Harish Rao Father Death: హరీష్ రావు తండ్రి కన్నుమూత, ఫోన్ చేసి పరామర్శించిన కేసీఆర్.. మధ్యాహ్నం అంత్యక్రియలు
Harish Rao father satyanarayana Dies | తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూశారు. హరీష్ రావును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించారు.

Harish Rao father Demise | సిద్దిపేట: తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు కుటుంబంలో విషాదం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూశారు. హరీష్ రావు తండ్రి మృతిపై బీఆర్ఎస్ పార్టీ నేతలు సంతాపం తెలుపుతున్నారు. హరీష్ రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తన్నీరు సత్యనారాయణ పార్థివదేహం సందర్శనార్థం హైదరాబాద్‌లోని వారి స్వగృహం క్రిన్స్ విల్లాస్‌లో ఉంచుతున్నట్లు పార్టీ తెలిపింది. ఈ రోజు మధ్యాహ్నం ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం..
తన బావ తన్నీరు సత్యనారాయణ మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తన 7వ సోదరి, అక్క లక్ష్మీ భర్త.. మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తండ్రి, తన్నీరు సత్యనారాయణ. బావతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ స్మరించుకుని, వారి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రార్థించారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు గారికి పితృవియోగం.
— BRS Party (@BRSparty) October 28, 2025
హరీష్ రావు గారి తండ్రి శ్రీ తన్నీరు సత్యనారాయణ గారు మరణించారని తెలియజేయుటకు చింతిస్తున్నాము.
వారి మృతికి బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము 🙏
తన్నీరు సత్యనారాయణ గారి పార్థివదేహం సందర్శనార్థం… pic.twitter.com/bK8jkijv4S
సమాచారం తెలిసిన వెంటనే హరీష్ రావుకు ఫోన్ చేసి పరామర్శించారు. హరీష్ కుటుంబ సభ్యులను కేసీఆర్ ఫోన్లో ఓదార్చి... తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరికాసేపట్లో హరీష్ రావు నివాసానికి వెళ్లి, తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులు అర్పించనున్నారు. తన సోదరి లక్ష్మీని, హరీష్ రావు కుటుంబ సభ్యులను కేసీఆర్ ఓదార్చనున్నారు.






















