JioBharat: జియోభారత్ ఫోన్ సంచలనం - ఆ సెగ్మెంట్‌లో టాప్ ప్లేస్‌లోకి, RIL వార్షిక నివేదిక వెల్లడి
RIL Annual Report: దేశంలో రూ.వెయ్యి విలువగల ఫోన్ల మార్కెట్‌లో జియో భారత్ ఫోన్ సత్తా చాటింది. 50 శాతం మార్కెట్ వాటాను ఆక్రమించిందని RIL తన 2024 వార్షిక నివేదికలో కీలకమైన విషయాలను వెల్లడించింది.
JioBharat Phone: భారత దేశపు దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ తన 2024 వార్షిక నివేదికలో కీలకమైన విషయాలను వెల్లడించింది. దేశంలోనే అతి తక్కువ ధర శ్రేణిలోని కీప్యాడ్ స్మార్ట్‌ఫోన్ అయిన అయిన జియో భారత్ ఏకంగా 50 శాతం మార్కెట్ వాటాను ఆక్రమించిందని పేర్కొన్నారు. రూ.వెయ్యి సెగ్మెంట్‌లో జియో భారత్ వాటా సగం ఉందని చెప్పారు. డిజిటల్ సేవలు అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రారంభించిన జియోభారత్ దేశంలోని 250 మిలియన్ల ఫీచర్ ఫోన్ వినియోగదారుల వద్ద ఉందని వివరించారు.
ఏడాది క్రితం జియో భారత్ విడుదలైనప్పటి నుంచి యూపీఐ (JioBharat UPI), జియో సినిమా (Jio Cinema), జియో (JioTV) వంటి ఫీచర్లు సహా ఇతర డిజిటల్ సేవలను ఫీచర్ ఫోన్ వినియోగదారుల జీవితాల్లో భాగం అయినపోయినట్లుగా వార్షిక నివేదికలో పేర్కొన్నారు. సమాజంలోని వివిధ వర్గాల వారికి సమానంగా డిజిటల్ సేవలు అందుతున్నాయని తెలిపారు. ఈ అతి తక్కువ ధరతో కూడిన కీ ప్యాడ్ ఫోన్ ఒక పెద్ద స్మార్ట్‌ఫోన్ ద్వారా డిజిటల్ సేవలతో పాటు.. అధిక నాణ్యతతో కూడిన డేటాను తక్కువ ధరకే అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్క సామాన్యుడి ఇది అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
జియో భారత్ ధరలు అంతే..
ఇటీవల టెలీకాం కంపెనీలన్నీ టారీఫ్ ధరలన్నీ పెంచినప్పటికీ జియో మాత్రం జియో భారత్ (JioBharat) ఫోన్ వినియోగదారుల కోసం ఎలాంటి ధరలను పెంచలేదు. వినియోగదారులు నెలకు కేవలం రూ.123తో పూర్తి డిజిటల్ సేవలను ఆనందిస్తున్నారు. మరోవైపు, ఇతర టెలీకాం ఆపరేటర్‌ల వద్ద అత్యంత తక్కువ టారీఫ్ ప్లాన్‌లు నెలకు రూ.199 నుంచి మొదలవుతుంది. ఫీచర్ ఫోన్‌లు డేటా లేదా 4జీ వినియోగానికి సపోర్ట్ చేయనందున, అవి కేవలం వాయిస్, మేసేజ్ సేవలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. కానీ, జియో భారత్ ఫోన్ వివిధ రకాల డిజిటల్ సేవలను అందిస్తోంది.
షేర్ హోల్డర్లకు లేఖ
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ షేర్ హోల్డర్లకు రాసిన లేఖలో.. “జియోభారత్ ఫోన్ లాంచ్ అనేది దేశపు డిజిటల్ రంగంలో విప్లవాత్మక మార్పు. ఫీచర్ ఫోన్ ధరలో స్మార్ట్‌ఫోన్ ఇవ్వగలుగుతున్నాం. జియోభారత్ ఫోన్ 2G ముక్త భారత్‌ను సాకారం చేయడంలో చాలా సాధించింది. 2016లో జియో సర్వీసులు మొదలుపెట్టినప్పుడు ఇంటర్నెట్ సదుపాయాన్ని, సాంకేతికతను ప్రతి ఒక్కరికి అందించడానికి ఏ అవకాశాన్ని వదల్లేదు. తక్కువ ధరకే హై-స్పీడ్ డేటా, మెరుగైన నెట్‌వర్క్‌తో అరంగేట్రం చేశాం. JioPhone వంటి తక్కువ ధర ఫోన్లు, తర్వాత వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ అయిన జియో ఫైబర్ (JioFiber) లాంటి సేవలు డేటా కనెక్టివిటీని బాగా పెంచాయి.
“జియో డేటా డార్క్ ఇండియాను డేటా రిచ్ నేషన్‌గా మార్చింది. ప్రతి భారతీయ ఇంటికి సరసమైన, హై స్పీడ్ 4జీ డేటాను సరఫరా చేసింది. ఈ సంవత్సరం జియో తన True5G నెట్‌వర్క్‌ను ప్రపంచంలోనే రికార్డు సమయంలో దేశం అంతటా విస్తరించడం ద్వారా దేశంపు డిజిటల్ మౌలిక సదుపాయాలను బాగా మెరుగుపరిచింది”అని ముఖేష్ అంబానీ తన షర్ హోల్డర్లకు రాసిన లేఖలో రాసిన విషయాలను తాజా వార్షిక నివేదికలో పేర్కొన్నారు.