అన్వేషించండి

L&T at Rs.3 trn mark: ₹3 లక్షల కోట్ల మార్క్‌ దాటిన L&T, రికార్డ్‌ క్రియేట్‌ చేసిన షేర్లు

రూ.3.01 ట్రిలియన్ మార్కెట్ క్యాప్‌తో, మొత్తం మార్కెట్ క్యాప్ ర్యాంకింగ్‌లో 20వ స్థానంలో L&T నిలిచింది.

L&T at Rs.3 trn mark: లార్సెన్ & టూబ్రో (L&T) BSEలో రూ.3 ట్రిలియన్ (3 లక్షల కోట్ల రూపాయలు) మార్కెట్ క్యాపిటలైజేషన్‌ మార్క్‌ను దాటింది. రూ.3 ట్రిలియన్‌ కంపెనీల ఎలైట్ క్లబ్‌లో చేరింది. దాని షేరు ధర బుధవారం ఇంట్రా-డే ట్రేడ్‌లో 2 శాతం పైగా ర్యాలీతో రూ. 2,143.45 వద్ద కొత్త 52 వారాల రికార్డ్‌ స్థాయిని తాకింది. రూ.3.01 ట్రిలియన్ మార్కెట్ క్యాప్‌తో, మొత్తం మార్కెట్ క్యాప్ ర్యాంకింగ్‌లో 20వ స్థానంలో L&T నిలిచింది.

గత నెల రోజుల్లో S&P BSE సెన్సెక్స్‌లో 2.5 శాతం పెరుగుదలతో పోలిస్తే, L&T 6 శాతం లాభపడి మార్కెట్‌ను ఔట్‌ పెర్ఫార్మ్‌ చేసింది. గత ఆరు నెలల కాలంలో 35 శాతం ర్యాలీ చేసింది. బలమైన ఆర్డర్ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్టర్లు దీని మీద సెంటిమెంట్‌ పెంచుకున్నారు. 

'V' షేప్‌ రికవరీ
ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్ వరకు పడుతూ వెళ్లినా, అక్కడి నుంచి 'V' షేప్‌ రికవరీ తీసుకుంది. గోడకు కొట్టిన బంతిలా తిరిగి లాభాల్లోకి వచ్చింది. 2022లో ఇప్పటి వరకు (YTD) 11 శాతం పెరిగింది. 

ఇంజినీరింగ్ & కన్‌స్ట్రక్షన్‌లో దశాబ్దాల అనుభవం, పటిష్టమైన ట్రాక్ రికార్డ్‌ ఉన్న L&T.., ప్రభుత్వ & ప్రైవేట్ రంగాల్లో పెరుగుతున్న పెట్టుబడుల వల్ల ఏర్పడుతున్న కాపెక్స్ అప్‌-సైకిల్‌లో ప్రధాన లబ్ధిదారుగా మారుతుందని మార్కెట్‌ ఎనలిస్ట్‌లు చెబుతున్నారు.

టెక్నికల్‌ వ్యూ
బయాస్‌: పాజిటివ్‌
సపోర్ట్‌: రూ. 2,127; తర్వాత రూ. 2,122
రెసిస్టెన్స్‌: రూ. 2,153

లార్సెన్ & టూబ్రో స్టాక్‌ ఈ ఏడాది అక్టోబర్‌ చివరి వారంలో స్వల్ప కాల సగటు (20-DMA) పైన నిలదొక్కుకున్న తర్వాత, అప్‌వర్డ్‌ జర్నీలో ఉంది. ఈ కాలంలోనే దాదాపు 15 శాతం ర్యాలీ చేసింది.

ప్రస్తుతం, డైలీ చార్ట్‌లో రూ.2,127 స్థాయి వద్ద బొలింగర్ బ్యాండ్‌ హయ్యర్‌ ఎండ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ స్టాక్ రూ. 2,127 కంటే పైన కదులుతున్నంత కాలం షార్ట్‌ టర్మ్‌ బయాస్‌ పాజిటివ్‌గా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా, వీక్లీ చార్ట్ సూచీలు రూ. 2,122 స్థాయి వద్ద దీనికి సపోర్ట్‌గా ఉన్నాయి.

మంత్లీ ఫిబోనసీ చార్ట్ ప్రకారం... ఈ స్టాక్ సుమారు రూ. 2,140 నుండి రూ. 2,153 పరిధిలో గట్టి ప్రతిఘటన (రెసిస్టెన్స్‌) ఎదుర్కొంటుంది. దాదాపు రూ. 2,100 స్థాయిలో బలమైన మద్దతు ఉంటుందని అంచనా. రూ. 2,153 స్థాయిని దాటి, ఆపై నిలదొక్కుకోగలిగితే.. మరింత పైకి ఎగబాకే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

New Year 2025: న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ ఎంట్రీ - ఎలా స్వాగతం చెప్పారో మీరే చూడండి - వీడియో
న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ ఎంట్రీ - ఎలా స్వాగతం చెప్పారో మీరే చూడండి - వీడియో
KTR Quash Petition: కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై  తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
Kodali Nani aide arrested: అస్సాం పారిపోయిన కొడాలి నాని రైట్ హ్యాండ్ - పట్టుకొచ్చిన పోలీసులు !
అస్సాం పారిపోయిన కొడాలి నాని రైట్ హ్యాండ్ - పట్టుకొచ్చిన పోలీసులు !
Perni Nani In Ration Rice Case: రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా పేర్ని నాని - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా పేర్ని నాని - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KA Paul Interview on Allu Arjun | అంబేడ్కర్ ని తిట్టినోళ్లు యూజ్ లెస్ ఫెలోస్ | ABP DesamDeputy CM Pawan kalyan on Allu Arjun | సంధ్యా థియేటర్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ | ABP DesamISRO SpaDEX Docking Experiment | తొలిసారిగా డాకింగ్ ప్రయోగం చేస్తున్న ఇస్రో | ABP Desamఅమిత్ షాకి అదో ఫ్యాషన్, మాలల సత్తా చూపిస్తాం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
New Year 2025: న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ ఎంట్రీ - ఎలా స్వాగతం చెప్పారో మీరే చూడండి - వీడియో
న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ ఎంట్రీ - ఎలా స్వాగతం చెప్పారో మీరే చూడండి - వీడియో
KTR Quash Petition: కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై  తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
Kodali Nani aide arrested: అస్సాం పారిపోయిన కొడాలి నాని రైట్ హ్యాండ్ - పట్టుకొచ్చిన పోలీసులు !
అస్సాం పారిపోయిన కొడాలి నాని రైట్ హ్యాండ్ - పట్టుకొచ్చిన పోలీసులు !
Perni Nani In Ration Rice Case: రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా పేర్ని నాని - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా పేర్ని నాని - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
Unstoppable With NBK: రష్మిక పెళ్లి ప్రస్తావన... 'డాకు మహారాజ్' టీం సీక్రెట్స్ అన్నీ బయట పెట్టిన బాలయ్య
రష్మిక పెళ్లి ప్రస్తావన... 'డాకు మహారాజ్' టీం సీక్రెట్స్ అన్నీ బయట పెట్టిన బాలయ్య
Nimisha Priya: భారతీయ నర్సుకు యెమెన్‌లో మరణ శిక్ష ఖరారు - విడుదలకు కృషి చేస్తున్నామన్న విదేశాంగ శాఖ
భారతీయ నర్సుకు యెమెన్‌లో మరణ శిక్ష ఖరారు - విడుదలకు కృషి చేస్తున్నామన్న విదేశాంగ శాఖ
Manchu Vishnu: మరో వివాదంలో మంచు విష్ణు - అడవి పందులను వేటాడిన నటుడి సిబ్బంది
మరో వివాదంలో మంచు విష్ణు - అడవి పందులను వేటాడిన నటుడి సిబ్బంది
CM Chandrababu Distributes Pension: యల్లమందలో పింఛన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు - ఓ లబ్ధిదారుడికి రూ.5 లక్షలు ఇవ్వాలని ఆదేశం
యల్లమందలో పింఛన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు - ఓ లబ్ధిదారుడికి రూ.5 లక్షలు ఇవ్వాలని ఆదేశం
Embed widget