News
News
వీడియోలు ఆటలు
X

LIC: ఎల్‌ఐసీ లిస్టింగ్‌కు సరిగ్గా సంవత్సరం - ₹2.5 లక్షల కోట్ల షాక్‌, బలిపశువులు రిటైల్‌ ఇన్వెస్టర్లు

షేర్ల ఫ్రీ ఫ్లోట్ తక్కువగా ఉన్న కారణంగా నిఫ్టీ లేదా సెన్సెక్స్‌లోకి అడుగు పెట్టలేకపోయింది.

FOLLOW US: 
Share:

LIC Share Price: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ను (LIC) ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్‌ మార్కెట్‌లో "గేమ్‌ఛేంజర్" అన్నారు, మెగా ఐపీవో అన్నారు. ఆ కంపెనీ షేర్లు మాత్రం సంపద విధ్వంసం సృష్టించాయి. రిటైల్‌ ఇన్వెస్టర్ల ఫేట్‌ను పెటాకులు చేసి, మెగా ఫ్లాప్‌గా నిలిచాయి.

సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజున (17 మే 2022) LIC షేర్లు లిస్ట్‌ అయ్యాయి. IPOలో ఒక్కో షేరును రూ. 949 ధరకు ఈ కంపెనీ జారీ చేసింది. ఇప్పుడు ఒక్కో షేర్‌ ధర రూ. 567కు పడిపోయింది. అంటే, IPO స్థాయి నుంచి దాదాపు 40% తగ్గింది. ఈ ఏడాది కాలంలో దీని మార్కెట్ విలువ రూ. 2.5 లక్షల కోట్లు ఆవిరైంది.

లిస్టింగ్ తర్వాత కూడా LICలో కేంద్ర ప్రభుత్వానికి 96.5% వాటా ఉంది. దీంతో, స్టాక్ ఫ్రీ ఫ్లోట్ చాలా తక్కువగా ఉంది. మార్కెట్‌ విలువ పరంగా టాప్-15 కంపెనీల్లో ఒకటిగా ఉన్నప్పటికీ, షేర్ల ఫ్రీ ఫ్లోట్ తక్కువగా ఉన్న కారణంగా నిఫ్టీ లేదా సెన్సెక్స్‌లోకి అడుగు పెట్టలేకపోయింది.

పక్కకు తప్పుకున్న బిగ్‌ బాయ్‌
లిస్టింగ్‌ నాటి నుంచి ఈ లైఫ్ ఇన్సూరర్ ఒక ప్రిడేటర్‌గా మారడంతో, బిగ్‌ బాయ్స్‌ (మ్యూచువల్ ఫండ్స్‌, FIIలు) దీన్నుంచి పారిపోవడం మొదలు పెట్టారు, ఈ కౌంటర్‌లో వాటాలు తగ్గించుకున్నారు. 2022 జూన్‌లో, ఎల్‌ఐసీలో మ్యూచువల్ ఫండ్స్ యాజమాన్యం 0.74% నుంచి 2023 మార్చి నాటికి క్రమంగా తగ్గుతూ 0.63%కి చేరింది. ఇదే కాలంలో ఫారిన్‌ ఇన్వెస్టర్లు కూడా తమ వాటాను 0.12% శాతం నుంచి 0.08%కి తగ్గించుకున్నారు. ఈ సంపద విధ్వంసకర స్టాక్‌కు బలయింది రిటైల్‌ ఇన్వెస్టర్లే. 2022 జూన్‌లో, ఎల్‌ఐసిలో అమాయక రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటా 1.88%గా ఉంటే, దానిని ప్రతి త్రైమాసికానికి పెంచుకుంటూ వెళ్లారు. 2023 మార్చి నాటికి వీళ్ల వాటా 2.04%కు పెరిగింది. 

తగ్గిన రిటైల్‌ ఇన్వెస్టర్ల నంబర్‌
విచిత్రం ఏంటంటే, ఎల్‌ఐసీలో రిటైల్‌ ఇన్వెస్టర్ల సంఖ్య IPOతో సమయంతో పోలిస్తే ఇప్పుడు తగ్గింది. IPO సమయంలో ఎల్‌ఐసీలో 39.89 లక్షల మంది ఇన్వెస్టర్లు ఉన్నారు. ప్రస్తుతం వాళ్ల నంబర్‌ 6.87 లక్షలు తగ్గి 33 లక్షలకు దిగి వచ్చింది. ప్రారంభంలో ఎల్‌ఐసీ షేర్లు కొన్న చాలామంది చిన్న ఇన్వెస్టర్లు, నష్టాలను తగ్గించుకోవడానికి, స్టాక్‌ ధర పడినప్పుడల్లా షేర్లు కొని యావరేజ్‌ చేయడానికి ప్రయత్నించారు. LIC ఏనుగు ఏదో ఒక రోజు డ్యాన్స్ చేయడం ప్రారంభిస్తుందన్నది వాళ్ల ఆశ.

ఇది కూడా చదవండి: అవి షేర్లా, రాకెట్లా? లాస్‌ మార్కెట్‌లోనూ ఇంత క్లాస్‌గా పెరిగాయేంటి బాసూ! 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 17 May 2023 02:20 PM (IST) Tags: Lic IPO Investors LIC Lic Stock Performance

సంబంధిత కథనాలు

Stock Market News: మార్కెట్లో బుల్‌ రన్‌! 18,614 మీదే కొనసాగుతున్న నిఫ్టీ!

Stock Market News: మార్కెట్లో బుల్‌ రన్‌! 18,614 మీదే కొనసాగుతున్న నిఫ్టీ!

Gold-Silver Price Today 05 June 2023: పసిడి రేటు స్థిరం - ఇవాళ బంగారం, వెండి ధరలు

Gold-Silver Price Today 05 June 2023: పసిడి రేటు స్థిరం - ఇవాళ బంగారం, వెండి ధరలు

Nissan Magnite Discount: నిస్సాన్ మ్యాగ్నైట్‌పై భారీ డిస్కౌంట్ - కొనాలంటే ఇదే రైట్ టైం!

Nissan Magnite Discount: నిస్సాన్ మ్యాగ్నైట్‌పై భారీ డిస్కౌంట్ -  కొనాలంటే ఇదే రైట్ టైం!

Upcoming Cars: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

Upcoming Cars: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

TDS: ఏ పోస్టాఫీసు పథకాల్లో TDS కట్‌ అవుతుంది, వేటికి మినహాయింపు ఉంది?

TDS: ఏ పోస్టాఫీసు పథకాల్లో TDS కట్‌ అవుతుంది, వేటికి మినహాయింపు ఉంది?

టాప్ స్టోరీస్

Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"

Bandi Sanjay on TDP:

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Wrestlers Protest: బ్రిజ్‌ భూషణ్‌పై స్టేట్‌మెంట్‌ వెనక్కి తీసుకున్న మైనర్ రెజ్లర్, ఇంతలోనే ఏం జరిగింది?

Wrestlers Protest: బ్రిజ్‌ భూషణ్‌పై స్టేట్‌మెంట్‌ వెనక్కి తీసుకున్న మైనర్ రెజ్లర్, ఇంతలోనే ఏం జరిగింది?

Rahul Gandhi: వెనుక అద్దం చూస్తూ ఇండియా కారును ప్రధాని నడుపుతున్నారు, మోదీపై రాహుల్ గాంధీ సెటైర్లు

Rahul Gandhi: వెనుక అద్దం చూస్తూ ఇండియా కారును ప్రధాని నడుపుతున్నారు, మోదీపై రాహుల్ గాంధీ సెటైర్లు