By: ABP Desam | Updated at : 27 Dec 2022 04:03 PM (IST)
Edited By: Arunmali
రోజుకు కేవలం ₹121 కట్టండి, ₹27 లక్షలతో మీ కుమార్తె పెళ్లిని ఘనంగా చేయండి
LIC Policy: దేశంలోనే అతి పెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Life Insurance Corporation of India- LIC), ప్రజల కోసం ఎప్పటికప్పుడు వివిధ రకాల కొత్త బీమా పాలసీలను తీసుకొస్తూనే ఉంటుంది, పాత పాలసీలకు సైతం మెరుగు అద్ది ఆకర్షణీయమైన పథకాలు మారుస్తుంది. ఈ కోవలో, ఆడపిల్లల తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు ఆర్థిక సాయంగా ఉండే ఒక పథకాన్ని ప్రకటించింది.
మీ కుమార్తె వివాహం ఏ లోటు లేకుండా, ఘనంగా చేయాలని మీరు భావిస్తే... అందుకు అవసరమైన డబ్బును మీకు అందించే ఎల్‌ఐసీ పథకం ఇది. ఎల్‌ఐసీ అమలు చేస్తున్న ఈ పథకం పేరు LIC కన్యాదాన్ పాలసీ.
LIC కన్యాదాన్ పాలసీని తీసుకోవాలంటే, తండ్రి వయస్సు కనీసం 30 సంవత్సరాలు & కుమార్తె కనీస వయస్సు 1 సంవత్సరం ఉండాలి. ఈ ప్లాన్ 25 ఏళ్ల పాటు అందుబాటులో ఉంటుంది. మీ కుమార్తె వయస్సు ప్రకారం పాలసీ కాల పరిమితి తగ్గుతుంది.
పాలసీ కనిష్ట మెచ్యూరిటీ వ్యవధి 13 సంవత్సరాలు, గరిష్ట సమయం 30 సంవత్సరాలు. ఆధార్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రం, గుర్తింపు కార్డు, జనన ధృవీకరణ పత్రాలు చేతిలో ఉంటే చాలు, LIC కన్యాదాన్ పాలసీని పొందవచ్చు.
దరఖాస్తుదారు రోజుకు ₹121 చొప్పున, నెలకు ₹3,600 డిపాజిట్ చేయవచ్చు. 25 సంవత్సరాల తర్వాత, మెచ్యూరిటీ సమయంలో రూ. 26.75 లక్షలు మీరు పొందుతారు. రోజుకు ₹121 చొప్పునే కట్టాల్సిన అవసరం లేదు. మీకు కావాలంటే, దీని కంటే తక్కువ మొత్తం లేదా ఎక్కువ మొత్తం ప్రీమియంలు కూడా చెల్లించవచ్చు. మీ సౌలభ్యం ప్రకారం... ప్రీమియంను ప్రతిరోజూ లేదా 6 నెలలకు ఒకసారి లేదా 4 నెలలకు ఒకసారి లేదా ప్రతి నెలా చెల్లించవచ్చు.
ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ మరికొన్ని వివరాలు:
ఈ పాలసీ మెచ్యూరిటీ తేదీకి ముందు 3 సంవత్సరాల వరకు లైఫ్ రిస్క్ కవర్‌ని అందిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో, పాలసీదారుకు ఒకేసారి మొత్తం డబ్బు ఇస్తారు.
LIC కన్యాదాన్ పాలసీ ప్రకారం, పాలసీదారు చనిపోతే ఇక ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రమాదంలో పాలసీదారు మరణిస్తే అతని కుటుంబానికి రూ. 10 లక్షలు అందజేస్తారు. పాలసీదారుది సహజ మరణం అయితే, ఆ సందర్భంలో రూ. 5 లక్షలు LIC అందిస్తారు.
భారతదేశం వెలుపల నివసిస్తున్న భారతీయ పౌరులు కూడా LIC కన్యాదాన్ పాలసీ ప్రయోజనాలను పొందవచ్చు.
పాలసీని కొన్న తేదీ నుంచి పాలసీ హోల్డర్‌కు 15 రోజుల ఫ్రీ లుక్ పిరియడ్ అందుబాటులో ఉంటుంది. పాలసీలోని ఏవైనా నిబంధనలు, షరతులతో పాలసీదారు సంతృప్తి చెందకపోతే, అతను/ఆమె పాలసీ నుంచి నిష్క్రమించవచ్చు. మీరు కట్టిన డబ్బు తిరిగి వస్తుంది.
వార్షిక, త్రైమాసిక చెల్లింపుల్లో 30 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. నెలవారీ చెల్లింపులకు 15 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఈ గ్రేస్ పిరియడ్‌లో పాలసీదారు నుంచి ఎలాంటి ఆలస్య రుసుము వసూలు చేయరు. గ్రేస్ పీరియడ్ గడువు ముగిసే తేదీకి కూడా ప్రీమియం చెల్లించకపోతే, ఆ పాలసీ రద్దవుతుంది.
పాలసీదారు 3 సంవత్సరాల పాటు ప్రీమియంలు చెల్లించిన తర్వాత ఈ ప్లాన్ కింద పాలసీని సరెండర్ చేయడానికి అనుమత ఉంటుంది.
ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 80C కింద LIC కన్యాదాన్ ప్రీమియం మీద మీకు మినహాయింపు లభిస్తుంది. ఈ మినహాయింపు ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పొందవచ్చు. దీంతోపాటు, సెక్షన్ 10(10D) కింద మెచ్యూరిటీ లేదా డెత్ క్లెయిమ్ మొత్తం మీద కూడా మినహాయింపు ఉంటుంది.
Sukanya Samriddhi Yojana: మీ కుమార్తెకు సురక్షిత భవిష్యత్ + మీకు పన్ను మినహాయింపు - ఈ స్కీమ్‌తో రెండూ సాధ్యం
Tata Cars Price Hikes: టాటా మోటార్స్ కార్ల ధరలు పెరుగుతున్నాయి, ఫిబ్రవరి నుంచి రేట్ల వాత
Hyderabad G-20 Startup 20 Inception : స్టార్టప్ వ్యవస్థను మరింతగా ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటి- కిషన్ రెడ్డి
LIC Adani Shares: అదానీ వల్ల మీకు-నాకే కాదు, ఎల్ఐసీకి కూడా భారీ నష్టం, రెండ్రోజుల్లో ₹16,580 కోట్లు పోయాయి
Bank Strike: జనవరి 30, 31 తేదీల్లో బ్యాంకులు పని చేస్తాయా, సమ్మెపై ఏ నిర్ణయం తీసుకున్నారు?
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
CBI Case Avinash Reddy : సీబీఐ ఎదుట హాజరైన అవినాష్ రెడ్డి - ముందుగా వైఎస్ విజయలక్ష్మితోనూ భేటీ !
Minister Harish Rao : వరంగల్ హెల్త్ సిటీ దేశానికే ఒక మోడల్, దసరా నాటికి నిర్మాణం పూర్తి- మంత్రి హరీశ్ రావు
Mylavaram Politics : మైలవరంలో వసంత సైలెంట్ అయ్యారా? సైలెంట్ గా వర్క్ చేస్తున్నారా?