Stocks to Watch: స్టాక్ మార్కెట్ల ప్రారంభానికి ముందు గమనించాల్సిన స్టాక్స్ ఇవే ఇన్వెస్టర్స్..!
దేశంలోని కార్పొరేట్ కంపెనీలు తమ నాలుగో త్రైమాసిక ఫలితాలను వరుసగా ప్రకటిస్తున్న వేళ కొన్ని కంపెనీల షేర్లు నేడు ప్రధానంగా ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అయితే ట్రెండింగ్ లో షేర్లను గమనించండి.
Buzzing Stocks: మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు తెరుచుకోవటానికి ముందు కొన్ని కంపెనీల షేర్లు హెడ్ లైన్స్ లో నిలిచాయి. ఈ క్రమంలో ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోవటానికి ముందు వీటికి సంబంధించిన వివరాలు తెలుసుకోవటం చాలా ముఖ్యం. ముందుగా ఎందుకు ఇవి వార్తల్లో నిలిచాయో పరిశీలిస్తే.. సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోవటంలో అది సహాయకారిగా ఉంటుంది.
- ముందుగా ఈరోజు వార్తల్లో నిలిచిన స్టాక్ గోద్రేజ్ కన్జూనర్ ప్రొడక్స్. ఈ కంపెనీ మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.1893.2 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. వాస్తవానికి ఆరోగ్యకరమైన పనితీరు ఉన్నప్పటికీ తప్పక పరిగణించాల్సిన నష్టం రూ.2,375.65 కోట్లు త్రైమాసికంలో రావటంతో కంపెనీ భారీ నష్టాన్ని నమోదు చేయాల్సి వచ్చినట్లు కంపెనీ తన త్రైమాసిక ఫలితాల్లో ప్రకటించింది. దీంతో నేడు ఇంట్రాడేలో కంపెనీ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి నెలకొనే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
- ఇన్వెస్టర్లు గమనించాల్సిన షేర్ల జాబితాలో ఐటీ సేవల కంపెనీ ఎల్‌టిఐ మైండ్ ట్రీ సైతం నేడు వార్తల్లో ఉంది. టెక్ కంపెనీ జీఎస్టీ అధికారుల నుంచి రూ.155.7 కోట్లకు టాక్స్ డిమాండ్ నోటీసులను అందుకుంది. 2019 ఆర్థిక సంవత్సరానికి గాను ముంబై జీఎస్టీ అధికారులు కంపెనీకి తాజాగా నోటీసులు పంపారు.
- మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన గుజరాత్ ఫ్లోరోకెమికల్స్ కంపెనీ తన నికర లాభం రూ.101 కోట్లుగా ప్రకటించింది. ఈ క్రమంలో నికర లాభం గత ఏడాది కంటే 70 శాతం క్షీణతను నమోదు చేసింది. ఇదే క్రమంలో త్రైమాసిక ఆదాయం 23 శాతం తగ్గి రూ.1133 కోట్లుగా నిలిచింది. దీంతో కంపెనీ షేర్లు నేడు మార్కెట్లో ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
- ఫార్మా రంగంలో పనిచేస్తున్న లుపిన్ కంపెనీ మార్చి త్రైమాసికంలో తన నికర లాభాన్ని రూ.359.4 కోట్లుగా ఉన్నట్లు పేర్కొంది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 52 శాతం అధికం. ఇదే క్రమంలో కంపెనీ అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (US FDA) నుండి ట్రావోప్రోస్ట్ ఆప్తాల్మిక్ సొల్యూషన్ కోసం ఆమోదం పొందింది.
ఇదే క్రమంలో నేడు మార్కెట్లో గమనించాల్సిన కంపెనీ షేర్ల జాబితాను గమనిస్తే.. గుజరాత్ గ్యాస్, రూట్ మెుబైల్స్, కామథేను, తమిళనాడ్ మర్కంటైల్ బ్యాంక్, ప్రుడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్, డ్రోన్ డెస్టినేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, డీసీఎమ్ శ్రీరామ్, ఆప్కోటెక్స్ ఇండస్ట్రీస్, అరవింద్ స్మార్ట్ ప్లేసెస్, బిగ్ బ్లాక్ కన్‌స్ట్రక్షన్స్, ముతూట్ మైక్రోఫిన్, జిల్లెట్ ఇండియా అండ్ ప్రాక్టర్ గ్యాంబిల్ హైజిన్, నోవెలిస్ ఇండస్ట్రీస్, బజాజ హెల్త్ కేర్, ఆటోమోటివ్ స్టాంపింగ్ అండ్ అసెంబిల్స్, మస్కెట్, అల్సెక్ టెక్నాలజీస్ కంపెనీల షేర్లు నేడు వార్తల్లో నిలిచాయి. వీటికి సంబంధించిన వార్తలను ఇన్వెస్టర్లు తప్పక గమనించాల్సి ఉంటుంది.
ఇదే క్రమంలో నేడు తమ కార్పొరేట్ మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించే కంపెనీలపై సైతం ఇన్వెస్టర్లు ఒక కన్నేసి ఉంచాల్సిందే. నేడు ఫలితాలు ప్రకటించనున్న కంపెనీల జాబితాను పరిశీలిస్తే.. డాక్టర్ రెడ్డీస్, పిబి ఫిన్ టెక్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, వోల్టాస్, సెంచురీ టెక్స్ టైల్స్, డెలాయిట్, గ్రాఫైట్ ఇండియా, ఇంద్రప్రస్తా గ్యాస్, ఐఆర్బీ ఇన్ ఫ్రా స్ట్రక్చర్స్, జిందాల్ సా, జూపిటర్ వ్యాగన్స్, కజారియా సిరామిక్స్, కేఈసీ ఇంటర్నేషనల్, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్, పిజియలైట్ ఇండస్ట్రీస్, సొనాటా సాఫ్ట్ వేర్, యునైటెడ్ బ్రూవరీస్, బయోబ్లాక్ కన్‌స్ట్రక్షన్ నేడు తమ మార్చి త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి.