search
×

Harsha Engineers IPO: హర్ష ఇంజినీర్స్‌ ఐపీవో ఇవాళ ప్రారంభం - బిడ్‌ వేద్దామా, వద్దా?

IPO ప్రైస్‌ బ్యాండ్‌ గరిష్ట ధర అయిన రూ.330 దగ్గర, FY22 ఆదాయాలతో పోలిస్తే, దీని విలువను 27.7 రెట్లుగా నిర్ణయించినట్లు LKP Securities వెల్లడించింది.

FOLLOW US: 
Share:

Harsha Engineers IPO: మన దేశంలో అతి పెద్ద ప్రెసిసన్ బేరింగ్ కేజ్‌ల (precision bearing cages) తయారీ కంపెనీ అయిన హర్ష ఇంజినీర్స్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ (Harsha Engineers International Ltd -HEIL) IPO నేటి (బుధవారం - 14 సెప్టెంబర్‌ 2022) నుంచి ప్రారంభమయింది. ఈ నెల 16 వరకు ఈ ఐపీవోను సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చు.

ఈ కంపెనీ మీద మార్కెట్‌లో చాలా అంచనాలున్నాయి. ఇప్పటికే, గ్రే మార్కెట్‌లో 40 శాతం ప్రీమియంతో (₹212 ఎక్కువ ధర వద్ద) కోట్లాది షేర్లు చేతులు మారాయి. లిస్టింగ్‌ డే రోజున మంచి గెయిన్స్‌ను (లిస్టింగ్‌ డే గెయిన్స్‌) ఈ కంపెనీ అందించవచ్చని ఎనలిస్ట్‌లు అంచనా వేస్తున్నారు. అయితే, లిస్టింగ్‌ రోజున ఉన్న పరిస్థితిని బట్టి అంచనాలు కూడా మారతాయి. ఒకవేళ ఆ రోజు మార్కెట్‌లో నెగెటివ్‌ సెంటిమెంట్‌ ఉంటే, దీని మీద కూడా ఆ ప్రభావం ఉంటుందని, లిస్టింగ్‌ లాసెస్‌ వచ్చే ఛాన్స్‌ కూడా ఉందని గుర్తుంచుకోవాలి.

ప్రైస్ బాండ్
ఈ కంపెనీ ఐపీవో కోసం, ఒక్కో షేరు ధరను (ప్రైస్ బాండ్) రూ.314-330 గా నిర్ణయించారు. 

ఈ ఐపీవో ద్వారా రూ.755 కోట్లను సమీకరించాలని ఈ కంపెనీ భావిస్తోంది. ఇందులో, రూ.455 కోట్లు ఫ్రెష్‌ ఇష్యూ. ఈ మొత్తం కంపెనీ అకౌంట్‌లోకి వెళ్తుంది. మిగిలిన రూ.300 కోట్లను OFS (ఆఫర్‌ ఫర్‌ సేల్‌) మార్గంలో సమీకరిస్తారు. అంటే, ప్రమోటర్లు లేదా ప్రస్తుత పెట్టుబడిదారులు తమ వద్ద ఉన్న వాటాలను OFS ద్వారా అమ్మేస్తున్నారు. ఈ మొత్తం వాళ్ల సొంత ఖాతాల్లోకి చేరుతుంది, కంపెనీకి ఈ డబ్బుతో సంబంధం ఉండదు. ఐపీవోకి ముందు, ప్రమోటర్ల దగ్గర 99.70 శాతం షేర్లు ఉన్నాయి.

ఒక్కో లాట్‌కు ₹14,850
ఒక్కో లాట్‌కు 45 షేర్లను కేటాయించారు. బిడ్ వేయాలనుకున్నవాళ్లు 45 షేర్లకు ఒక లాట్‌ చొప్పును లాట్ల రూపంలో కొనాల్సివుంటుంది. కనిష్టంగా 1 లాట్‌ - గరిష్టంగా 13 లాట్లను రిటైల్‌ ఇన్వెస్టర్లు (మన లాంటి చిన్న ఇన్వెస్టర్లు) కొనవచ్చు. ఒక లాట్‌కు ₹14,850 ఖర్చవుతుంది. మొత్తం 13 లాట్ల కోసం బిడ్‌ వేస్తే, ₹1,93,050 కేటాయించాలి.

ఈ IPOలో రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం 35 శాతం షేర్లను కేటాయించారు.

ఈ నెల 26న లిస్టింగ్‌
ఈ నెల 21న షేర్ల అలాట్‌మెంట్‌ ఉంటుంది. షేర్లు దక్కని వాళ్ల డబ్బులను వెనక్కు ఇచ్చే ప్రక్రియ 22న ప్రారంభమవుతుంది. షేర్లు దక్కితే, 23న డీమ్యాట్‌ ఖాతాల్లో క్రెడిట్‌ అవుతాయి. ఈ షేర్లు ఈ నెల 26న మార్కెట్‌లో (NSE, BSE) లిస్ట్‌ అవుతాయి.

65 దేశాలకు ఎగుమతులు
ఇంజినీరింగ్‌ బిజినెస్‌, సోలార్‌ ఈపీసీ బిజినెస్‌ కేటగిరీల్లో ఇది వ్యాపారం చేస్తోంది. హర్ష ఇంజినీర్స్‌కు ఐదు ప్రాంతాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్‌, ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని 65 దేశాలకు కూడా తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. 

లాభం రెండింతలు
FY21లో దాదాపు రూ.877 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం FY22లో రూ.1339 కోట్లకు చేరింది. అంటే, 50 శాతం పైగా పెరిగింది. FY21లో నికరలాభం రూ.45.44 కోట్లుగా ఉంటే, FY22లో రూ.91.94 కోట్లకు చేరింది. ఇది కూడా రెట్టింపు పైగా పెరిగింది.

బిడ్‌ వేయొచ్చా?
IPO ప్రైస్‌ బ్యాండ్‌ గరిష్ట ధర అయిన రూ.330 దగ్గర, FY22 ఆదాయాలతో పోలిస్తే, దీని విలువను 27.7 రెట్లుగా నిర్ణయించినట్లు LKP Securities వెల్లడించింది. పోటీ కంపెనీలతో పోలిస్తే చవకైన వాల్యుయేషన్‌లో వస్తోంది కాబట్టి, దీర్ఘకాలిక దృక్పథంతో సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చని ఈ బ్రోకరేజ్‌ సూచించింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 14 Sep 2022 09:35 AM (IST) Tags: review GMP Price Details Harsha Engineers IPO

ఇవి కూడా చూడండి

Indias Largest IPOs: పేరు గొప్ప, పనితీరు దిబ్బ - రూ.10,000 కోట్ల కంటే పెద్ద IPOలన్నీ హ్యాండ్‌ ఇచ్చాయ్‌

Indias Largest IPOs: పేరు గొప్ప, పనితీరు దిబ్బ - రూ.10,000 కోట్ల కంటే పెద్ద IPOలన్నీ హ్యాండ్‌ ఇచ్చాయ్‌

Swiggy IPO: బచ్చన్‌ నుంచి రాహుల్ ద్రవిడ్ వరకు - ఈ కంపెనీ షేర్ల కోసం క్యూ

Swiggy IPO: బచ్చన్‌ నుంచి రాహుల్ ద్రవిడ్ వరకు - ఈ కంపెనీ షేర్ల కోసం క్యూ

Hyundai India IPO: దేశ చరిత్రలోనే బాహుబలి ఐపీవో - LIC బాక్స్‌ బద్దలవుతుంది!

Hyundai India IPO: దేశ చరిత్రలోనే బాహుబలి ఐపీవో - LIC బాక్స్‌ బద్దలవుతుంది!

Ola Electric IPO Price Brand : ఐపీవో ధరను ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్ - బిడ్స్ దాఖలు చేయాల్సిన తేదీ ఇదే

Ola Electric IPO Price Brand : ఐపీవో ధరను ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్ - బిడ్స్ దాఖలు చేయాల్సిన తేదీ ఇదే

IPO News: ఐపీవో లాభాల పంట.. లిస్టింగ్ తొలిరోజే బంపర్ లాభాలు!

IPO News: ఐపీవో లాభాల పంట.. లిస్టింగ్ తొలిరోజే బంపర్ లాభాలు!

టాప్ స్టోరీస్

Srikakulam Politics: తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్లిన బొత్స, పీక పోయినా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తారా? ఆసక్తికర వ్యాఖ్యలు

Srikakulam Politics: తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్లిన బొత్స, పీక పోయినా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తారా? ఆసక్తికర వ్యాఖ్యలు

Telangana Assembly Special Session: నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, సభలో కీలక తీర్మాణం - కేబినెట్ భేటీ వాయిదా

Telangana Assembly Special Session: నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, సభలో కీలక తీర్మాణం - కేబినెట్ భేటీ వాయిదా

Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..

Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..

EPFO New Facilities: నూతన సంవత్సరంలో EPFO నుంచి భలే ఫెసిలిటీస్‌ - అన్నీ హ్యాపీ న్యూస్‌లే!

EPFO New Facilities: నూతన సంవత్సరంలో EPFO నుంచి భలే ఫెసిలిటీస్‌ - అన్నీ హ్యాపీ న్యూస్‌లే!