నుంచి ఈక్విటీ ఫండ్‌కు నిధుల బదిలీలు జరుగుతుంటాయి. ఇక్కడొక చిన్న పరిమితి ఉంది. ఒకే ఫండ్ కంపెనీ నిర్వహించే వివిధ స్కీమ్స్ మధ్య మాత్రమే ఈ బదిలీకి అవకాశం ఉంటుంది. వేరే అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు నిర్వహించే పథకాల్లోకి STP ద్వారా డబ్బు మళ్లించలేము.
STPలో కొన్ని రకాలు ఉన్నాయి:
ఫ్లెక్సిబుల్ STP: అవసరమైనప్పుడు బదిలీ చేయవలసిన మొత్తాన్ని పెట్టుబడిదారులే నిర్ణయిస్తారు. మార్కెట్ అస్థిరత, పథకం పనితీరు మీద అంచనాలను బట్టి, తన ప్రస్తుత ఫండ్‌లో ఎక్కువ వాటాను బదిలీ చేసుకోవచ్చు లేదా ఎక్కువ మొత్తాన్ని ప్రస్తుత ఫండ్‌లోనే ఉంచేయవచ్చు.
ఫిక్స్‌డ్ STP: ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి మరొకదానికి బదిలీ చేసే పెట్టుబడి మొత్తంలో మార్పు ఉండదు.
క్యాపిటల్ STP: ఒక ఫండ్‌లో వచ్చిన మొత్తం లాభాలు మరింత వృద్ధికి అవకాశం ఉన్న మరో పథకంలోకి బదిలీ అవుతాయి.
పన్ను కట్టాలా?
STP కింద బదిలీ చేసిన మొత్తంపై మూలధన లాభం (Capital gain) వస్తే పన్ను మినహాయింపు ఉంటుంది. STP మ్యూచువల్ ఫండ్స్ నుంచి మూడు సంవత్సరాల ముందే ఎగ్టిట్ అయితే వర్తించే స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను నుంచి కూడా మినహాయింపు పొందొచ్చు. మూడేళ్లు దాటాక ఎగ్జిట్ అయితే వర్తించే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (Long term capital gains tax) నుంచి కూడా మినహాయింపులను పొందే అవకాశం ఉన్నా, పెట్టుబడిదార్ల వార్షిక ఆదాయం మీద అది ఆధారపడి ఉంటుంది.
ఎంట్రీ - ఎగ్జిట్ ఛార్జెస్
STP మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి పెట్టడానికి కనీస మొత్తాన్ని సెబీ నిర్ణయించకపోయినా, చాలా ఫండ్ హౌస్‌లు కనీస పెట్టుబడిగా రూ. 12,000 నిర్ణయించాయి. పెట్టుబడిదారుడు కనీసం ఆరు ఫండ్ ట్రాన్స్‌ఫర్స్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. వాటి మీద ఎంట్రీ లోడ్ ఉండదు గానీ, ఎగ్జిట్ ఛార్జ్ ఉంటుంది. పెట్టుబడులు బదిలీ చేసే సమయంలో గరిష్టంగా 2% మొత్తాన్ని ఎగ్జిట్ ఫీజుగా వసూలు చేస్తారు. లిక్విడ్ ఫండ్ నుంచి ఈక్విటీ ఫండ్‌కి నిధులను బదిలీ చేస్తే ఎగ్జిట్ లోడ్ ఛార్జెస్ ఉండవు.
మరో ఆసక్తికర కథనం: వారెవ్వా, 'లక్ష'ణమైన రికార్డ్ - రిలయన్స్, టీసీఎస్‌కూ ఇది చేతకాలేదు
Investment Tips: పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
RBI TRAI SMS : 127000 నంబర్ నుంచి ఏదైనా SMS వచ్చిందా! ఇంతకీ ఈ మెసేజ్ ఎవరు పంపుతున్నారు ?
Year Ender 2025: ఈ ఏడాదిలో RBI ఎప్పుడెప్పుడు రెపో రేటు తగ్గించింది? ప్రజలకు ఎలా ఉపశమనం కలిగించింది?
SIP Benefits : కేవలం రూ. 2000 SIPతో 5 కోట్ల రూపాయల భారీ కార్పస్‌ను ఎలా తయారు చేయాలి? ఏ ఫండ్ మంచి రాబడి ఇస్తోంది?
Post Office RD Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో రోజుకు రూ.333 ఆదా చేస్తే మీరే లక్షాధికారి!
Trending Jobs In 2025: ఈ ఉద్యోగాలకు ఏడాది పొడవునా డిమాండ్.. మార్కెట్లో ఈ రంగాలకు తగ్గని ఆదరణ
Sahana Sahana Song : 'ది రాజా సాబ్' నుంచి కూల్ మెలోడి సాంగ్ - 'సహానా సహానా' ప్రోమో చూశారా?
CM Revanth Reddy: తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
Movie Shootings Famous Tree: సినిమా చెట్టు బతికిందోచ్.. ప్రాణం పెట్టి కాపాడితే రిజల్ట్ ఎలా ఉందో చూశారా..