News
News
వీడియోలు ఆటలు
X

Infosys Q4 Earnings: ఇన్ఫోసిస్‌ షేర్లు 11% పతనం, ఇప్పుడీ షేర్లను కొనాలా, అమ్మాలా?

Q4లో రూ. 6,550 కోట్ల నికర లాభం, రూ. 38,850 కోట్ల ఆదాయాన్ని మార్కెట్‌ ఆశించింది.

FOLLOW US: 
Share:

Infosys Q4 Earnings: బెంగళూరుకు చెందిన ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌, Q4FY23 బిజినెస్‌లో మార్కెట్‌ అంచనాలను అందుకోకపోవడంతో కంపెనీ షేర్లు ఇవాళ (17 ఏప్రిల్‌ 2023) కుప్పకూలాయి, 11% పైగా నష్టపోయాయి. 

2023 మార్చి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 8% వృద్ధితో రూ. 6,128 కోట్లకు చేరుకోగా, కార్యకలాపాల ఆదాయం 16% వృద్ధి చెంది రూ. 37,441 కోట్లకు చేరుకుంది. లాభం, ఆదాయం గణాంకాలు రెండూ దలాల్‌ స్ట్రీట్ అంచనాల కంటే తక్కువగా ఉన్నాయి. 

ఇన్ఫోసిస్‌ నుంచి, Q4లో రూ. 6,550 కోట్ల నికర లాభం, రూ. 38,850 కోట్ల ఆదాయాన్ని మార్కెట్‌ విశ్లేషకులు ఆశించారు.

ఫలితాల విడుదల సందర్భంగా, 2023-24 సంవత్సరం అంచనాలను ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు స్థిర కరెన్సీ పరంగా 4 నుంచి 7 మాత్రమే జంప్‌ను చూస్తాయని కంపెనీ అంచనా వేసింది. ఆపరేటింగ్ మార్జిన్ 20 నుంచి 22 శాతం వరకు ఉండొచ్చని లెక్కగట్టింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా మార్గదర్శకాలను ఈ కంపెనీ తగ్గించింది.

గురువారం మార్కెట్ వేళల తర్వాత ఈ కంపెనీ ఫలితాలు వెల్లడయ్యాయి. అంబేడ్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం భారత ఈక్విటీ మార్కెట్లు ట్రేడింగ్‌కు సెలవు ప్రకటించాయి. శని, ఆదివారాలు సాధారణ సెలవుల తర్వాత, ఇవాళ భారీ ఎఫెక్ట్‌ కనిపించింది.

ఉదయం 11.15 గంటల సమయానికి, ఒక్కో షేరు 11.02% లేదా రూ. 153.10 రూ. 1,235.45 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

జనవరి-మార్చి ఫలితాల తర్వాత, ఇన్ఫోసిస్‌ స్టాక్‌ మీద టాప్‌ బ్రోకరేజ్‌ల అంచనాలు మారాయి. మారిన అంచనాలకు అనుగుణంగా స్టాక్‌ రికమెండేషన్స్‌ చేశాయి. ప్రస్తుతం నిరాశజనక ఫలితాల ఉన్నా, కంపెనీ భవిష్యత్‌ ఆదాయాలపై ఎక్కువ బ్రోకరేజ్‌లు ఆశాజనకంగా ఉన్నాయి, "బయ్‌" కాల్స్‌ ఇచ్చాయి. ఈ స్టాక్‌ ప్రస్తుత స్థాయి నుంచి దాదాపు 28% ర్యాలీ చేస్తుందని అంచనా వేశాయి.

ఇన్ఫోసిస్‌ స్టాక్‌ మీద టాప్‌ బ్రోకరేజ్‌ల రికమెండేషన్స్‌:

జెఫరీస్‌
రికమెండేషన్‌: బయ్‌  | టార్గెట్‌ ధర: రూ. 1,570  | అప్‌సైడ్‌ ర్యాలీ: 13%

నోమురా 
రికమెండేషన్‌: న్యూట్రల్‌  | టార్గెట్‌ ధర: రూ. 1,290  | అప్‌సైడ్‌ ర్యాలీ: 28%

HDFC సెక్యూరిటీస్‌
రికమెండేషన్‌: యాడ్‌ (బయ్‌ నుంచి తగ్గింది) | టార్గెట్‌ ధర: రూ. 1,470  | అప్‌సైడ్‌ ర్యాలీ: 6%

కోటక్ సంస్థాగత సెక్యూరిటీస్‌ 
రికమెండేషన్‌: బయ్‌  | టార్గెట్‌ ధర: రూ. 1,470  | అప్‌సైడ్‌ ర్యాలీ: 6%

షేర్‌ఖాన్ 
రికమెండేషన్‌: హోల్డ్‌  | టార్గెట్‌ ధర: రూ. 1,500

BOB క్యాపిటల్ మార్కెట్స్‌
రికమెండేషన్‌: బయ్‌  | టార్గెట్‌ ధర: రూ. 1,760

నువామా 
రికమెండేషన్‌: బయ్‌  | టార్గెట్‌ ధర: రూ. 1,610

ఫిలిప్ క్యాపిటల్
రికమెండేషన్‌: బయ్‌  | టార్గెట్‌ ధర: రూ. 1,590

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 17 Apr 2023 12:08 PM (IST) Tags: Infosys share price Q4 results March Quarter

సంబంధిత కథనాలు

Taiwanese Shipping Firms: ఉద్యోగులకు షిప్పింగ్ కంపెనీల బంపర్ ఆఫర్లు, మందగమనంలో ఉన్నా మస్తు బోనస్‌లు

Taiwanese Shipping Firms: ఉద్యోగులకు షిప్పింగ్ కంపెనీల బంపర్ ఆఫర్లు, మందగమనంలో ఉన్నా మస్తు బోనస్‌లు

FD Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీలో కోత, ఈ లిస్ట్‌లో మీ బ్యాంక్‌ ఉందేమో చూసుకోండి

FD Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీలో కోత, ఈ లిస్ట్‌లో మీ బ్యాంక్‌ ఉందేమో చూసుకోండి

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్‌ హోమ్‌ లోన్‌ కావాలా, మీ కోసమే ఈ గుడ్‌న్యూస్‌

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్‌ హోమ్‌ లోన్‌ కావాలా, మీ కోసమే ఈ గుడ్‌న్యూస్‌

Mutual Funds: స్మార్ట్‌గా డబ్బు సంపాదించిన స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌, మూడేళ్లలో 65% రిటర్న్‌

Mutual Funds: స్మార్ట్‌గా డబ్బు సంపాదించిన స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌, మూడేళ్లలో 65% రిటర్న్‌

Online Banking: అన్ని అవసరాలకు ఒకటే బ్యాంక్ అకౌంటా, మీరెంత రిస్క్‌లో ఉన్నారో తెలుసా?

Online Banking: అన్ని అవసరాలకు ఒకటే బ్యాంక్ అకౌంటా, మీరెంత రిస్క్‌లో ఉన్నారో తెలుసా?

టాప్ స్టోరీస్

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్