అన్వేషించండి

India GDP Growth: దటీజ్‌ ఇండియా! జీడీపీ వృద్ధిరేటు 6.3% - నెమ్మదించినా ప్రపంచంలోనే బెస్ట్‌!

India GDP Growth: భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు కాస్త నెమ్మదించింది. జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో 6.3 శాతం వృద్ధిరేటు నమోదు చేసింది. అంతర్జాతీయంగా అత్యధిక జీడీపీ వృద్ధిరేటు భారత్‌కే సొంతం!

India GDP Growth: భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు కాస్త నెమ్మదించింది. జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో 6.3 శాతం వృద్ధిరేటు నమోదు చేసింది. తయారీ రంగంలో బలహీనత, కంపెనీల మార్జిన్లు తగ్గడంతో వేగం మందగించింది. అంతర్జాతీయంగా అత్యధిక జీడీపీ వృద్ధిరేటు భారత్‌కే సొంతం!

* కేంద్ర ప్రభుత్వం బుధవారం సాయంత్రం రెండో త్రైమాసికం జీడీపీ గణాంకాలు విడుదల చేసింది. '2022-23 రెండో త్రైమాసికంలో వాస్తవ జీడీపీని 38.17 లక్షల కోట్లుగా అంచనా వేసింది. 2021-22 రెండో త్రైమాసికంలోని రూ.35.89 లక్షలతో పోలిస్తే 6.3 శాతం వృద్ధి చెందినట్టు చెప్పింది. గతంలో ఇది 8.4 శాతం అని ఆర్థిక శాఖ వెల్లడించింది.

* సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు మందగించింది. ఏప్రిల్‌-జూన్‌లో ఇది 13.5 శాతంగా ఉండేది. అప్పటికి కొవిడ్‌ నిబంధనలు ఎత్తేస్తుండటం, ఎకనామిక్‌ యాక్టివిటీ పుంజుకోవడం కారణాలు.

*  ఈ త్రైమాసికంలో తయారీ రంగం వృద్ధిరేటు 5.6 శాతం నుంచి 4.3 శాతానికి తగ్గింది. వ్యవసాయ రంగం 4.6 శాతం వృద్ధిరేటు నమోదు చేసింది. గతంలో ఇది 4.5 శాతం కావడం గమనార్హం.

* ముడి వనరుల ధరలు పెరగడం, కంపెనీల మార్జిన్లు తగ్గడంతో తయారీ రంగం వృద్ధిరేటు బలహీన పడిందని ఎస్‌బీఐ రీసెర్చ్‌ రిపోర్టు పేర్కొంది. గతంతో పోలిస్తే ట్రేడ్‌, హాస్పిటాలిటీ, టూరిజం వృద్ధిరేటు 9.6 నుంచి 14.7 శాతానికి పెరిగింది.

* గతంలోని 14.5 శాతం పోలిస్తే మైనింగ్‌ రంగం వృద్ధిరేటు 2.8 శాతానికి కుంచించుకుపోయింది. అయితే నిర్మాణ రంగం మాత్రం 6.6 శాతం వృద్ధిరేటు నమోదు చేసింది.

* రెండో త్రైమాసికంలో వృద్ధిరేటు 6.1-6.3 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. చాలామంది విశ్లేషకులు, ఇండస్ట్రీ నిపుణులు జీడీపీ వృద్ధిరేటు 5.8 నుంచి 7.2 శాతం మధ్య ఉంటుందని అంచనా వేయడం గమనార్హం.

* జులై-సెప్టెంబర్‌ త్రైమాసికం వృద్ధిలో డొమస్టిక్‌ డిమాండ్‌ కీలక పాత్ర పోషించిందని, ఎగుమతుల జోరు తగ్గిందని డీబీఎస్‌ గ్రూప్‌ రీసెర్చ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాధికా రావ్‌ తెలిపారు.

* స్థూల విలువ ఆధారంగా ఈ త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 12.7 నుంచి 5.6 శాతానికి తగ్గింది. అంతకు ముందు ఏడాది ఇది 8.3 శాతంగా ఉంది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో గ్రోత్‌రేట్‌ 13.7 శాతం నుంచి 9.7 శాతానికి నెమ్మదించింది.

* రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కొనసాగుతున్నా, ద్రవ్యోల్బణం పెరిగినా చైనాతో పోలిస్తే భారత్‌ మెరుగ్గా ఉంది. జులై-సెప్టెంబర్లో చైనా 3.9 శాతం వృద్ధిరేటు నమోదు చేసింది.

* కొవిడ్‌ అవాంతరాలు తొలగిపోవడం, పండుగల సీజన్‌ కావడంతో ప్రభుత్వం క్యాపిటల్‌ స్పెండింగ్‌ పెంచింది. ఈ ఏడాది 40 శాతం అధికంగా అంటే రూ.1.67 ట్రిలియన్లు ఖర్చు చేసింది. సెప్టెంబర్‌తో మొదలైన పండగల సీజన్‌ క్రిస్మస్‌తో ముగియనుంది. గ్రోత్‌ ఇలాగే కొనసాగనుంది.

Also Read: లక్ష రూపాయల్ని రూ.14 కోట్లుగా మార్చిన మల్టీబ్యాగర్‌ షేరు!

Also Read: గ్యాస్‌ ధరల్లో మార్పు! డిసెంబర్లో మారుతున్న ఆర్థిక నిబంధనలు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం-   చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం- చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
Elections Commission News: ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
SS Rajamouli: ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
Sriram: అప్పుడు భూమిక పారిపోయింది, కత్తి ఉంటే తనని పొడిచేసేవాడిని - శ్రీరామ్
అప్పుడు భూమిక పారిపోయింది, కత్తి ఉంటే తనని పొడిచేసేవాడిని - శ్రీరామ్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Pinkvilla Screen And Style Awards: ముంబయిలో ఘనంగా జరిగిన అవార్డుల వేడుక, విభిన్న డ్రెస్సుల్లో తారలుRajamouli Mahesh Babu Movie: జపాన్ లో RRR స్క్రీనింగ్స్ సందర్భంగా మహేష్ మూవీ అప్డేట్ ఇచ్చిన జక్కన్నShraddha Kapoor Pizza Paparazzi: పింక్ విల్లా స్క్రీన్ అండ్ స్టయిల్ అవార్డుల్లో ఆసక్తికర ఘటనAnupama Parameswaran Tillu Square Song Launch: అనుపమ మాట్లాడుతుంటే ఫ్యాన్స్ హడావిడి మామూలుగా లేదు..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం-   చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం- చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
Elections Commission News: ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
SS Rajamouli: ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
Sriram: అప్పుడు భూమిక పారిపోయింది, కత్తి ఉంటే తనని పొడిచేసేవాడిని - శ్రీరామ్
అప్పుడు భూమిక పారిపోయింది, కత్తి ఉంటే తనని పొడిచేసేవాడిని - శ్రీరామ్
Home Loan: క్రెడిట్‌ స్కోర్‌ తక్కువున్నా గృహ రుణం, ఈ ఉపాయాలు తెలిస్తే చాలు!
క్రెడిట్‌ స్కోర్‌ తక్కువున్నా గృహ రుణం, ఈ ఉపాయాలు తెలిస్తే చాలు!
South Costal Politics: వైసీపీ కోటలో టీడీపీ పాగా వేసేనా..? రెడ్డిరాజ్యంలో పట్టు నిలుపుకునేదెవరో..?
వైసీపీ కోటలో టీడీపీ పాగా వేసేనా..? రెడ్డిరాజ్యంలో పట్టు నిలుపుకునేదెవరో..?
Manchu Lakshmi: మంచు లక్ష్మి కాళ్లు మొక్కిన అభిమాని - ‘ఆదిపర్వం’ ట్రైలర్ లాంచ్‌లో అనూహ్య ఘటన
మంచు లక్ష్మి కాళ్లు మొక్కిన అభిమాని - ‘ఆదిపర్వం’ ట్రైలర్ లాంచ్‌లో అనూహ్య ఘటన
Rajamouli On SSMB29: మహేష్ బాబు సినిమా అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
మహేష్ బాబు సినిమా అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
Embed widget