అన్వేషించండి

Wipro Q1 Results: లాభం, ఆదాయం రెండూ మిస్‌ మ్యాచింగ్‌ - విప్రో ప్రాఫిట్‌ ₹2,870 కోట్లు

టాప్‌ లైన్‌, బాటమ్‌ లైన్‌ రెండూ ఎస్టిమేషన్స్‌ను మిస్‌ చేశాయి.

Wipro Q1 Results: ఐటీ సర్వీసెస్‌ కంపెనీ విప్రో Q1 లాభం, ఆదాయం రెండూ మార్కెట్‌ అంచనాలను అందుకోలేదు. 2023-24 జూన్‌ త్రైమాసికంలో, ఏకీకృత ప్రాతిపదికన ఈ ఐటీ కంపెనీ రూ.2,870 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం 2022-23లోని ఇదే కాలంలో వచ్చిన లాభం రూ. 2,563.60 కోట్లతో పోలిస్తే (YoY) ఈసారి 11.9 శాతం పెరిగింది. QoQలో మాత్రం 6.6 శాతం తగ్గింది. 

Q1 FY24లో కంపెనీ ఆదాయం రూ. 21,528 కోట్ల నుంచి 6 శాతం YoY పెరిగి రూ. 22,831 కోట్లకు చేరింది. QoQ ప్రాతిపదికన 1.55 శాతం తగ్గింది. 

మొదటి త్రైమాసికంలో ఈ బెంగళూరు బేస్డ్‌ కంపెనీ రూ. 2,976 కోట్ల నికర లాభాన్ని, రూ. 23,014 కోట్ల ఆదాయాన్ని ప్రకటిస్తుందని ఎనలిస్ట్‌లు అంచనా వేశారు. టాప్‌ లైన్‌, బాటమ్‌ లైన్‌ రెండూ ఎస్టిమేషన్స్‌ను మిస్‌ చేశాయి. BFSI (బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఇన్సూరెన్స్‌) బిజినెస్‌ సెగ్మెంట్‌ పనితీరు నిరుత్సాహంగా ఉండడం, క్లయింట్లు తమ టెక్నాలజీ బడ్జెట్‌ తగ్గించుకోవడం దీనికి కారణంగా ఎనలిస్ట్‌లు చెబుతున్నారు. వాస్తవానికి ఈసారి ఐటీ ప్యాక్‌ నంబర్లు ఏ మాత్రం రుచించవని మార్కెట్‌ ముందుగానే ఎస్టిమేట్‌ చేసింది.

విప్రో Q1 ఫలితాల ఫుల్‌ రిపోర్ట్‌ కార్డ్‌:

- డాలర్‌ పరంగా చూస్తే, విప్రో ఆదాయం 0.8 శాతం పెరిగి 2778.50 మిలియన్‌ డాలర్లుగా నమోదైంది. రూపాయల పరంగా చూస్తే 6.1% వృద్ధి కనిపించింది. 

 -Q2 FY24 కోసం, స్థిర కరెన్సీ (CC) పరంగా, ఆదాయ వృద్ధి -2 శాతం నుంచి 1 శాతం వరకు ఉండొచ్చని గైడెన్స్‌లో విప్రో మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది.

- కంపెనీ ఆపరేటింగ్‌ మార్జిన్‌ 16 శాతంగా నమోదైంది, YoYలో 1.12 శాతం (112 బేసిస్‌ పాయింట్లు) పెరిగింది.

- జూన్‌ త్రైమాసికంలో మొత్తం 3.7 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ. 30,340 కోట్లు) విలువైన బుకింగ్స్‌ సాధించినట్లు కంపెనీ వెల్లడించింది. లార్జ్‌ డీల్ బుకింగ్స్ 9 శాతం YoY పెరిగాయి. గత ఎనిమిది త్రైమాసికాల్లో ఇది అత్యధికం.

- విప్రో ఆపరేటింగ్‌ క్యాష్‌ ఫ్లోస్‌ నికర ఆదాయంలో 130 శాతంగా ఉన్నాయి.

- జూన్‌ త్రైమాసికంలో EPS 11.5% YoY పెరిగింది.

- విప్రో ఆట్రిషన్‌ రేట్‌ (వలసల రేటు) 17.3 శాతంగా ఉంది. మార్చి త్రైమాసికంలోని 19.2% నుంచి ఇది తగ్గింది. ఇది పాజిటివ్‌ ఫ్యాక్టర్‌.

- జూన్‌ త్రైమాసికం ముగింపు నాటికి ఈ కంపెనీలో ఉన్న మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,49,758. మార్చి త్రైమాసికం ముగింపు నాటికి ఉన్న సిబ్బందితో పోలిస్తే ఈ సంఖ్య 8,812 తగ్గింది. 

- త్రైమాసికంలో EPS 11.5% YYY పెరిగింది.

- ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో 1 బిలియన్‌ డాలర్ల పెట్టుబడిని విప్రో మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది. AI360 అనే AI- ఇన్నోవేషన్‌ ఎకోసిస్టమ్‌ను ప్రారంభించామని వెల్లడించింది. డిమాండ్‌కు తగ్గట్లు ఫ్రెషర్ల హైరింగ్‌ ఉంటుందని కూడా మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది.

- లార్జ్‌ క్యాప్ ఐటీ ప్యాక్‌లో రిజల్ట్స్‌ మూడో కంపెనీ విప్రో. దీనికంటే ముందు, TCS,  HCL టెక్‌ Q1 ఫలితాలను ప్రకటించాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నంబర్లు మరీ దారుణంగా లేకపోయినా, హెచ్‌సిఎల్‌ టెక్ మాత్రం అన్ని విభాగాల్లో అంచనాలను మిస్‌ చేసింది.

- ఇవాళ్టి ట్రేడింగ్‌లో (14 జులై 2023), ఉదయం 10 గంటల సమయానికి విప్రో షేర్లు 0.22% శాతం పెరిగి రూ. 395.20 వద్ద ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. గత సెషన్‌లో ఈ షేర్లు రూ. 394.35 వద్ద ముగిశాయి.

మరో ఆసక్తికర కథనం: ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌లో విప్రో భారీ పెట్టుబడి!

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Pawan Kalyan Latest News: పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Political News : జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Pawan Kalyan Latest News: పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Political News : జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
Mirai Audio Rights: హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
Tirumala News: తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
Priyanka Gandhi Took Oath Today: వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Embed widget