KRN Heat Exchanger: కేఆర్‌ఎన్ హీట్ ఎక్స్ఛేంజర్ సూపర్ డూపర్ ఎంట్రీ - ఇన్వెస్టర్ల డబ్బులు డబుల్
KRN Heat IPO Listing Gains: కేఆర్‌ఎన్ హీట్ ఎక్స్ఛేంజర్ 100 శాతం పైగా లిస్టింగ్ గెయిన్స్ అందివ్వడంలో సక్సెస్ అయింది. IPO ధర కంటే రెట్టింపు మొత్తానికి ఈ కంపెనీ షేర్లు లిస్ట్ అయ్యాయి.
KRN Heat Exchanger IPO Shares Listing: కేఆర్‌ఎన్ హీట్ ఎక్స్ఛేంజర్ అండ్ రిఫ్రిజిరేషన్ లిమిడెట్ (KRN Heat Exchanger and Refrigeration Limited) షేర్లు ఈ రోజు (గురువారం, 03 అక్టోబర్ 2024) ఇండియన్ స్టాక్ మార్కెట్లలోకి సూపర్ డూప్ ఎంట్రీ ఇచ్చాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (NSE)లో ట్రేడింగ్ కోసం అరంగేట్రం చేశాయి. ముందు నుంచి మార్కెట్ ఊహిస్తున్నట్లుగానే, ఈ షేర్లు లిస్టింగ్ సమయంలో ఇన్వెస్టర్ల డబ్బును రెట్టింపు చేశాయి. IPO పెట్టుబడిదార్లు తమ పెట్టుబడికి మించి లాభాలు సంపాదించారు.
బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో, KRN హీట్ ఎక్స్ఛేంజర్ ఒక్కో షేరు రూ. 470 చొప్పున లిస్ట్ అయింది. ఇది 100 శాతానికి పైగా లిస్టింగ్ గెయిన్. అదే విధంగా, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో ఒక్కో షేర్ రూ. 480 చొప్పున జాబితాలోకి చేరింది. ఇక్కడ కూడా, తన ఇన్వెస్టర్లకు 100 శాతానికి పైబడి లాభాలు సంపాదించి పెట్టింది. IPOలో ఒక్కో షేరును ఈ కంపెనీ గరిష్టంగా రూ. 220 చొప్పున అమ్మింది.
పెట్టుబడిదార్లకు ఒక్కో లాట్‌పై ఎంత లాభం?
IPO కోసం, KRN హీట్ ఎక్స్ఛేంజర్ ఒక్కో లాట్‌కు 65 షేర్ల చొప్పున విక్రయించింది. IPOలో షేర్ ధర రూ. 220 ప్రకారం, ఇన్వెస్టర్లు ఒక్కో లాట్‌ను రూ. 14,300 చొప్పున (65 x 220) కొన్నారు. BSEలో ఒక్కో షేర్ షేర్ రూ. 470 దగ్గర లిస్ట్ అయింది. అంటే, పెట్టుబడిదార్లకు వాళ్ల పెట్టుబడి పోను BSEలో ఒక్కో షేర్ మీద (470-220) రూ. 250 చొప్పున లాభం వచ్చింది. అదే సమయంలో, NSEలో ఒక్కో షేర్ మీద (480-220) రూ. 260 చొప్పున ప్రాఫిట్ కనిపించింది. ఈ లెక్కన, BSEలో ఒక్కో లాట్‌పై రూ. 16,250 (65 x 250) లాభం వచ్చింది. NSEలో ఒక్కో లాట్‌కు (65 x 260) రూ. 16,900 లాభం ఆర్జించారు.
కేఆర్‌ఎన్ హీట్ ఎక్స్ఛేంజర్ IPO వివరాలు
IPO సమయంలోనూ ఈ కంపెనీ షేర్లకు 213.41 రెట్ల సూపర్ రెస్పాన్స్ వచ్చింది. బంపర్ డిమాండ్ + అధిక GMP కారణంగా కంపెనీ షేర్లు బ్లాస్టింగ్ లిస్టింగ్ అవుతాయని గతంలోనే సూచనలు ఉన్నాయి. గ్రే మార్కెట్‌లో దీని చివరి ప్రీమియం (GMP) రూ. 230 వద్ద ఉంది. దీనిని బట్టి ఒక్కో షేరు రూ. 450 వద్ద లిస్ట్ అవుతుందని అంచనా వేశారు. అయితే, పెట్టుబడిదార్లు ఊహించిన రేటు కంటే ఎక్కువ ధరకు లిస్ట్ అయింది, ఆశించిన మొత్తం కంటే ఎక్కువ లాభాలను ఆర్జించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: యుద్ధ భయంలో ఇండియన్ మార్కెట్లు - సెన్సెక్స్ 1200 pts, నిఫ్టీ 350 pts పతనం