అన్వేషించండి

LIC Q4 Results: ఎల్‌ఐసీ డివిడెండ్‌ ప్రకటించగానే షేరు ధర ఎలా తగ్గిందంటే?

LIC Q4 Results: ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. 2021-22 ఆర్థిక ఏడాదిలో జనవరి-మార్చి క్వార్టర్లో రూ.2,371 కోట్ల లాభాన్ని నమోదు చేసింది.

LIC Q4 Results Net Profit Falls 18 Per Cent, Insurer Declares Dividend Of Rs 1.5 : ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. 2021-22 ఆర్థిక ఏడాదిలో జనవరి-మార్చి క్వార్టర్లో రూ.2,371 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలోని రూ.2,893 కోట్లతో పోలిస్తే 18 శాతం తగ్గింది. అయితే 2021 ఏడాది చివరి క్వార్టర్‌ ఫలితాలు సంవత్సరం మొత్తాన్ని ప్రతిబింబిస్తాయి కాబట్టి ఈ రెండు ఫలితాలను పోల్చొద్దని కంపెనీ వివరించింది.

'ఎల్‌ఐసీ Q4FY21లో రూ.2,893 కోట్ల లాభం ఆ సంవత్సరం మొత్తానికి చెందుతుంది. ఎందుకంటే అప్పటి వరకు కంపెనీ ఏడాదికోసారి మాత్రమే ఫలితాలను ప్రకటించేది. అందుకే ఇప్పటి ఫలితాలను అప్పటితో పోల్చడం సరికాదు. 2022లో కంపెనీ పన్నులు చెల్లించిన తర్వాత రూ.4,043 కోట్ల లాభం నమోదు చేసింది. గతేడాది రూ.2900 కోట్లతో పోలిస్తే 39 శాతం పెరిగింది. వచ్చే ఏడాది నుంచి త్రైమాసిక ఫలితాలను పోల్చేందుకు డేటా పాయింట్స్‌ దొరుకుతాయి' అని ఎల్‌ఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజ్‌ కుమార్‌ అన్నారు.

2022 ఆర్థిక ఏడాదిలో ఎల్‌ఐసీ రూ.4,043 కోట్ల నికర లాభం నమోదు చేసింది. వార్షిక ప్రాతిపదికన గతేడాది రూ.2900 కోట్ల లాభంతో పోలిస్తే 39.4 శాతం పెరిగింది. స్టాక్‌ మార్కెట్లో నమోదైన తర్వాత ఎల్‌ఐసీ త్రైమాసిక ఫలితాలను ప్రకటించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లకు కంపెనీ డివిడెండ్‌ను (LIC dividend) ప్రకటించింది. రూ.10 ఫేస్‌వాల్యూ కలిగిన ఒక్కో షేరుకు రూ.1.50 వరకు డివిడెండ్‌ ఇవ్వనుంది. ఈ లెక్కన ప్రభుత్వానికి రూ.916 కోట్ల ఆదాయం వస్తుంది. 

మంగళవారం మధ్యాహ్నం ఎల్‌ఐసీ షేరు ధర రూ.816 వద్ద ట్రేడ్‌ అవుతోంది. రూ.21 నష్టంతో ఉంది. ఉదయం రూ.810 వద్ద ఓపెనైన స్టాక్‌ రూ.822 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. రూ.810 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం కంపెనీ విలువ రూ.5.16 లక్షల కోట్లుగా ఉంది. 52 వారాల గరిష్ఠ ధర రూ.918 కాగా కనిష్ఠ ధర రూ.801గా ఉంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by LIC of India (@licindiaforever)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
Sankranti Celebrations: మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
Publicity gold:  కోటి రూపాయల పతంగి అంట  - నమ్మేద్దామా ?
కోటి రూపాయల పతంగి అంట - నమ్మేద్దామా ?
CM Chandrababu: సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా దేవాన్ష్, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా దేవాన్ష్, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Haimendorf Museum Tour Marlawai | గిరిజనుల పాలిట దేవుడు హైమన్ డార్ఫ్ జీవిత ప్రయాణం ఒకచోటే | ABPKhanapur MLA Vedma Bojju Interview | Haimendorf చేసిన సేవలు ఎన్ని తరాలైన మర్చిపోలేం | ABP DesamSobhan Babu Statue In Village | చిన నందిగామ లో శోభన్ బాబుకు చిన్న విగ్రహం పెట్టుకోలేమా.? | ABP DesamAjith Kumar Team Wins in 24H Dubai Race | దుబాయ్ కార్ రేసులో గెలిచిన అజిత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
Sankranti Celebrations: మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
Publicity gold:  కోటి రూపాయల పతంగి అంట  - నమ్మేద్దామా ?
కోటి రూపాయల పతంగి అంట - నమ్మేద్దామా ?
CM Chandrababu: సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా దేవాన్ష్, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా దేవాన్ష్, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
Cockfight: కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా
కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా
WhatsApp Ban: వాట్సాప్ ఇలా చేస్తున్నారా? - మీ అకౌంట్ బ్యాన్ చేస్తారు జాగ్రత్త!
వాట్సాప్ ఇలా చేస్తున్నారా? - మీ అకౌంట్ బ్యాన్ చేస్తారు జాగ్రత్త!
Padi Kaushik Reddy : కలెక్టరేట్ లో మరో ఎమ్మెల్యేతో వాగ్వాదం - పాడి కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదు
కలెక్టరేట్ లో మరో ఎమ్మెల్యేతో వాగ్వాదం - పాడి కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదు
Vishnu Manchu: తిరుపతిలో 120 మంది అనాథలను దత్తత తీసుకున్న విష్ణు మంచు... విద్యావంతులను చేసే బాధ్యత కూడా!
తిరుపతిలో 120 మంది అనాథలను దత్తత తీసుకున్న విష్ణు మంచు... విద్యావంతులను చేసే బాధ్యత కూడా!
Embed widget