By: ABP Desam | Updated at : 15 Apr 2023 01:06 PM (IST)
త్వరలో నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ రిటైల్ రీట్ IPO
Blackstone’s Nexus IPO: నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ రిటైల్ REIT (Real Estate Investment Trust) IPO వచ్చే నెలలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. నెక్సస్ మాల్స్‌ను నిర్వహిస్తున్న నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ (Nexus Select Trust) ఈ పబ్లిక్ ఆఫర్‌ను ప్రారంభించబోతోంది. ఈ ఆఫర్ ద్వారా భారీ మొత్తంలో, రూ. 4,000 కోట్ల వరకు సమీకరించాలన్నది కంపెనీ ప్లాన్. గత ఏడాది నవంబర్‌లో, ఈ సంస్థ సెబీకి 'డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్' (DRHP) దాఖలు చేసింది.
అంతర్జాతీయ పెట్టుబడుల సంస్థ అయిన 'బ్లాక్‌స్టోన్'కు నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్‌లో పెట్టుబడులు ఉన్నాయి. నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్‌కు దేశంలోని 14 ప్రధాన నగరాల్లో 17 షాపింగ్ మాల్స్ ఉన్నాయి. వాటి మొత్తం విస్తీర్ణం 9.8 మిలియన్ చదరపు అడుగులు కాగా, విలువ రూ. 23,000 కోట్లు.
మే నెల ప్రారంభంలో IPO
మార్కెట్ వర్గాలు చెబుతున్న ప్రకారం, నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ REIT IPO మే నెల ప్రారంభంలో ప్రైమరీ మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. అతి త్వరలోనే సెబీ నుంచి అనుమతి వస్తుందని భావిస్తున్నారు.
Nexus సెలెక్ట్ ట్రస్ట్ REIT IPO సైజ్ దాదాపు రూ. 4,000 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేస్తుండగా, అందులో రూ. 1,600 కోట్ల మొత్తానికి ఫెష్ షేర్లను జారీ చేయనున్నారు.
మన దేశంలో బ్లాక్‌స్టోన్ స్పాన్పర్ చేస్తున్న మూడో REIT ఇది. దేశంలో మొట్టమొదటి REITగా ఎంబసీ ఆఫీస్ పార్క్స్‌ను ప్రారంభించింది, ఆ తర్వాత మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ REITకు ప్రాయోజిత సంస్థగా ఉంది.
REIT అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఒక విధానం. అద్దె వచ్చే ఆస్తులను నిర్మించి విక్రయించడం ద్వారా స్థిరాస్తి రంగంలోకి పెట్టుబడులను ఇవి ఆకర్షిస్తుంటాయి. కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశంలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇది, రియల్ ఎస్టేట్ ఆస్తుల్లో భారీ విలువను అన్‌లాక్ చేయడంతో పాటు, రిటైల్ పెట్టుబడిదార్లు కూడా పెట్టుబడులు పెట్టేందుకు సాయపడుతుంది.
ప్రస్తుతం, స్టాక్ ఎక్స్ఛేంజీల్లో మూడు రీట్‌లు లిస్ట్ అయ్యాయి. వాటిలో, బ్లాక్‌స్టోన్ స్పాన్పర్ చేస్తున్న ఎంబసీ ఆఫీస్ పార్క్స్ REIT, మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ REIT ఉన్నాయి. మూడోది.. బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ట్రస్ట్. అయితే, ఇవన్నీ లీజుకు ఇచ్చిన కార్యాలయ ఆస్తులు.
అద్దెకు ఇచ్చే రిటైల్ రియల్ ఎస్టేట్ ఆస్తుల్లో మొదటి REITగా Nexus Select Trust నిలుస్తుంది.
నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్‌కు నిర్వహిస్తున్న 17 షాపింగ్ మాల్స్‌లో దాదాపు 3,000 దుకాణాలు ఉన్నాయి, దాదాపు 1,100 బ్రాండ్లు అమ్ముడవుతున్నాయి. ఈ మాల్స్‌లో ఆక్యుపెన్సీ స్థాయి ప్రస్తుతం 94 శాతంగా ఉంది, ఏడాదికి 130 మిలియన్లకు పైగా వినియోగదార్లు ఈ మాల్స్‌లోకి వచ్చి వెళ్తున్నారు.
2022 జూన్ త్రైమాసికం చివరినాటికి ఈ సంస్థకు రూ. 4,500 కోట్ల రుణాలు ఉన్నాయి. ఈ రుణాలను తగ్గించుకోవడానికి IPO ఆదాయంలో కొంత భాగాన్ని వినియోగిస్తారు.
నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ నికర నిర్వహణ ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 1,400 కోట్ల మేర పెరుగుతుందని అంచనా వేశారు.
బ్లాక్‌స్టోన్‌కు ఇండియన్ మార్కెట్లో భారీ ఉనికి ఉంది. ఇండియన్ మార్కెట్‌లోని 40కి పైగా పెట్టుబడుల్లో, రియల్ ఎస్టేట్ రంగంలో దాదాపు 22 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఈ కంపెనీకి ఉన్నాయి. దేశంలోని 7 నగరాల్లో ఉన్న 38 ఆస్తుల్లో సుమారు 100 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ పోర్ట్‌ఫోలియో దీని సొంతం. భారతదేశంలో అతి పెద్ద ఆఫీస్ స్పేస్ పోర్ట్‌ఫోలియో ఓనర్ ఈ కంపెనీ.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Indias Largest IPOs: పేరు గొప్ప, పనితీరు దిబ్బ - రూ.10,000 కోట్ల కంటే పెద్ద IPOలన్నీ హ్యాండ్ ఇచ్చాయ్
Swiggy IPO: బచ్చన్ నుంచి రాహుల్ ద్రవిడ్ వరకు - ఈ కంపెనీ షేర్ల కోసం క్యూ
Hyundai India IPO: దేశ చరిత్రలోనే బాహుబలి ఐపీవో - LIC బాక్స్ బద్దలవుతుంది!
Ola Electric IPO Price Brand : ఐపీవో ధరను ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్ - బిడ్స్ దాఖలు చేయాల్సిన తేదీ ఇదే
IPO News: ఐపీవో లాభాల పంట.. లిస్టింగ్ తొలిరోజే బంపర్ లాభాలు!
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Zainab Ravdjee : అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె - జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
Maharastra: మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !