By: ABP Desam | Updated at : 13 Apr 2023 12:31 PM (IST)
Edited By: Arunmali
ఇన్ఫీ ఫలితాలు ఇవాళే విడుదల
Infosys Q4 Results: 2022-23 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికం (Q4FY23) ఫలితాలు ప్రకటించడానికి మరో ఐటీ కంపెనీ లైన్‌లోకి వచ్చింది. ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ (Infosys Q4 revenues), ఈ రోజు (గురువారం, 13 ఏప్రిల్ 2023) మార్కెట్ గంటలు ముగిసిన తర్వాత తన ఆదాయ లెక్కలు ప్రకటించనుంది.
TCS Q4 ఆదాయం, మార్జిన్ సంఖ్యలు విశ్లేషకుల అంచనాలను అందుకోకపోవడంతో, పెట్టుబడిదార్లు ఇన్ఫోసిస్ నుంచి పెద్దగా ఆశించడం లేదు. స్థిర కరెన్సీ (constant currency లేదా CC) ప్రాతిపదికన, క్వార్టర్-ఆన్-క్వార్టర్‌లో (QoQ) నామమాత్రంగా 0.1 నుంచి 0.2% ఆదాయ వృద్ధిని ఇన్ఫోసిస్ నివేదిస్తుందని దలాల్ స్ట్రీట్ భావిస్తోంది.
"వీసా ఖర్చులు 40 బేసిస్ పాయింట్ల మేర పెరిగినా, కార్యాచరణ పనితీరు, తక్కువ పాస్‌త్రూ వ్యయాల కారణంగా ఎటిట్ (EBIT) మార్జిన్‌లో 25 బేసిస్ పాయింట్ల QoQ తగ్గుదలను ఆశిస్తున్నాం. డీల్స్ TCV (Total Contract Value), పైప్‌లైన్ కీలక పాయింట్లుగా ఉంటాయి" - కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్
బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఇన్ఫోసిస్, CC YoY ప్రాతిపదికన 5-7% ఆదాయ వృద్ధిని, 21-23% ఎబిట్ మార్జిన్ కోసం గైడెన్స్ ఇస్తుందని బ్రోకరేజీలు అంచనా వేశాయి.
"డీల్ విన్స్, ధరలు, అట్రిషన్ స్థాయి, కొత్త ఉద్యోగాలను గమనిస్తాం. US & యూరప్‌లో ఇటీవలి బ్యాంకింగ్ సంక్షోభం నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చే ఆదాయాలకు సంబంధించి ఏవైనా నెగెటివ్ కామెంట్స్‌ను కంపెనీ చేస్తుందా అన్న విషయాన్ని కూడా నిశితంగా పరిశీలిస్తాం" స్టాక్స్‌బాక్స్ రీసెర్చ్ హెడ్ మనీష్ చౌధ్రి
ఇబ్బందిని పెంచుతున్న ఆర్థిక మందగమనం
మార్చి త్రైమాసికంలో ఐటీ కంపెనీల ఆదాయాల్లో సాధారణంగానే కాలానుగుణ బలహీనత కనిపిస్తుంది. ఈసారి ప్రపంచ ఆర్థిక మందగమనం కూడా కలిసి ఇబ్బందిని మరింత పెంచింది.
గత 12 త్రైమాసికాల్లోకి తొంగి చూస్తే... ఫలితాల ప్రకటన తర్వాతి రోజుల్లో, సగం సార్లు ప్రతికూల రాబడిని ఈ కంపెనీ షేర్లు అందించాయి. గత సంవత్సరం మార్చి త్రైమాసిక నివేదిక తర్వాత 7% పైగా పతనం అయింది.
ప్రస్తుతం స్టాక్ ప్రైస్ యాక్షన్ ఇదీ..
టెక్నికల్‌గా చూస్తే... చాలా బలమైన మద్దతు జోన్ సమీపంలో 'డబుల్ బాటమ్ ప్యాటర్న్'ను ఈ స్టాక్ ఏర్పరిచింది. ప్రస్తుతం ఆ స్థాయి నుంచి పుంజుకుంటోంది. వీక్లీ చార్ట్‌లోని మొమెంటం ఇండికేటర్‌లు బుల్లిష్ సిగ్నల్‌ను ఇచ్చాయి. డిమాండ్ జోన్ నుంచి కూడా ఈ స్టాక్ బౌన్స్ అవుతోంది.
ఇవాళ ఉదయం 11.43 గంటల సమయానికి, BSEలో, 2.48% లేదా రూ. 35.40 నష్టంతో రూ. 1,393 వద్ద షేర్లు ట్రేడ్ అవుతున్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Petrol-Diesel Price 10 June 2023: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి పెట్రోల్, డీజిల్ ధరలు - కొత్త రేట్లివి
IT Documents: పన్ను ఆదా చేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరి, త్వరగా సేకరించండి
SBI vs LIC: ఎస్బీఐ యాన్యుటీ ప్లాన్ Vs ఎల్ఐసీ యాన్యుటీ ప్లాన్, ఏది బెస్ట్?
Forex: పుంజుకున్న విదేశీ వాణిజ్యం, రెండు వారాల తర్వాత ఫారెక్స్ కళ
Top 10 Headlines Today: మంత్రులపై బాబు పంచ్‌లు, జగన్‌పై పేర్ని నాని ప్రశంసలు- సింగరేణిపై కేసీఆర్ కీలక ప్రకటన
Telangana Poltics : తెలంగాణ చీఫ్‌ను మారుస్తారని మళ్లీ ప్రచారం - బీజేపీ హైకమాండ్ పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దుతుంది ?
Devineni Uma : అహంకారం వల్లే ఓడిపోయాం - దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు !
NBK 109 Movie : మారణాయుధాలతో పాటు మందు బాటిల్ - బాలకృష్ణతో బాబీ ప్లాన్ ఏంటి?
Thalaivar 170 : తమిళ సినిమాలో అమితాబ్ బచ్చన్ - 32 ఏళ్ళ తర్వాత రజనీతో!