అన్వేషించండి

Inflation Projection: ధరలతో దబిడి దిబిడే - ఇంత పెద్ద విషయాన్ని ఆర్‌బీఐ ఎంత కూల్‌గా చెప్పిందో!

RBI News: వడ్డీ రేట్లు తగ్గుతాయి, EMIల మొత్తం తగ్గుతుందని ఆశ పడినవారికి ఇది పెద్ద ఎదురు దెబ్బ.

RBI Inflation Projection: 2023-24 ఆర్థిక సంవత్సరానికి (FY24) సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ద్రవ్య విధాన కమిటీ (RBI MPC Meeting) ఐదో సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. ఆర్‌బీఐ తన రెపో రేటులో (repo rate) ఎలాంటి మార్పు చేయలేదు. 6.50 శాతం వద్దే కొనసాగించింది. రెపో రేటులో మార్పు ఉండదన్న విషయాన్ని మొదటి నుంచి ఊహిస్తున్నదే కాబట్టి, ఈ నిర్ణయం మార్కెట్‌ను ఆశ్చర్యపరచలేదు.

అయితే, రెపో రేటును స్థిరంగా ఉంచితే బ్యాంక్‌ వడ్డీ రేట్లు (bank interest rates) పెరిగే ఛాన్స్‌ ఉండదు. కాబట్టి, రుణం తీసుకున్న/తీసుకోబోయే ప్రజల మీద అదనపు EMI భారం పడదు. వడ్డీ రేట్లు తగ్గుతాయి, EMIల మొత్తం తగ్గుతుందని ఆశ పడినవారికి ఇది పెద్ద ఎదురు దెబ్బ.          

FY24లో ద్రవ్యోల్బణం అంచనా 
రెపో రేటును ప్రకటిస్తూనే, FY24లో ద్రవ్యోల్బణం అంచనాలను కూడా ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ (RBI Governor Shaktikanta Das) వెల్లడించారు. మొత్తం 2023-24 ఆర్థిక సంవత్సరంలో వినియోగదారు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (CPI Inflation) 5.40 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. అంతకు ముందు, ఈ ఏడాది ఆగస్టులో, RBI తన ద్రవ్యోల్బణ రేటు అంచనాను 5.1 శాతం నుంచి 5.40 శాతానికి పెంచింది. తాజా, కూడా అదే అంచనాను (5.40%) కొనసాగించింది.

మరో ఆసక్తికర కథనం: మళ్లీ రూ.64,000 వైపు పసిడి పరుగు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి 

FY24 కోసం ద్రవ్యోల్బణం అంచనాను మార్చకపోవడాన్ని ఇక్కడ ప్రత్యేకంగా గమనించాలి. ఎందుకంటే, ఇటీవలి కాలంలో ఆహార పదార్థాల ధరలు భారీగా పెరిగాయి. ఆహార ధరల్లో జంప్‌ కారణంగానే పాత లెక్కనే ఈసారి కూడా అప్పజెప్పింది కేంద్ర బ్యాంక్‌. ఆహార పదార్థాల ధరలు ఇప్పట్లో తగ్గే సూచనలు లేవు, సామాన్యుడిపై ధరాభారం కొనసాగుతుందన్నది దీని అర్ధం. ఇంత పెద్ద విషయాన్ని ఆర్‌బీఐ గవర్నర్‌ చాలా కూల్‌గా చెప్పారు.

డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం - ఆర్‌బీఐ గవర్నర్
రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధానాల్లో మార్పుల ప్రభావం మొత్తం ద్రవ్యోల్బణం గణాంకాలపై స్పష్టంగా కనిపిస్తోందని, అయితే ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదలకు సరఫరా గొలుసు వంటి చాలా ఇతర కారణాలు ఉన్నాయని దాస్ చెప్పారు. ఆహార పదార్థాల ధరల పెరుగుదల ప్రభావం నవంబర్ నెల ద్రవ్యోల్బణంలో స్పష్టంగా కనిపిస్తుంది. బహుశా డిసెంబర్‌ నంబర్‌లోనూ ఆ ప్రభావం గట్టిగానే ఉండవచ్చు.           

FY25లో ద్రవ్యోల్బణం అంచనాలు అంచనా
2024 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ‍(2023 అక్టోబర్‌-డిసెంబర్‌ కాలం)‌ ద్రవ్యోల్బణం రేటు 5.6 శాతంగా, నాలుగో త్రైమాసికంలో (2024 జనవరి-మార్చి కాలం) 5.20 శాతంగా సెంట్రల్ బ్యాంక్ అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో (FY25), ద్రవ్యోల్బణం మొదటి త్రైమాసికంలో 5.20 శాతం, రెండో త్రైమాసికంలో 4 శాతం, మూడో త్రైమాసికంలో 4.70 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ లెక్కగట్టింది.           

మరో ఆసక్తికర కథనం: ఈఎంఐల భారం నుంచి ఈసారి కూడా ఉపశమనం లేదు - రెపో రేట్‌ యథాతథం  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Foundation Day: అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒంటపట్టించుకుని కెసిఆర్ చూపిస్తున్న బాటలో పునరంకితం అవుదాం- బీఆర్‌ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒంటపట్టించుకుని కెసిఆర్ చూపిస్తున్న బాటలో పునరంకితం అవుదాం- బీఆర్‌ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
కాసేపట్లో వైసీపీ మేనిఫెస్టో-హామీలపై సర్వత్రా ఆసక్తి..!
కాసేపట్లో వైసీపీ మేనిఫెస్టో-హామీలపై సర్వత్రా ఆసక్తి..!
Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ అలజడి, CRPF సిబ్బందిపై మిలిటెంట్‌ల దాడి - ఇద్దరు సైనికులు మృతి
Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ అలజడి, CRPF సిబ్బందిపై మిలిటెంట్‌ల దాడి - ఇద్దరు సైనికులు మృతి
Best Horror Movies on OTT: బొమ్మలో అమ్మను చూడాలనుకొనే చిన్నారి - ఆత్మలతో ఆట.. ఊహించని వేట, ఈ ఇండోనేషియన్ మూవీని అస్సలు మిస్ కావద్దు
బొమ్మలో అమ్మను చూడాలనుకొనే చిన్నారి - ఆత్మలతో ఆట.. ఊహించని వేట, ఈ ఇండోనేషియన్ మూవీని అస్సలు మిస్ కావద్దు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KKR vs PBKS Match Highlights | IPL 2024 లో ఇన్ని సార్లు 250+ స్కోర్లు రావటానికి కారణాలేంటీ.? | ABPKKR vs PBKS Match Highlights | సరికొత్త చరిత్ర రాసిన కోల్ కతా, పంజాబ్ మ్యాచ్ | IPL 2024 | ABP DesamKKR vs PBKS Match Highlights | Shashank Singh ఊచకోత ఇన్నింగ్స్ తో పంజాబ్ కు ఊపిరి | IPL 2024 | ABPKKR vs PBKS Match Highlights | చరిత్ర చూడని ఛేజింగ్ తో కోల్ కతా ఫ్యూజులు ఎగిరిపోయాయి | IPL 2024 |ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Foundation Day: అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒంటపట్టించుకుని కెసిఆర్ చూపిస్తున్న బాటలో పునరంకితం అవుదాం- బీఆర్‌ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒంటపట్టించుకుని కెసిఆర్ చూపిస్తున్న బాటలో పునరంకితం అవుదాం- బీఆర్‌ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
కాసేపట్లో వైసీపీ మేనిఫెస్టో-హామీలపై సర్వత్రా ఆసక్తి..!
కాసేపట్లో వైసీపీ మేనిఫెస్టో-హామీలపై సర్వత్రా ఆసక్తి..!
Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ అలజడి, CRPF సిబ్బందిపై మిలిటెంట్‌ల దాడి - ఇద్దరు సైనికులు మృతి
Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ అలజడి, CRPF సిబ్బందిపై మిలిటెంట్‌ల దాడి - ఇద్దరు సైనికులు మృతి
Best Horror Movies on OTT: బొమ్మలో అమ్మను చూడాలనుకొనే చిన్నారి - ఆత్మలతో ఆట.. ఊహించని వేట, ఈ ఇండోనేషియన్ మూవీని అస్సలు మిస్ కావద్దు
బొమ్మలో అమ్మను చూడాలనుకొనే చిన్నారి - ఆత్మలతో ఆట.. ఊహించని వేట, ఈ ఇండోనేషియన్ మూవీని అస్సలు మిస్ కావద్దు
Special Trains: రైల్వే ప్రయాణీకులకు శుభవార్త.. సమ్మర్‌ స్పెషల్‌ ట్రైన్స్‌ ఇవే..!
రైల్వే ప్రయాణీకులకు శుభవార్త.. సమ్మర్‌ స్పెషల్‌ ట్రైన్స్‌ ఇవే..!
Sukumar About Suhas: కేశ‌వ‌ క్యారెక్ట‌ర్ సుహాస్ చేయాల్సింది.. బ‌న్నీ ఎప్పుడూ ఇతడి గురించే చెప్తాడు: డైరెక్ట‌ర్ సుకుమార్
కేశ‌వ‌ క్యారెక్ట‌ర్ సుహాస్ చేయాల్సింది.. బ‌న్నీ ఎప్పుడూ ఇతడి గురించే చెప్తాడు: డైరెక్ట‌ర్ సుకుమార్
Varalaxmi Sarathkumar: చిన్నప్పుడే లైంగిక వేధింపులకు గురయ్యాను, థెరపీకి వెళ్లాను - వరలక్ష్మి శరత్‌కుమార్
చిన్నప్పుడే లైంగిక వేధింపులకు గురయ్యాను, థెరపీకి వెళ్లాను - వరలక్ష్మి శరత్‌కుమార్
YSRCP News Strategy: ప్రత్యర్థి పేర్లతో బరిలో ఇండిపెండెంట్లు- ప్రధాన పార్టీ అభ్యర్థులకు కొత్త చికాకులు
ప్రత్యర్థి పేర్లతో బరిలో ఇండిపెండెంట్లు- ప్రధాన పార్టీ అభ్యర్థులకు కొత్త చికాకులు
Embed widget