By: ABP Desam | Updated at : 19 Jan 2023 12:20 PM (IST)
Edited By: Arunmali
ఈ కార్ మోడల్స్ మీ దగ్గర ఉంటే వెంటనే కంపెనీకి తిప్పి పంపండి
Maruti Suzuki: రీసెంట్‌గా మారుతి సుజుకి కార్లు కొన్నవాళ్లకు ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్.
మారుతి ఆల్టో K10 (Maruti Alto K10), బ్రెజా (Maruti Brezza), బ్యాలెనో (Maruti Baleno), ఎస్-ప్రెసో (Maruti S-presso), ఈకో (Maruti Suzuki Eeco), గ్రాండ్ విటారా (Maruti Grand Vitara) మోడళ్ల కార్లలో ఎయిర్ బ్యాగ్ (Maruti Car Air bag) కంట్రోలర్‌లో లోపం ఉండే అవకాశం ఉన్నట్లు కంపెనీ గుర్తించింది. ఇది సంబంధిత కస్టమర్లకు బ్యాడ్ న్యూస్.
మొత్తం 17,362 కార్ల రీకాలింగ్
అయితే, పైన చెప్పుకున్న మోడళ్లలోని అన్ని కార్లలో కాకుండా, కొన్ని బ్యాచ్‌ల కార్లలోనే ఈ లోపానికి అవకాశం ఉందని చెబుతోంది. లోపం ఉన్న కార్లను గుర్తిస్తున్న మారుతి సుజుకీ, మొత్తం 17,362 కార్లను వెనక్కు (Cars Recall) పిలిపించే ప్రయత్నాల్లో ఉంది. అంటే, ఆయా కార్ల యజమానులను గుర్తించి, కార్లను తెచ్చి అప్పగించమని అడుగుతుంది. ఈ ప్రాసెస్ ఇప్పటికే స్టార్టయింది. కంపెనీకి తిరిగి తీసుకొచ్చిన కార్ల ఎయిర్ బ్యాగ్ కంట్రోలర్‌లో లోపాన్ని సవరించి, తగిన మార్పులు చేసి తిరిగి కస్టమర్లకు అప్పగిస్తామని మారుతి సుజుకీ ప్రకటించింది. ఇది గుడ్ న్యూస్.
గత సంవత్సరం (2022) డిసెంబరు 8వ తేదీ నుంచి ఈ సంవత్సరం (2023) జనవరి 12వ తేదీ మధ్య తయారైన కార్ల ఎయిర్ బ్యాగ్ కంట్రోలర్లలో లోపం ఉండే అవకాశం ఉందని మారుతి సుజుకి వెల్లడించింది.
కార్ల ఎయిర్ బ్యాగ్ కంట్రోలర్‌ను తనిఖీ చేయడం దగ్గర నుంచి, ఒకవేళ ఏదైనా లోపం ఉంటే దానిని సవరించి తిరిగి కస్టమర్‌కు అప్పగించడం వరకు అన్ని పనులూ పూర్తి ఉచితంగా చేస్తామని, ఒక్క రూపాయి కూడా వసూలు చేయబోమని మారుతి సుజుకి తెలిపింది.
ఒకవేళ కార్లలో ఈ లోపం ఉండి, దానిని మరమ్మతు చేయకపోతే.. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్‌లు, సీట్‌బెల్ట్‌లు పని చేయకపోవచ్చని, ఇది కూడా అరుదుగా జరుగుతుందని మారుతి సుజుకీ వెల్లడించింది. 2022 డిసెంబరు 8వ తేదీ నుంచి 2023 జనవరి 12వ తేదీల మధ్య తయారైన కార్లను కొన్న వారికి కంపెనీ నుంచి కాల్ వస్తుందని తెలిపింది. అశ్రద్ధ చేయకుండా తక్షణం కార్లను తెచ్చి కంపెనీకి అప్పగించమని కోరింది. ఒకవేళ ఆ కార్ ఎయిర్ బ్యాగ్ కంట్రోలర్‌లో లోపం ఉందని తేలితే, ఆ లోపాన్ని సరి చేసే వరకు కార్లను నడపొద్దని కంపెనీ సూచించింది.
రెండోసారి రేట్లు పెంచిన మారుతి
ఈ నెల 16వ తేదీ (జనవరి 16, 2023) నుంచి అన్ని మోడళ్ల ధరలను మారుతి సుజుకి పెంచింది. కార్ రేట్లను ఈ కంపెనీ పెంచడం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది రెండోసారి. 2022 ఏప్రిల్‌లో నెలలో రేట్లు పెంచింది. మోడల్‌ను బట్టి.. 1.1 శాతం వరకు మారుతి కారు ధర పెరిగింది. వాహనం తయారీకి ఉపయోగించే ముడి వస్తువుల ధరలు పెరగడంతో పాటు, కొత్త ఉద్గార ప్రమాణాలను అమలు చేయడం కోసం వాహనాల్లో మార్పులు చేయాల్సి వచ్చినందున మరోమారు పెంపు తప్పడం లేదని మారుతి సుజుకి ప్రకటించింది.
Stocks to watch 01 February 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - ఫోకస్లో Adani Enterprises, Sun Pharma
ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ముందుకు బడ్జెట్ 2023- పూర్తి షెడ్యూల్ ఇదే!
Union Budget Live 2023 Updates: సీతమ్మ బడ్జెట్ మురిపిస్తుందా? ఉసురుమనిపిస్తుందా?
Petrol-Diesel Price 01 February 2023: తెలుగు నగరాల్లో తగ్గిన చమురు ధరలు, మీ ప్రాంతంలో ఇవాళ్టి రేటు ఇది
Gold-Silver Price 01 February 2023: బడ్జెట్ ఎఫెక్ట్ - తగ్గిన పసిడి, వెండి రేటు
Etala Vs Kousik Reddy : ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ - పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?
Brahmanandam : స్టార్ హీరోలకు హిట్లు ఇచ్చిన బ్రహ్మానందం - ఆయన లేని ఈ సినిమాలను ఊహించుకోగలమా?
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ