అన్వేషించండి

LIC WhatsApp Services: ఇకపై వాట్సాప్‌ ద్వారా ఎల్‌ఐసీ సేవలు - ఇంట్లోంచే అందుకోండిలా!

దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది కస్టమర్ల కోసం వాట్సాప్‌ ద్వారా సేవలను ఎల్‌ఐసీ ప్రారంభించింది. దీని ద్వారా ఆ సంస్థ నుంచి సేవలు పొందడం మరింత సులభం అవుతుంది.

LIC WhatsApp Services: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ అనగానే అందరికీ గుర్తొచ్చేది లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషనే (LIC). ప్రైవేట్‌ సెక్టార్‌లోని చాలా బ్యాంకులు, సంస్థలు జీవిత బీమా అందిస్తున్నా, అవేవీ ఎల్‌ఐసీకి పోటీ కావు. ఎందుకంటే, జీవిత బీమా మార్కెట్‌లో ఎల్‌ఐసీకి 60 శాతం వాటా పైనే ఉంది. దేశంలో కోట్లాది మందికి కనీసం ఒక్క ఎల్‌ఐసీ పాలసీ అయినా ఉంటుంది.

దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది కస్టమర్ల కోసం వాట్సాప్‌ ద్వారా సేవలను ఎల్‌ఐసీ ప్రారంభించింది. దీని ద్వారా ఆ సంస్థ నుంచి సేవలు పొందడం మరింత సులభం అవుతుంది. తన రిజిస్టర్డ్ పాలసీదారుల కోసం శుక్రవారం నుంచి (02.12.2022) ఈ తరహా మొట్టమొదటి ఇంటరాక్టివ్ సేవను కంపెనీ ప్రారంభించింది.

ఎల్‌ఐసీ సేవలను వాట్సాప్‌లో ఎలా యాక్టివేట్ చేయాలి?

కస్టమర్‌ పోర్టల్‌లో పాలసీని నమోదు చేసుకున్న వినియోగదారు మొబైల్ నంబర్ 8976862090కి "Hi" అని మాత్రమే సందేశం పంపాలి. ఆ తర్వాత క్లయింట్‌కు చాట్‌బాట్ ద్వారా 11 సర్వీస్‌ ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి. ప్రతి సర్వీస్‌ ఆప్షన్‌కు ఒక నంబర్‌ ఉంటుంది. ఏ సేవ కావాలని మీరు కోరుకుంటారో, ఆ సేవకు ఎదురుగా ఉన్న నంబర్‌ను వాట్సాప్‌ ద్వారా పంపితే సరి. 

వాట్సాప్‌ ద్వారా అందుబాటులో ఉన్న సేవల జాబితా ఇది:

ప్రీమియం బకాయి
బోనస్ సమాచారం
పాలసీ స్థితి
మీ ప్రస్తుత పాలసీ మీద ఎంత రుణం తీసుకోవచ్చు?
రుణం తిరిగి చెల్లింపు
రుణం మీద వడ్డీ బకాయి
ప్రీమియం చెల్లింపు పత్రం
యులిప్‌ - యూనిట్ల స్టేట్‌మెంట్‌
ఎల్‌ఐసీ సేవలకు సంబంధించిన లింక్‌లు
ఆప్ట్‌ ఇన్‌ /ఆప్ట్ ఔట్ సేవలు

ఎల్‌ఐసీ పోర్టల్‌లో తమ పాలసీ ప్లాన్లను నమోదు చేసుకున్న పాలసీదారులకు మాత్రమే ఎల్‌ఐసీ వాట్సాప్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. మీకు ఒక ఎల్‌ఐసీ పాలసీ ఉండి, ఇంట్లోంచి కదలకుండా వాట్సాప్‌ ద్వారా కంపెనీ సేవలను అందుకోవాలంటే, ముందుగా www.licindia.in లో ఉన్న కస్టమర్ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి.

ఎల్‌ఐసీ పోర్టల్‌లో ఎల్‌ఐసీ పాలసీని ఎలా నమోదు చేసుకోవాలి?

స్టెప్‌ 1: www.licindia.in ని సైట్‌లోకి వెళ్లి, “కస్టమర్ పోర్టల్”పై క్లిక్ చేయండి
స్టెప్‌ 2: కస్టమర్ పోర్టల్ కోసం గతంలో మీరు రిజిస్టర్ చేసుకోకుంటే, “న్యూ యూజర్” బటన్‌ మీద క్లిక్ చేయండి
స్టెప్‌ 3: ఈ కింది వివరాలు అందించండి:
స్టెప్‌ 4: యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ క్రియేట్‌ చేసుకుని, అవసరమైన మొత్తం సమాచారాన్ని అందించండి. ఇప్పుడు మీరు పోర్టల్‌లో రిజిస్టర్‌ అయినట్లే.
స్టెప్‌ 5: ఇప్పుడు "ఈ-సర్వీసెస్" ట్యాబ్‌ను క్లిక్ చేయండి. మీ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఉపయోగించి లాగిన్ చేయండి. ఈ-సేవలను ఉపయోగించుకునేందుకు మీ పాలసీను అక్కడ కనిపించే ఫారంలో నింపండి.
స్టెప్‌ 6: ఫారంను ప్రింట్ తీసి, దాని మీద సంతకం చేసి, సంతకం చేసిన ఫారాన్ని స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి.
స్టెప్‌ 7: పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ లేదా పాస్‌పోర్ట్ స్కాన్ చేసిన కాపీని కూడా అప్‌లోడ్ చేయండి.
స్టెప్‌ 8: ఎల్‌ఐసీ ఆఫీసు దానిని ధృవీకరించుకుంటుంది. మీకు ఒక రిసిప్ట్‌ ఈ-మెయిల్, SMS ద్వారా అందుతుంది. ఇప్పుడు మీరు ఈ-సేవలను పొందేందుకు సిద్ధంగా ఉన్నట్లే.
స్టెప్‌ 9: ఇప్పుడు సబ్మిట్‌ బటన్‌ మీద క్లిక్ చేయండి
స్టెప్‌ 11: మీరు మళ్లీ లాగిన్ అయితే, 'బేసిక్‌ సర్వీసెస్‌' > "యాడ్‌ పాలసీ" ఆప్షన్‌ మీద క్లిక్ చేయండి
స్టెప్‌ 12: మీ మిగిలిన పాలసీలన్నింటినీ నమోదు చేయండి.

అంతే, వాట్సాప్‌ సేవలు అందుకోవడానికి మీరు సిద్ధం.

టాప్ హెడ్ లైన్స్

UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Personal Loan Interest Rates: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? టాప్ బ్యాంకుల వడ్డీ రేట్లు, కీ ఫ్యాక్టర్స్ మీ కోసం!
పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? టాప్ బ్యాంకుల వడ్డీ రేట్లు, కీ ఫ్యాక్టర్స్ మీ కోసం!
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
Chandrababu Naidu CII Partnership Summit: గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా ఏపీ - న్యూఢిల్లీ సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటన!
గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా ఏపీ - న్యూఢిల్లీ సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటన!

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
Director Maruthi: రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Embed widget